Off The Record: తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ కొత్త అస్త్రం?
- పవర్ పోయాక గడ్డు పరిస్థితుల్లో బీఆర్ఎస్
- కేడర్ని కాపాడుకోవడానికి నానా తంటాలు
- బీజేపీలో విలీనం ప్రచారంతో ఉక్కిరి బిక్కిరి
- అసదుద్దీన్ కామెంట్స్ తర్వాత పెరిగిన అనుమానాలు
- విలీనంపై వివరణ ఇవ్వాలని అసద్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: బీఆర్ఎస్ బీజేపీతో రాజకీయ సంబంధాలు పెట్టుకోబోతోందా? కాషాయంలో గులాబీ కలిసిపోతుందా? లేక మిత్రపక్షంగా కొనసాగనుందా? తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ కొత్త అస్త్రాన్ని ఎంచుకుందా? దీనిపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న హాట్ హాట్ చర్చలో నిజమెంత?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్… 14ఏళ్ల పోరాటం తరువాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసుకుంది. 10 ఏళ్లపాటు అధికారంలో ఉంది. ఆ క్రమంలో పేరు మారి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. తీరా ఇప్పుడు అధికారం కోల్పోయాక తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కోంటోంది. 10మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాక… పార్టీ చరిత్రలో తొలిసారి ఢిల్లీ సభలో స్థానం లేక డీలా పడిపోయింది బీఆర్ఎస్. క్యాడర్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్న క్రమంలో మరో పిడుగు పడింది ఆ పార్టీ మీద. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందన్న ప్రచారం గులాబీ పెద్దల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు ప్రచారం ఉంది. అందులో నిజా నిజాల సంగతి ఎలా ఉన్నా… ఇన్నాళ్ళు బద్ద వ్యతిరేకంగా వ్యవహరించిన బీజేపీలో విలీనం కావడమోస లేదా… మిత్రపక్షంగా కొనసాగడమో ఖాయమన్న ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇటీవల కేటీఆర్, హరీష్‌రావు ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత ఈ ప్రచారం తీవ్ర రూపం దాల్చింది.
Also Read
- Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
- Amaravati Farmers: జగన్‌ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
- Annamalai: బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ…. గులాబీ పార్టీకి చిరకాల మిత్రుడు, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్ చేశారు. ఆయన మాటల తర్వాత విలీనం అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయట. విలీనం విషయంలో బీఆర్ఎస్ వివరణ ఇవ్వాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు అసద్. ఆ డిమాండ్ బీఆర్ఎస్కు మరింత ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు కేసీఆర్ కూతురు కవిత నాలుగు నెలలుగా జైల్లోనే ఉన్నారు. బెయిల్ ఇప్పట్లో వస్తుందో? రాదో తెలియుదు. ఈ పరిస్థితుల్లో ఓవైపు విలీనం ప్రచారం, మరోవైపు అసద్ లాంటి నేత బీఆర్ఎస్ ప్రాతివ్రత్యాన్ని ప్రశ్నించడం లాంటి వ్యవహారాలతో ఆ పార్టీ పెద్దలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు సమాచారం. ఈ ఇబ్బందులు ఇలా ఉండగానే… ఆదిలాబాద్‌లో మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నానికి బీఆర్ఎస్ తోడుగా నిలవడంతో రెండు పార్టీల బంధంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వలసలు, ఇంకోవైపు బిజెపితో కలిసిపోతున్నారనే ప్రచారంతో గులాబీ పెద్దలకు ఊపిరి సలపడంలేదన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. దీనికి అట్నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.
తాజావార్తలు
-
Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
-
Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
-
Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్‌కు ఎక్కడ చెడింది?
-
MUFG Fund India: భారతీయ స్టార్టప్ సామ్రాజ్యంపై జపాన్ కన్ను.. రూ.2400 కోట్ల భారీ ఫండ్‌తో సరికొత్త విప్లవం!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!