Jammu Kashmir: జాయింట్ ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆదివారం ఉత్తర కాశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో ఒక ఉగ్రవాద సహచరుడిని అరెస్టు చేశారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రవాదుల ఉనికి గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుండి వచ్చిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన తర్వాత పెత్‌కూట్ అడవిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించబడింది. నాలుగు పిస్టల్స్, ఒక హ్యాండ్ గ్రెనేడ్, ఇతర మండుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవంతమైన ఆపరేషన్ ఫలితంగా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని.. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Smriti Irani: రాహుల్ పై స్మృతి ఇరాని ఫైర్.. నువ్వేమైన ప్రధాని అభ్యర్థివా..?
ఏప్రిల్ 28న ఉధంపూర్ దాడిలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో విలేజ్ డిఫెన్స్ గార్డ్ (వీడీజీ) మరణించినప్పటి నుంచి జమ్మూకాశ్మీర్ చాలా అప్రమత్తంగా ఉంది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో పెద్దఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మే 4న, జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో భారత వైమానిక దళం (IAF) సైనికుడు ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. సూరంకోట్‌లోని సనాయ్ గ్రామంలో ఈ దాడి జరిగింది. గాయపడిన సిబ్బందిని ఉధంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తరలించగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.