Omar Abdullah: నేడే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
- నేడే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా..
- ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం.
- ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా రెండోసారి నేడు (బుధవారం) ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎం కానున్నారు. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి దక్కవచ్చు. మంత్రి పదవి కోసం రాష్ట్ర అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా, ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ పేర్లు వినిపిస్తున్నాయి.
Also Read
- National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
- Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
- Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
అయితే, మీర్‌ను కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అక్టోబర్ 15న మాత్రమే కాంగ్రెస్ నియమించింది. కాబట్టి, ఆయనకు మంత్రి అయ్యే అవకాశాలు తక్కువ. ఇక నిజాముద్దీన్ భట్‌ను డిప్యూటీ స్పీకర్‌గా చేయవచ్చు. దీంతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి ఇవ్వొచ్చని సమాచారం. ప్రభుత్వంలో జమ్మూ ప్రాంతానికి తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి ఇది చేయవచ్చు. నేషనల్ కాన్ఫరెన్స్ నుండి ఏడుగురు మంత్రులను ప్రకటించే అవకాశాలున్నాయి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం సీఎంతో సహా మొత్తం మంత్రుల సంఖ్య అసెంబ్లీ సీట్లలో 10% మించకూడదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒమర్ అబ్దుల్లా మధ్యాహ్నం 3 గంటలకు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీతో సమావేశం కానున్నారు.
Read Also: Usha Lakshmi: ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉషాలక్ష్మి అస్తమయం
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Healthy Breakfast: ఈ చలికాలంలో తప్పకుండా తినాల్సిన హెల్దీ బ్రేక్‌ఫాస్ట్! 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..
-
AP-Tamil Nadu: తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఏపీకి లీక్.? 15 మంది అధికారులపై విజయ్ సర్కార్ వేటు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!