Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా రెండోసారి నేడు (బుధవారం) ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎం కానున్నారు. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్…