ఆపరేషన్ సిందూర్ విజయం ప్రశంసనీయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన సాయుధ దళాలు నిన్న తీసుకున్న చర్యకు, వారు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన రక్షణ మంత్రి పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను మన దళాలు ధ్వంసం చేసిన విధానం మనందరికీ గర్వకారణమన్నారు. 'ఆపరేషన్ సిందూర్' ఖచ్చితత్వంతో నిర్వహించారన్నారు.
వెనక్కి వెళ్ళే హడావుడిలో అమెరికా పెద్ద తప్పే చేసింది. తన ఆయుధ డంపులను అఫ్గాన్‌లోనే వదిలేసింది. ఈ నిర్లక్ష్యం తాలిబన్లకు వరంగా మారింది. సుల్తాన్‌ఖిల్ సైనిక స్థావరంలోని కంటైనర్ల కొద్దీ ఆయుధాలు, వాహనాలు తాలిబన్ల సొంతమయ్యాయి. అప్ఘాన్ సేన కోసం అమెరికా ఇరవైఏళ్లుగా అనేక ఆధునాతన ఆయుధాలను భారీగా సమకూర్చింది. అమెరికా భాగస్వామ్యంలో అందించిన బోలెడు ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు, ఎన్నో సైనిక మౌలిక వసతులు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఇంతకాలం అందని వైమానిక సంపత్తి…