భారత్‌లో ఐఫోన్ తర్వాత ‘వన్‌ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ వరుసగా ప్రీమియం ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. 2024 జనవరిలో వన్‌ప్లస్ 12ను రిలీజ్ చేయగా.. సూపర్ సక్సెస్ అయింది. ప్రీమియం సిరీస్‌లో ‘వన్‌ప్లస్ 13’ను తీసుకొస్తోంది. గత కొన్ని వారాలుగా వన్‌ప్లస్ 13 గురించి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుండగా.. ఎట్టకేలకు లాంచ్ డేట్ తెలిసింది.
వన్‌ప్లస్ 12 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తున్న వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 31న లాంచ్ కానుంది. ముందుగా చైనా మార్కెట్‌లో మాత్రమే రిలీజ్ అయి.. తర్వాత భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వన్‌ప్లస్ 13కు సంబందించిన టీజర్ కూడా తాజాగా వచ్చింది. ఇందులో మూడు కలర్ వేరియంట్‌లలో కనిపించింది. అబ్సిడియన్ బ్లాక్, బ్లూ మూమెంట్, వైట్ డ్యూ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ ప్రీమియం ఫోన్.. ట్రిపుల్ కెమెరా సెటప్, జంబో బ్యాటరీతో రానుంది.
Also Read: Sony Bravia Price: అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్.. సగం ధరకే ‘సోనీ బ్రేవియా’ 55 ఇంచెస్ టీవీ!
లీకైన వివరాల ప్రకారం… ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో రానుంది. ఇందులో గేమింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రపంచంలోనే మొదటి సెకండ్-జెన్ 2కే బీఓఈ ఎక్స్2 కర్వ్‌డ్ డిస్‌ప్లేని కలిగి ఉంటుందని తెలుస్తోంది. 24 జీబీ ర్యామ్‌ను ఇందులో ఇస్తున్నారట. దాంతో ఈ మొబైల్ పనితీరు బాగుంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని సమాచారం. ప్రధాన కెమెరా 50 ఎంపీ LYT808 సెన్సర్, 50 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ , 50 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ 13 ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని తెలుస్తోంది. బేస్ వేరియంట్ ధర 60 వేలు ఉండే అవకాశం ఉంది.