NTV Telugu Site icon

Narasapur: డంపింగ్‌యార్డ్‌కు వ్యతిరేకంగా నర్సాపూర్ లో బంద్..

Narsapur

Narsapur

Narasapur: నర్సాపూర్ టౌన్‌లో ప్రస్తుతం జరుగుతున్న బంద్ తీవ్ర ఉద్వేగం సృష్టిస్తోంది. అఖిలపక్షం ప్యారానగర్ ప్రాంతంలో GHMC డంప్ యార్డు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్యారానగర్‌లో డంప్ యార్డు ఏర్పాటు చేయడంపై స్థానికుల నుంచి అనేక ఆందోళనలు వస్తున్నాయి. దీనితో స్థానిక ప్రజలంతా ఈ డంప్ యార్డుతో సంబంధించిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డుతో నర్సాపూర్ రాయరావు చెరువులో వ్యర్థజలాలు కలుషితమవుతాయని తెలుపుతున్నారు. ఈ కారణంగా పంట పొలాలు, నీటి వనరులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Road Transport and Highways: తెలంగాణకు 176.5 కోట్లు విడుదల

బంద్‌కు స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు, స్కూళ్లు కూడా మద్దతు ఇవ్వడం అక్కడి పరిస్థితిని మరింతగా తీవ్రతరం చేస్తుంది. గుమ్మడిదల (మం) గ్రామం నల్లవల్లి ప్రాంతంలోని గ్రామస్థులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అక్కడ వారు సెల్ఫీ వీడియోలు తీసి తమ నిరసనను ప్రజలకు అందించారు. ఈ విషయంలో నర్సాపూర్ BRS ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. “ప్యారానగర్ ప్రాంతంలో డంపింగ్ యార్డు నిర్మించడానికి ప్రతిపక్షాలపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇది పచ్చని పంటలను పాడుచేస్తుందని” అన్నారు. డంపింగ్ యార్డు నిర్మాణం ఆపకుంటే, లగచర్ల తరహాలో పోరాటం తప్పదని ఆమె హెచ్చరించారు.

Also Read: Mulugu: గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు మృతి.. స్పందించిన మంత్రి

BRS ప్రభుత్వం డంపింగ్ యార్డుకు కేవలం అనుమతులు మాత్రమే ఇచ్చింది. కానీ, పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదని తెలిపారు. అర్ధరాత్రి ఇంట్లో పడుకున్న వాళ్ళని అరెస్ట్ చేసి, రాత్రి సమయంలో పెద్దఎత్తున పనులు చేయడం ప్రజల మనసులు ద్రోహం చేస్తున్నట్లు కనిపిస్తుంది.ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రజలను దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ప్రజల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డు నిర్మాణం వల్ల పర్యావరణ కాలుష్యం, నీటి కాలుష్యం వంటి సమస్యలు మరింత విస్తరించనున్నాయి.