Bhatti Vikramarka : నేటితో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఏడాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో నాడు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క తన పాదయాత్రను మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి నుంచి ప్రారంభమైన పాదయాత్ర జులై 2న ఖమ్మం నగరంలో ముగిసింది. నాడు నిరాశలో నిండిన కాంగ్రెస్ పార్టీ కేడర్ లో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొత్తంగా 109 రోజులు పాటు కొనసాగింది. సుమారు 700కు పైగా గ్రామాల మీదుగా భట్టి విక్రమార్క 1364 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర మొత్తంగా 17 జిల్లాల్లో 36 నియోజకర్గాల మీదుగా కొనసాగింది. ఈ పాదయాత్రలో 100కు కార్నర్ మీటింగ్స్, మంచిర్యాల, జడ్చెర్ల, ఖమ్మంలలో భారీ బహిరంగ సభలు జరిగాయి. మంచిర్యాల సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఖమ్మం బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యతిధులుగా హాజరయ్యారు.
Also Read
- Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
అప్పటి వరకూ ఎవరూ వెళ్లడానికి సాహసించని మరుమూల గ్రామాలు, కొండల్లో, అడవుల్లో నివాసముండే ఆదివాసులు గూడాలు, గిరిజన తాండాల ప్రజలను భట్టి విక్రమార్క ఈ పాదయాత్రలో కలిసి… వారికి బాధలను కష్టాలను తెలుసుకోవడం విశేషం.
ఈ పాదయాత్రలో ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలను అర్పించిన అమరుల ఆశయాల గురించి అడుగడుగునా ప్రజలతో చర్చించడం.. వారినుంచి వచ్చిన సానుకూల స్పందన.. నిన్నటి శాసనసభ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో.. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగిన మొత్తం 36 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 26 చోట్ల ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ గెలుపులో భట్టి విక్రమార్క పాదయాత్ర ఎంత కీలకంగా మారిందో చెప్పేందుకో ఈ గణాంకాలే పెద్ద నిదర్శనం.
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క.. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి రెండు గదులు ఇందిరమ్మ ఇల్లు, పోడు భూముల అంశం, ధరణి సమస్యలు, పేదలకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలండర్, ఆరోగ్య శ్రీ విస్తరణ సహా పలు అంశాలపై స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు చిత్తశుద్దితో నేడు కృషి చేస్తున్నారు.
ఏదేమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆశించినదానికంటే మెరుగైన ఫలితాలను సాధించి పెట్టింది.
తాజావార్తలు
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!