OnePlus Nord CE 3 5G Launch in India 2023: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘వన్‌ప్లస్’కి భారత్ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ‘ఐఫోన్’ మాదిరి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కూడా తమ జేబులో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఇందుకు కారణం వన్‌ప్లస్ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ.. కస్టమర్లను ఆకర్షించడమే. వన్‌ప్లస్ మరో సూపర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. నార్డ్ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5G (OnePlus Nord CE 3 5G) స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ సేల్స్ భారత్‌లో శుక్రవారం (ఆగష్టు 4) నుంచి ప్రారంభమయ్యాయి.
జులైలో నిర్వహించిన వన్‌ప్లస్ నార్డ్ సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో నార్డ్ 3 5G, నార్డ్ బడ్స్ 2rతో పాటు నార్డ్ CE 3 5Gని వన్‌ప్లస్ కంపెనీ లాంచ్ చేసింది. నార్డ్ 3 5G, నార్డ్ బడ్స్ 2r సేల్స్ ఇప్పటికే భారత్‌లో మొదలవ్వగా.. తాజాగా నార్డ్ సీఈ 3 5G అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సహా వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అమ్మకాలు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ కంపెనీ ఈ ఫోన్‌పై రూ. 2000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 26999గా ఉంది. 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.28999గా ఉంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో Aqua Surge OnePlus Nord CE3 5G 8 GB RAM + 128 GB Storage వేరియంట్ ధర రూ. 26,999గా ఉంది.
Also Read: Saturday Remedies: శనివారం నాడు ఈ పరిహారం చేస్తే.. ఊహించని డబ్బు మీ సొంతం!
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5G ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా పంచ్-హోల్ కటౌట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 782G SoC ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్ కెమెరా వెనకాల ఉన్నాయి. సెల్ఫ కోసం16MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5G ఫోన్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దాంతో తక్కువ సమయంలోనే ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఆక్సిజన్ OS 13.1 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో Android 13 OSతో రన్ అవుతుంది. 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, USB టైప్-C పోర్ట్ ఇందులో ఉన్నాయి.