ఉల్లిగడ్డ తో కొత్త వ్యాధి..వణికిపోతున్న ప్రజలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాను మరో కొత్త వ్యాధి వణికిస్తోంది. వంటగదిలో ఉండే ఉల్లిపాయల నుంచి సాల్మొనెల్లోసిస్ అనే వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.సాల్మోనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తికి ఉల్లిపాయలకు మధ్య సంబంధం ఉందని సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ (CDC) తేల్చింది. అక్టోబరు 18 నాటికి 37 రాష్ట్రాల్లో 652 మందికి వ్యాపించిందని CDC డేటా తెలిపింది. ఈ వ్యాధి మరింత ప్రబలితే మహమ్మారిగా మారే నిజానికి సెప్టెంబరు నెల మధ్యలోనే ఈ సాల్మోనెల్లా కేసులు బయటపడ్డాయి. కానీ, ఏ ఆహారం వల్ల వచ్చిందనే విషయాన్ని అధికారులు గుర్తించలేదు. ప్రధానంగా మెక్సికో, చిహువా నుంచి ప్రోసోర్స్ అనే సంస్థ ….ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంది. ఈ ఉల్లిపాయలను దేశంలోని అనేక రెస్టారెంట్లు, కిరాణా షాపులకు పంపిణీ చేసింది.
అమెరికాలో ప్రస్తుత వ్యాధి వ్యాప్తికి ఈ ఉల్లిపాయలే కారణమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఉల్లిపాయల సరఫరాదారులకు ఈ సాల్మొనెల్లా వ్యాప్తితో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.మూడు నెలలపాటు నిల్వ చేసిన ఉల్లిపాయలను వాడొద్దని సీడీసీ.. వినియోగదారులను హెచ్చరించింది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకపోయినా, మెక్సికో నుంచి వచ్చినవైనా, ఎలాంటి స్టిక్కర్ లేకపోయినా, ప్రోసోర్స్ సంస్థ నుంచి వచ్చిన ఉల్లిపాయలైనా.. వాటిని బయట పడేయాలని సీడీసీ సూచించింది.
Also Read
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
జులై 1 నుంచి ఆగస్టు 27 వరకు దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను వెనక్కు తీసుకునేందుకు ప్రోసోర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ -FDA తెలిపింది. ఇప్పటికే అన్నీ దుకాణదారులు, ఉల్లిపాయలు వెనక్కు పంపాలని ప్రోసోర్స్ రీకాల్ నోటీసులు జారీ చేసిందని FDA స్పష్టంచేసింది.ఇప్పటికే అమెరికాలోని 37 రాష్ట్రాల్లో సాల్మొనెల్లా వ్యాపించిందని సీడీసీ గుర్తించింది. టెక్సాస్ రాష్ట్రంలో అత్యధికంగా 158 కేసులు, ఒక్లహామాలో 98, వర్జీనియాలో 59, మేరీల్యాండ్‌లో 58, ఇల్లినాయిస్‌లో 37, విస్కాసిన్‌లో 25, మిన్నెసోటాలో 23, మిస్సోరీలో 21 కేసులు నమోదయ్యాయని సీడీసీ తెలిపింది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించిన కేసుల కన్నా బాధితుల సంఖ్య ఎక్కువే ఉండవచ్చని సీడీసీ అభిప్రాయపడింది. చాలా మందికి సాల్మొనెల్లా పరీక్షలు చేయకముందే వారు కోలుకుంటున్నారని సంస్థ తెలిపింది.
తాజావార్తలు
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!