NTV Telugu Site icon

One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుపై రచ్చ రచ్చ.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్

One Nation One Election Bill 2

One Nation One Election Bill 2

One Nation One Election Bill: జమిలీ ఎన్నికల (వన్ నేషన్ వన్ ఎలక్షన్) బిల్లులు లోక్‌సభ ముందుకు వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2024 డిసెంబర్ 17న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలీ ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ” వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ” పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రమంత్రి సభకు పరిచయం చేశారు. అయితే, జమిలీ ఎన్నికల బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఫెడరల్ వ్యవస్థకు నష్టం కలిగించడమేనని కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్డీఏ సర్కార్ చేస్తున్న చర్యలు రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. తక్షణమే జమిలీ ఎన్నికల బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ తివారీ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాష్ట్రాల అసెంబ్లీల కాలవ్యవధిని కుదించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టడాన్ని కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి సభ్యులైన సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లును ఉపసంహరించుకోవాలని సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

Also Read: One Nation One Election Bill: లోక్‌సభలో ‘జమిలి’ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌

జమిలీ ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను గత వారమే కేంద్ర కేబినేట్ ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు – 2024ను కేంద్ర మంత్రి సభ ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లు ఢిల్లీ, జమ్మూ-కశ్మీర్, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది. ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్‌సభతో పాటు నిర్వహించలేకపోతే, ఆ తర్వాత వాటిని జరిపే వీలును జమిలీ ఎన్నికల బిల్లులో ఇవ్వడం జరిగింది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి. ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు, వాటిని తర్వాత నిర్వహించేందుకు రాష్ట్రపతికి సిఫారసు చేసే అవకాశాన్ని 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2, క్లాజ్ 5 లో కల్పించనున్నారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు వాటిని తర్వాత నిర్వహించవచ్చు.

Show comments