పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. పవన్ కళ్యాణ్ తన సినిమాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు.. అందులో ఒకటి ‘OG ‘ కూడా ఒకటి.. ప్రభాస్ సాహో దర్శకుడు సుజీత్ ఈ ప్రాజెక్టుని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగస్టర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ఈ టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గతంలో వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి..
అయితే ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ఇదే నంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈ చిత్రంలో పవన్ పాత్ర పేరు గాంధీ అని తెలుస్తోంది. క్యారక్టర్ పరంగా చూస్తేనేమో గ్యాంగస్టర్.. కానీ గాంధీ పేరు పెట్టడంతో.. అసలు ఈ చిత్రంలో పవన్ అసలు పాత్ర ఏంటి? ఎలాంటి లుక్‌లో కనిపిస్తారు? అనే చర్చ జరుగుతోంది… అయితే ఈ సినిమాను త్వరగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
తాజాగా మూవీ సెట్స్ లోని పవన్ కి సంబంధించిన ఓ ఫోటోని సుజిత్ షేర్ చేసారు. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ ని పవన్ కళ్యాణ్ ఫొటోతో సుజిత్ చేంజ్ చేసారు. ఆ ఫొటోలో పవన్, సుజిత్ బుజం పై చెయ్యి వేసి నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే బ్యాక్ షాట్ నుంచే మాత్రమే ఈ ఫోటో కనిపిస్తుంది. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది..
They’re planning for a theatres mayhem #TheyCallHimOG #PawanKalyan #Sujeeth pic.twitter.com/TKuKrN3ceS
— Chavanprash (@VijjayKrisshhhh) February 16, 2024