అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ తన సత్తాను చాటుకుంటోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాదులో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం ఏర్పాటు కానుంది. హైదరాబాదులో తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ (Sandoz) ప్రకటించింది. అయితే.. మొత్తం 1800 మంది ఉద్యోగులు ఈ కేంద్రంలో పని చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్న కంపెనీకి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగం తమ ప్రభుత్వానికి ప్రాధాన్యత రంగం అని, ఈ రంగం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కంపెనీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Also Read : Union Budget 2023: పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
ఇదిలా ఉంటే.. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన సందర్భంగా.. 4 రోజుల్లో 52 వాణిజ్య, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలు జరిగినట్లు కేటీఆర్ తెలిపారు. దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ ప్రకటించారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు దావోస్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్‌స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్‌లో తమ సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
Also Read : Heavy Snow fall: ఉత్తరాదిలో కనిపించని నేల.. మూతపడిన 476రోడ్లు