పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల అయింది. విడుదల అయిన మొదటి ఆట నుంచే సినిమాకి మంచి టాక్ వచ్చింది. అయితే సినిమాలో సుజిత్ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా సాహోతో లింక్ చేస్తూ ఒక సన్నివేశం ఉంది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్ సంపాదించింది. ఈ క్రమంలో ఈ రెండు సినిమాల అంశాలు కలిపి ఓజీ 2లో ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి.
READ MORE: AP Assembly: కామినేని vs బాలయ్య.. జగన్‌తో సినీ ప్రముఖుల మీటింగ్‌పై మాటల యుద్ధం
అయితే ఈ విషయం మీద తాజాగా సక్సెస్ మీట్ లో దర్శకుడు సుజిత్ స్పందించాడు. ఈ రెండు కలిపి ఒక సినిమా చేసే అవకాశం ఉందా అని అడిగితే అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఓ జి సినిమాకి సంబంధించిన హిట్ ఎంజాయ్ చేస్తున్నాం. పరిస్థితులు చక్కబడ్డాక రెండు కలిపి సినిమా చేయవచ్చా లేదా అనేది ఆలోచిస్తాం. నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్, అలాగే కళ్యాణ్ గారితో కూడా ఇప్పుడు మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ రెండు సినిమాల బ్యాక్ డ్రాప్స్ కలిపి ఒక సినిమా చేసే అవకాశం కూడా ఉంది. కానీ ప్రస్తుతానికైతే చేయాలి లేదా వద్దు అనే విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చాడు.