Pushpa 2 : ప్రస్తుతం పుష్ప 2 సినిమా ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తుందో తెలిసిందే. డిసెంబర్ 5న విడుదల అయిన పుష్ప 2 ఇప్పటి వరకు 625కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి పాన్ ఇండియా మార్కెట్ ని పుష్ప రాజ్ తన మేనియాతో ఊపేస్తున్నాడు. హిందీ తెలుగు తమిళ్ అని లేకుండా నైజాం నుంచి నార్త్ అమెరికా వరకు రికార్డులను ఉరికించి కొడుతున్నాడు. ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ ఓపెనర్ గా బాహుబలి 2 ఉంటే దానిని ఆర్ఆర్ఆర్ చిత్రం బ్రేక్ చేసింది. అయితే ఈ తర్వాత కూడా చాలా చిత్రాలు హిందీ సహా తెలుగు నుంచి వచ్చాయి కానీ ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్ రికార్డుని మాత్రం టచ్ చేయలేకపోయాయి.
Read Also:KTR : రైతుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
కానీ దీనిని భారీ మార్జిన్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవైటెడ్ సీక్వెల్ “పుష్ప 2” తో బ్రేక్ చేసేశాడు. అయితే పుష్ప 2 ఇచ్చిన ఈ బిగ్ టార్గెట్ ని మళ్లీ ఏ సినిమా బీట్ చేస్తుందనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మొదలైంది. కానీ దీనిని కొట్టే పొటెన్షియల్ మాత్రం ఇటీవల కాలంలో ఒకే ఒక్క చిత్రానికి ఉందనే చెప్పుకోవచ్చు. ఆ చిత్రమే “వార్ 2”. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మ్యాన్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సీక్వెల్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
Read Also:Kadiyam Srihari : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి 750కోట్లు నిధులు సీఎం కేటాయించారు
ఎన్టీఆర్ సోలో గానే దేవరతో రికార్డు ఓపెనింగ్స్ సాధించాడు. ఇంకో పక్క వార్ 2 పై కూడా ఓ రేంజ్ లో హైప్ నెలకొంది. అటు హిందీ ఇటు తెలుగు సినిమాలో కూడా భారీ అంచనాలు దీనిపై భారీగా ఉన్నాయి. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా వార్ మొదటి సినిమా భారీ వసూళ్లను అందుకుంది. ఇలా అన్ని కొలమానాలను చూస్తే పుష్ప 2 ఓపెనింగ్స్ ని బీట్ చేసే ఒకే ఒక్క సినిమాగా ఇప్పటికైతే ఇది కనిపిస్తుంది. ఇక ఈ అవైటెడ్ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 15 కానుకగా విడుదల కాబోతుంది.