Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Mla Akbauddin Owaisi Allegations Made In Assembly

Off The Record: అసెంబ్లీ సాక్షిగా చేసిన ఎమ్మెల్యే ఆరోపణల్లో నిజమెంత?

Published Date :July 29, 2024 , 10:00 pm
By Mahesh Jakki
  • డ్రగ్స్‌ నిరోధంలో పోలీసులు విఫలమవుతున్నారా?
  • నిందితులతో కొందరు చేతులు కలుపుతున్నారా?
  • ఆధారాలు ఉన్నాయన్న అక్బరుద్దీన్‌
  • అసెంబ్లీ సాక్షిగా చేసిన ఆరోపణల్లో నిజమెంత?
Off The Record: అసెంబ్లీ సాక్షిగా చేసిన ఎమ్మెల్యే ఆరోపణల్లో నిజమెంత?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో కలుపు మొక్కలు పెరిగిపోతున్నాయా? సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఈ అంశం చర్చకు వచ్చిందా? హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందాకు, కొందరు పోలీస్‌ అధికారులకు లింక్‌ ఉందన్న ఆ ఎమ్మెల్యే ఆరోపణల్లో నిజమెంత? ఎవరా ఎమ్మెల్యే? ఆయన ఆరోపణల్లో నిజమెంత?

తెలంగాణలో మాదక ద్రవ్యాల నిరోధానికి తీసుకుంటున్న చర్యల గురించి గొప్పగా చెబుతోంది ప్రభుత్వం. కానీ… డ్రగ్స్ కట్టడిలో పోలీస్‌ శాఖ వైఫల్యం అంటూ… అసెంబ్లీ సాక్షిగా విపక్ష ఎమ్మెల్యే విమర్శించడం కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసుల్లో కొంత మంది పోలీస్ ఉన్నతాధికారులు నిందితులతో చేతులు కలుపుతున్నారని ఆరోపించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ. నిందితులతో కలిసి పోలీసులు దందా చేస్తున్నారనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారాయన. ఒక్క పాతబస్తీలో జరుగుతున్న ఘటనలే కాకుండా … రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవహారాలపై తాను మాట్లాడుతున్నానని అక్బరుద్దీన్‌ చట్టసభ సాక్షిగా అనడం సంచలనమైంది. ఇటీవల తెలంగాణ పోలీసులు కొందరు వరుస కేసుల్లో సస్పెండ్‌ అవుతున్నారు. కొందరైతే ఏకంగా డిస్మిస్‌ అవుతున్నారు. ఓ పోలీసు అధికారి మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం చేశాడు. మరో అధికారి అక్రమాస్తులు కూడబెట్టి సస్పెండ్ అయ్యారు. గెస్ట్ హౌస్‌లో రాసలీలలు, లంచం తీసుకుంటూ దొరికిపోవడాలు.. ఇలా చాలానే జరుగుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన వారే ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు పెరగడంతో… పోలీస్‌ నిర్వాకాలపై హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సస్పెన్షన్స్‌ పర్వం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కొడుకు ఎపిసోడ్‌లో ఏకంగా స్టేషన్‌ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేసిన ఘటనను మరువక ముందే… అదే పంజాగుట్ట పోలీస్‌ సిబ్బంది తాజాగా పాస్‌పోర్టుల కేసులో నిందితులుగా పట్టుబడటం సంచలనమైంది.

అలాగే గతంలో పలు విద్యా సంస్థలు, సినిమా ప్రముఖులు, వ్యాపారులు, బడా బాబుల పిల్లలను డ్రగ్స్ కేసుల నుంచి తప్పించేందుకు కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నట్లు పోలీస్, ఎక్సైజ్ శాఖ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో… నిత్యం డ్రగ్స్ నివారణకు తమ శాఖ చేస్తున్న కృషిని అభినందించకుండా విమర్శించడంపై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తమకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, వసతులను దృష్టిలో పెట్టుకుని ఉన్న కొద్ది మంది సిబ్బందితో మాదక ద్రవ్యాల నిరోధానికి కృషి చేస్తున్నట్టు చెబుతున్నారు. ఎవరో కొద్దిమంది చేసే తప్పులను మొత్తం శాఖకు ఆపాదించడం సరికాదని అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఖండాంతరాల నుంచి డ్రగ్స్‌ దిగుమతి అవుతున్నాయని, పక్క రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా అవుతోందని, ఒకప్పుడు బడాబాబులకే పరిమితం అయిన డ్రగ్స్ ఇప్పుడు పాఠశాల విద్యార్థులకు దాకా వెళ్ళిన క్రమంలో తమ మీద వత్తిడి కూడా తీవ్రంగానే ఉందన్నది పోలీస్‌ అధికారుల అభిప్రాయంగా తెలిసింది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు తమను టార్గెట్‌ చేస్తే ఏం చేయగలమన్నది పోలీస్‌ ఆఫీసర్స్‌ ఫీలింగ్‌గా చెబుతున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా… డ్రగ్స్‌ దందాలో పోలీస్‌ సిబ్బంది ప్రమేయం ఉందన్న అక్బరుద్దీన్‌ వ్యాఖ్యల చుట్టూ కొత్త చర్చ మొదలైంది. అదీ ఆయన సభలో అనడాన్ని పోలీస్‌ శాఖ ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటుందో… డిపార్ట్‌మెంట్‌లో ఉన్న కలుపు మొక్కల్ని ఏరేస్తుందా అన్న చర్చ జరుగుతోంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • drugs in hyderabad
  • MLA Akbauddin Owaisi
  • off the record
  • OTR Story
  • telangana

తాజావార్తలు

  • Pakistan Fuel Prices: పాకిస్థాన్‌లో ఇంధన ధరల పెరుగుదల.. లాహోర్‌లో ఆటో డ్రైవర్ల నిరసన

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్.. క్యూ కట్టిన ఓటర్లు

  • LPG: ఎల్పీజీ కొరతను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు, పరిశ్రమలకు కేటాయింపులు ఖరారు

  • Astrology: ఏప్రిల్‌ 9, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి గుడ్ న్యూస్..

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions