Hijab Row: హిజాబ్ అంశంపై సుప్రీం అస్పష్ట తీర్పు.. విస్తృత ధర్మాసనానికి బదిలీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hijab Row: విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం అస్పష్టమైన తీర్పును వెలువరించింది. న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై ఇవాళ విచారణ చేపట్టింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియా వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జస్టిస్ హేమంత్ గుప్తా కొట్టివేయగా, జస్టిస్ సుధాన్షు ధులియా వాటిని అనుమతించారు. కర్ణాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. జస్టిస్ సుధాన్షు ధులియా తోసిపుచ్చారు. భిన్న అభిప్రాయాలతో కూడిన తీర్పు నేపథ్యంలో విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేసే అవకాశం ఉంది.
విద్యా సంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇంతకుముందు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో 10 రోజుల పాటు వాదనలు సాగగా.. పిటిషనర్ల తరఫు 21 మంది న్యాయవాదులు, ప్రతివాదుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ వాదించారు.విద్యా సంస్థల్లో యూనిఫామ్‌లను సూచించేలా విద్యా సంస్థలను ఆదేశించాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వివిధ పిటిషన్లను కోర్టు విచారించింది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
India Slams Pakistan: ఐరాసలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్.. మండిపడిన భారత్
కోర్టును ఉద్దేశించి, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, తన రిజాయిండర్ సమర్పణలో, డ్రెస్ కోడ్‌ను అమలు చేసిన కర్ణాటక ప్రభుత్వ సర్క్యులర్‌లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) గురించి ఎటువంటి ప్రస్తావన లేదని అన్నారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దవే వాదించారు. పాఠశాలలు, కళాశాలల యూనిఫాం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివిధ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై విచారణ చేపట్టింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!