OG Firestorm: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాబోయే యాక్షన్ చిత్రం OG లోని తొలి పాట ఫైర్‌స్టోర్మ్ సంచలనం సృష్టిస్తుంది. థమన్ స్వరపరచిన ఈ సాంగ్ శనివారం మధ్యాహ్నం విడుదల కాగా, తక్కువ సమయంలోనే లైక్స్, వ్యూస్ వర్షం కురిసింది. పాటకు అద్భుతమైన విజువల్స్ తో పాటు, అబ్బురపరిచే సంగీతం తోడవడంతో ఇది ఫ్యాన్స్ ను భారీగా ఆకట్టుకుంది. ఇకపోతే, పాట విడుదలైన 24 గంటలలోపు ఫైర్‌స్టోర్మ్ పాట 6.2 మిలియన్ వ్యూస్ ను దక్కించుకోగా, 830 వేల పైగా లైక్స్ తో దూసుకెళ్లింది.
Hindu Sanyasi: విలాసవంతమైన జీవితాన్ని విడిచి.. సన్యాసిగా మారిన విదేశీ మహిళా డాక్టర్..
దీనితో, గతంలో మహేష్ బాబు చిత్రం సర్కారు వారి పాట లోని “కళావతి” పాట క్రియేట్ చేసిన రికార్డును అధిగమించింది. కళావతి పాటకి 806K లైక్స్ ఉండగా, దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ రికార్డు కొనసాగింది. ఇప్పడు ‘OG’ సాంగ్ దాని రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఇక్కడా విశేషమేంటంటే, ఈ రెండు పాటలకు సంగీతం థమన్ అందించడమే. ఒకవైపు మహేష్ బాబుతో రికార్డ్ సాధించి, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో ఆ రికార్డును తానే బ్రేక్ చేయడం విశేషమే.
China: చైనాను భయపెడుతున్న జనాభా సంక్షోభం.. పిల్లల తల్లిదండ్రులకు సబ్సిడీలు..
సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓ స్టైలిష్ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది. దీన్ని DVV దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ హాష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్యామ్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారుసెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కాబోతున్న OG ఇప్పుడు విడుదలైన ఒక్క పాటతోనే సోషల్ మీడియా వేదికగా భారీ హైప్ సృష్టిస్తోంది.