NTV Telugu Site icon

Kishan Reddy: రెండో రోజుకు చేరిన బీజేపీ నేతల మూసీ నిద్ర..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: బీజేపీ నేతల మూసీ నిద్ర రెండో రోజుకు చేరింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి బీజేపీ మూసీ నిద్ర మొదలైంది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ముగియనుంది. నిన్న మూసి పరివాహక ప్రాంతాల్లో చేరుకున్న బీజేపీ నేతలు బస్తీల్లో పర్యటించారు. బస్తీ వాసుల ఇళ్లలోనే భోజనం చేసి అక్కడే నిద్ర చేశారు. మూసీ ప్రక్షాళన చేయండి… పేద ప్రజల ఇల్లు కూల్చకండి అనే డిమాండ్ తో.. సీఎం సవాల్ కు స్పందనగా బీజేపీ నేతలు మూసీ నిద్ర చేపట్టారు. మూసీ నిద్రలో భాగంగా వివిధ 20 బస్తీల్లో 20మంది ముఖ్య నేతలు బస్తీ నిద్ర చేశారు. అంబర్‌ పేట తులసిరామ్‌ నగర్‌ లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, మలక్‌పేట్‌ శాలివాహన నగర్‌ లో ఎంపీ లక్ష్మణ్, ఎల్బీనగర్‌ లో ఈటల, రాజేంద్ర నగర్‌ హైదర్‌ షా కోట్‌ లో కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి నిద్ర చేశారు. అక్కడవున్న వారితో కలిసి రాత్రి భోజనం చేశారు. ఇవాళ అల్పహారం సేకరించిన అనంతరం ఈ కార్యక్రమం ముగియనుంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 10 ఏళ్ల తర్వాత నల్గొండ ప్రజలకి నీళ్లు ఇవ్వడం కాదు వెంటనే ఇవ్వాలని తెలిపారు. దీనికి ఏకైక పరిష్కారం రీటైనింగ్ వాల్ కట్టడమే అన్నారు. కాంగ్రెస్ నేతలే అంటున్నారు ఈ ప్రాజెక్ట్ అయ్యేది లేదు.. పొయ్యేది లేదని తెలిపారు. నా డీఎన్ఏ ఏందో ప్రజలకు తెలుసన్నారు. బీఆర్‌ఎస్‌ కేసీఆర్‌ ,కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటే అన్నారు. ఇక్కడ ఉన్న పేద వాళ్ళ మీద నుండి బుల్డోజర్ లు ఎక్కిస్తారా? అని ప్రశ్నించారు. ఇన్ని వేల ఇళ్లు, దేవాలయాలు, ప్రార్థన మందిరాలు కూల్చుతారా? అని మండిపడ్డారు. రిటైనింగు వాల్ కట్టడం కూడా అంతా సులువు కాదన్నారు. DPR లేకుండా , నిధులు లేకుండా మూసి పునరుజ్జీవం ఎలా సాధ్యం అన్నారు. బీఆర్ఎస్‌ ఏమీ చేస్తుందో మాకు తెలియదన్నారు. నిజాం హయంలో కూడా రిటైనింగ్‌ వాల్స్ కట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా ప్రాజెక్ట్ లకు డబ్బులు ఇస్తుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వము ప్రాజెక్ట్ లు రాష్ట్రానికి ఉంటాయన్నారు.
Manipur Violence: సీఎం ఇంటిపై దాడి.. కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్- మణిపూర్‌లో మరోసారి హింసకు కారణం?