Site icon NTV Telugu

Off The Record: రాజమండ్రిలో రంజుగా రాజకీయం..వైసీపీ Vs కూటమిలో కాంగ్రెస్ ఎవరి ఓట్లు చీల్చుతుంది?

Otr Rajahmundry

Otr Rajahmundry

Off The Record: రాజమండ్రిలో రాజకీయం రంజుగా మారింది! రెండు జాతీయపార్టీలు ఈసారి కేంద్రబిందువుగా మారుతున్నాయి! వైసీపీ వర్సెస్ కూటమిగా ఉన్న పోరాటంలో కాంగ్రెస్ ఏం చేయబోతోంది? ఏ పార్టీ ఓటు బ్యాంకును హస్తంపార్టీ దెబ్బతీయబోతోంది?

రాజమండ్రి! ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా మాత్రమే కాదు.. ఇప్పుడు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కూటమి నుంచి బీజేపీ తరపున పోటీలో పురందేశ్వరి నిలవడం.. అటు కాంగ్రెస్ నుంచి మాజీ ఏపీ పీసీపీ చీఫ్ గిడుగు రుద్రరాజు బరిలో దిగడం.. ఇటు వైసీపీ నుంచి డాక్టర్‌ గూడూరి శ్రీనివాసులు గట్టిపోటీ ఇవ్వడం.. వెరసి రాజమండ్రి ఎంపీ స్థానం హాట్‌సీటుగా మారింది. నిజానికి ఇక్కడ వైసీపీ, కూటమి మధ్యే ప్రధాన పోటీ. అయితే కాంగ్రెస్ కాంటెస్ట్ చేయటం వల్ల, ఓట్లుచీలి ఏ పార్టీకి నష్టం కలుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ప్రధానంగా బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లు తమకే పడతాయని నమ్మకం పెట్టుకుంది. అయోధ్య రామమందిరం నిర్మాణంతో ఇటీవల బీజేపీ గ్రాఫ్ కూడా పెరిగిందంటున్నారు. దానికి తోడు టీడీపీ, జనసేన పొత్తు ఎలాగూ ఉంది. అంతా బానే ఉంది కానీ ఇప్పుడు కూటమికి కాంగ్రెస్ భయం పట్టుకుందట. దీనికి కారణం బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండటమే అని తెలుస్తోంది.

రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 80 వేలకు పైగా ఓట్లు బ్రాహ్మణ సామాజికవర్గానివే. వీటిలో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఓట్లు చీల్చినా కూటమిపైనే ప్రభావం ఎఫెక్ట్ పడుతుందని చర్చించుకుంటున్నారు. గిడుగు రుద్రరాజు కోనసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయనకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో బంధుత్వాలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పరిచయాలు ఎక్కువ. ఇవన్నీ రుద్రరాజుకు ఓట్ల రూపంలో వస్తే ఏంటి పరిస్థితి అనేది.. బీజేపీని ఆలోచనలో పడేసిందని టాక్!

2019 ఎన్నికల్లో వైసీసీ మొదటిసారి బీసీ అభ్యర్థిని ఇక్కడ రంగంలో ఇక్కడ ఘనవిజయం సాధించి, సెంటిమెంటుని తిరగరాసింది! ఈ లెక్కలతోనే మళ్లీ ఈసారి కూడా ఫ్యాన్ హవా ఉంటుందని.. బీసీ అభ్యర్థినే పోటీలో పెట్టింది. ప్రస్తుతం వైసీపీ- కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టుంది ఫైట్! మరి కాంగ్రెస్ ఎవరి ఓట్లను చీలుస్తుంది? ఎవరి అంచనాలను తలకిందులు చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.
దీనిపై రాజకీయ విశ్లేషకులు ఎవరికి తోచిన అనాలిసిస్ వారు చేస్తున్నారు. గత ఎన్నికల్లో రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 13 వేల 600. బీజేపీకి 13 వేల 800 ఓట్లు లభించాయి. ఈసారి కూటమి అభ్యర్థిగా పురందరేశ్వరి పోటీతో ఓట్లన్నీ కన్సాలిడేట్ అవుతున్నాయి. ఆటోమేటిగ్గా పోటీ గట్టిగానే ఉండబోతోంది. వీళ్ల ఫైట్‌లో మధ్యలో దూరిన కాంగ్రెస్ ఎవరిని దెబ్బతీస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రిలో గెలిచేంత ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు లేకపోయినా, ప్రధాన పార్టీల ఓట్లు చీల్చడం మాత్రం ఖాయం అంటున్నారు విశ్లేషకులు! చూడాలి.. గిడుగు ఏ పార్టీకి పిడుగు అవుతారో!

 

Exit mobile version