Off The Record: ఖుషీ ఖుషీగా టీడీపీ ఎంపీకి థాంక్స్ చెబుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏపీ రాజకీయాల్లో వైసీపీ – టీడీపీల మధ్య ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా తేలిగ్గానే మేటర్ చెప్పేస్తాడు. ప్రతి విషయంలో రెండు పార్టీలు పై చేయి సాధించటం కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్న పరిస్థితి. ఒక రకంగా ప్రతి జిల్లాలోనూ…రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎంపీ అధికార పక్షం ఎమ్మెల్యేల్ని పొగడటమంటే… సాధారణ విషయం కాదు. కానీ… విజయవాడ లోక్‌సభ సీటు పరిధిలో అదే జరుగుతోంది. అందుకే అక్కడి వైసీపీ ఎమ్మెల్యేలు ఫుల్‌ఖుష్ అవుతూ ఎంపీకి ధ్యాంక్స్ చెబుతున్నారట.
బెజవాడ పార్లమెంట్ సీటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అందులో ఒకచోట మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే గెలవగా మిగతా ఆరుగురూ అధికార పార్టీ శాసనసభ్యులే. ఎంపీగా మాత్రం టీడీపీ తరపున కేశినేని నాని రెండో సారి గెలిచారు. తర్వాత కేశినేనికి పార్టీ అధిష్టానంతో వచ్చిన గ్యాప్ కారణంగా ఆయనకు, సొంత పార్టీ నేతలకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ నేతలు నిత్యం పోరాటం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలను సపోర్టు చేస్తూ సొంత పార్టీ నేతలకు ఝలక్ ఇస్తున్నారు ఎంపీ. నందిగామలో ఎమ్మెల్యే మొండి తోక జగన్ మోహన్, ఆయన సోదరుడు మొండి తోక అరుణ్ అవినీతి చేస్తున్నారంటూ స్థానిక టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పోరాడుతున్నారు. కానీ..అక్కడకు వెళ్లిన కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేని పొగడటంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తాడని కితాబు ఇచ్చేశారు. దీంతో నందిగామ టీడీపీ నేతలు డిఫెన్స్‌లో పడ్డారట. ఎంత లేదనుకున్నా…ఈ వ్యాఖ్యల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి టీడీపీ వర్గాలు. అదే టైంలో వైసీపీ నేతలు మాత్రం ఖుషీగా ఉన్నారట. మీ పార్టీ ఎంపీనే మమ్మల్ని మెచ్చుకుంటుంటే… మీరు మాత్రం అనవసరంగా మాట్లాడతారు ఎందుకని టీడీపీ నాయకులకు రివర్స్ క్వశ్చన్స్ వస్తున్నాయట.
Also Read
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
నందిగామలో మాత్రమే కాదు, మైలవరం, జగ్గయ్యపేట కూడా కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేలకు సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమాకు, నానికి పడదు. ఇక్కడ ఉమాపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నాని. ఇక జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సహా ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు తనతో బాగా సమన్వయం చేసుకుంటున్నారని బహిరంగంగా కామెంట్ చేస్తున్నారు కేశినేని. దీంతో ఆయా నియోజక వర్గాల్లో టీడీపీ క్యాడర్ ఇరకాటంలో పడుతోందట. అటు వైసీపీ నేతలు మాత్రం ఎంపీ మాటల్ని వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారట. టీడీపీ ఎంపీనే మేం మంచివాళ్ళమని చెబుతున్నాడంటే.. ఎలా పనిచేస్తున్నామో చూసుకోమని అంటున్నారట. కాగల కార్యం గంధర్వులే తీర్చడమంటే ఇదేనని జోష్‌లో ఉన్నారట వైసీపీ ఎమ్మెల్యేలు.
తాజావార్తలు
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!