Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Ysrcp 7

Off The Record : ఆదోని వైసీపీలో అయోమయం..కేడర్ జారిపోతున్నా పట్టించుకోని సాయిప్రసాద్ రెడ్డి

Published Date :October 11, 2024 , 10:25 pm
By Gogikar Sai Krishna
Off The Record : ఆదోని వైసీపీలో అయోమయం..కేడర్ జారిపోతున్నా పట్టించుకోని సాయిప్రసాద్ రెడ్డి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ నియోజకవర్గంలో దశాబ్దాలుగా టీడీపీకి ప్రత్యామ్నాయం ఆ నాయకుడే. కాంగ్రెస్ నుంచి ఒకసారి, వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచారు. ఇప్పుడు లెక్క తప్పింది! అనుచరగణమంతా గుడ్ బై చెప్పి పోతున్నారు. ఎందుకలా అంటే సౌండ్ లేదు! కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం. నియోజకవర్గంలో 1994 నుంచి ఇద్దరు నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. మూడు దశాబ్దాలుగా ఇద్దరిదే హవా అక్కడ. అయితే మీనాక్షి నాయుడు. లేదంటే వై. సాయిప్రసాదరెడ్డి. 2004 వరకు కాంగ్రెస్‌లో ఉన్న సాయిప్రసాదరెడ్డి 2009లో ఓటమి తర్వాత 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు. 2019లోనూ ఆయనే గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈసారి కూడా జగన్ ఆయనకే టికెట్ ఇస్తే.. కూటమి లెక్కల్లో పడి ఈక్వేషన్ తారుమారైంది. ఎవరూ మూడోసారి గెలవరనే సెంటిమెంటు నిజమైంది. అలా సాయి ప్రసాదరెడ్డి 18వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. కూటమి అభ్యర్థిగా డా.పార్థసారథి బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. ఆదోనిలొ ఏమాత్రం పట్టులేని బీజేపీ.. భారీ మెజారిటీతో గెలవడంతో షాక్‌ తినడం కేడర్ వంతైంది.

 

సీన్ కట్ చేస్తే.. తాజాగా ఆదోని మున్సిపల్ చైర్మన్ శాంత భర్త నాగేంద్ర వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. 2004 నుంచి సాయి ప్రసాద్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చేరిన నాగేంద్ర.. ఇప్పుడు కాదని వెళ్లిపోయారు. మున్సిపల్ చైర్మన్ శాంత మాత్రం వైసీపీలోనే వున్నారు. భర్తతో కలసి ఆమె బీజేపీలోకి ఎందుకు వెళ్లలేదనే అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది కానీ తర్వాత క్లారిటీ వచ్చింది. ఆదోని మున్సిపాలిటీలో 42 మంది కౌన్సిలర్లు ఉండగా 40 మంది వైసీపీ నుంచి గెలుపొందారు. ఇప్పటికే ఆరుగురు బీజేపీలో చేరారు. అయినా వైసీపీదే బలం. మున్సిపల్ చైర్మన్ పదవి కాపాడుకునేందుకే శాంత వైసీపీలో ఉన్నారనే వాదన వినిపిస్తోంది. ఎంపీపీ గతంలోనే పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇలా సాయిప్రసాద రెడ్డి ముఖ్య అనుచరులంతా ఒక్కొక్కరుగా ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారట. అందుకు కారణం నియోజకవర్గంలో ఆయన పట్టుకోల్పోవడమే అంటున్నారు. అందుకే వలసలు ఎక్కువయ్యాయినే చర్చ జరుగుతోందట. ఆ మాటకొస్తే నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సాయిప్రసాద రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఆయన వ్యవహరించిన తీరే పార్టీ బలహీనపడడానికి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనుచరులు, కుటుంబ సభ్యులపై రకరకాల ఆరోపణలు పార్టీపై ప్రభావం చూపాయంటున్నారు. మైనారిటీ ఓటు బ్యాంకు చెప్పుకునే స్థాయిలో వున్నా సాయిప్రసాద్ రెడ్డికి ఉపయోగపడలేదట. ఈనేపథ్యంలో సాయిప్రసాద రెడ్డి ముఖ్య అనుచరులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నా ఆపలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్సిపాలిటీ ఏమైపోతుందో అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోందట. ఈ క్రమంలో సాయిప్రసాద రెడ్డి తన వర్గాన్ని కాపాడుకుంటారా, లేక మళ్లీ ఎన్నికలప్పుడు చూసుకుందాంలే అనుకుంటారా.. చూడాలి మరి….

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • meenakshi naidu
  • ntv
  • off the record
  • sai prasad reddy
  • YSRCP

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions