Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Tdp And Janasena Alliance Behind Politics

Off The Record: చంద్రబాబు అరెస్ట్ సంగతి బీజేపీ పెద్దలకు ముందే తెలుసా..? హఠాత్తుగా పొత్తు ప్రకటనకు కారణం ఏంటి..?

Published Date :September 14, 2023 , 10:08 pm
By Sudhakar Ravula
Off The Record: చంద్రబాబు అరెస్ట్ సంగతి బీజేపీ పెద్దలకు ముందే తెలుసా..? హఠాత్తుగా పొత్తు ప్రకటనకు కారణం ఏంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఏపీలో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది. నిన్నటి దాకా చంద్రబాబు అరెస్ట్ చుట్టూ తిరిగిన రాజకీయం ఒక్కసారిగా పొత్తుల మీదకు మళ్ళింది. ములాఖత్‌లో చంద్రబాబును కలిశాక పొత్తులపై కీలక ప్రకటన చేశారు పవన్‌ కల్యాణ్‌. మాజీ సీఎంని ఆకాశానికెత్తేస్తూ.. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించేశారు పవన్‌. ఒక రకంగా ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. రెండు పార్టీల మధ్య పొత్తు గురించి చాలా రోజులుగా ప్రచారం ఉన్నా.. కలిసి ఎన్నికలకు వెళ్లడం ఖాయం అనుకుంటున్నా.. ఆ పొత్తును ఇప్పటికిప్పుడు ప్రకటించే అవకాశం ఉండదని భావించారు అంతా. కానీ, చంద్రబాబు అరెస్టుతో పరిస్థితులు, పరిణామాలు మారినట్టు కన్పిస్తోంది. ఇంత హఠాత్తుగా ప్రకటన రావడానికి కారణాలు చాలానే ఉన్నాయన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తుల గురించి అధికారిక ప్రకటన చేద్దామని భావించినట్టు సమాచారం. ఈలోగా బీజేపీ విషయంలో కూడా క్లారిటీ తీసుకోవాలని.. ఆ పార్టీని కూడా కలుపుకుని వెళ్లాలనేది టీడీపీ-జనసేన అభిప్రాయమని చెబుతున్నారు.

అయితే చంద్రబాబు అరెస్ట్‌తో మొత్తం సీన్ మారిపోయింది. ఇంకా మాట్లాడుకుంటే.. అసలు చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీజేపీకి ముందస్తు సమాచారం ఉందనేది టీడీపీలోని మెజార్టీ నేతల అభిప్రాయమట. ఈ డౌట్ చాలా మందికి ఉన్నా.. ఎవ్వరూ బయటపడలేదంటున్నారు. కానీ.. సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మాత్రం రెస్పాండ్ అయ్యారు. బీజేపీ పెద్దలు చంద్రబాబు అరెస్ట్ మీద ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారాయన. దీనికి తగ్గట్టే.. ఢిల్లీతో పాటు ఏపీ బీజేపీ నేతలు కూడా మాట్లాడడం లేదు. ఇదంతా చూస్తుంటే.. అరెస్ట్ విషయాన్ని బీజేపీ పెద్దలకు వైసీపీ ముందుగానే చెప్పినట్టుగా కనిపిస్తోందనేది మెజార్టీ టీడీపీ నేతలవాదన. ఈ పరిణామాలన్నిటినీ గమనించాకే.. ఇక తాత్సారం చేయకూడదనే ఉద్దేశ్యంతో.. దూకుడుగా వెళ్లాలని టీడీపీ-జనసేన భావించినట్టు సమాచారం. తామేమో.. బీజేపీని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తుంటే.. ఆ పార్టీ మాత్రం.. వైసీపీకి ప్రభుత్వ పరంగానే కాకుండా.. రాజకీయంగా కూడా సహకరించేలా అడుగులు వేస్తున్నట్టు భావిస్తున్నాయట టీడీపీ-జనసేన అధినాయకత్వాలు.

Also Read

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

దీంతో ఇంకా ఆలస్యం అయితే… రాజకీయంగా మరింత ఇబ్బందుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనే ఆందోళనతోనే పొత్తులపై వెంటనే క్లారిటీ ఇచ్చేసినట్టు విశ్లేషిస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. పవన్ కళ్యాణ్ రాజమండ్రి రావడం.. చంద్రబాబుతో ములాఖత్ కావడం.. పొత్తులపై ప్రకటన చేయడం, ఆ సందర్భంలో ఓవైపు లోకేష్.. మరోవైపు బాలకృష్ణ ఉండేలా ప్లాన్ చేసుకోవడమంతా అందులో భాగమేనంటున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ విషయం బీజేపీ పెద్దలకు తెలిసి జరిగింది కాదని స్వయంగా పవన్ చెప్పడంతో పాటు.. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు. అలాగే తానింకా ఎన్డీఏలో ఉన్నాననే విషయాన్ని స్పష్టంగా చెప్పారు పవన్. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీజేపీ పాత్రపై టీడీపీకి అనుమానాలు ఉండడంతోనే.. కమలం పార్టీపై ఒత్తిడి పెంచేందుకు టీడీపీ-జనసేన పొత్తుల ప్రకటన చేశాయనేది మరో వెర్షన్‌. ఇప్పుడు బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ నేతలు నోరెత్తడం లేదు కానీ.. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం జగన్ ప్రభుత్వ తీరును తప్పు పట్టడం ఆసక్తిగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Chandrababu Arrest
  • janasena
  • off the record
  • pawan kalyan

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions