Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Prakasam Jana Sena Internal Rift Balinenni Srinivasa Reddy Feels Sidelined

Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

Published Date :March 3, 2026 , 10:33 pm
By Sudhakar Ravula
  • జనసేనలోకి బాలినేని ఎంట్రీ తర్వాత మారిన లెక్కలు..
  • ఎన్నికలప్పుడు జట్టుగా జిల్లా జనసేన అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల..
  • 16 నెలలు గడుస్తున్నా బాలినేనికి ప్రాధాన్యం దక్కలేదన్న బాధ..
  • దామచర్ల జనసేన, బాలినేని జనసేనగా రెండు వర్గాలు..
  • జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ దామచర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న టాక్‌..
  • ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?..
  • పార్టీ సభ్యత్వ నమోదులో ఎవరికి వారే..
  • జిల్లా పార్టీ పరిశీలకుడు కొణతాలకు బాలినేని ఫిర్యాదు..
  • ఎమ్మెల్యే జనార్ధన్‌కు జైకొట్టిన వాళ్ళకే ప్రాధాన్యమని కంప్లయింట్‌..
  • పవన్‌కు చెప్పి సెట్‌ చేస్తానని కొణతాల హామీ ఇచ్చారా?..
Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ప్రకాశం జిల్లా జ‌న‌సేన‌లో ఎన్నిక‌లకు ముందు వ‌ర‌కూ అంతా ఓకే అన్నట్టుగానే ఉన్నా.. మాజీమంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి వైసీపీ నుంచి జ‌న‌సేనలోకి ఎంట్రీ ఇచ్చాక ఈక్వేష‌న్స్ మొత్తం మారిపోయాయి. అసెంబ్లీ ఎలక్షన్స్‌ టైంలో…జిల్లా జ‌నసేన అధ్యక్షుడు రియాజ్, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ ఒక జట్టుగా పనిచేశారు. ఇక ఎన్నికల తర్వాతి పరిణామాలతో… ఒంగోలు వైసీపీ కార్పొరేటర్స్‌లో కొంద‌రు బాలినేనితో పాటు జ‌న‌సేన‌లో చేర‌గా.. మ‌రికొంద‌రు దామ‌చ‌ర్ల జ‌నార్దన్ ఆధ్వర్యంలో టీడీపీకి దగ్గరయ్యారు. బాలినేని జ‌న‌సేన‌లో చేరి 16 నెల‌లు గ‌డుస్తున్నా…. ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదన్న బాధ ఉందట ఆ శిబిరంలో. ఇక పాత సాన్నిహిత్యంతో జ‌న‌సేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, అదే పార్టీలో యాక్టివ్‌గా ఉన్న కంది ర‌విశంక‌ర్ టీడీపీ ఎమ్మెల్యే దామ‌చ‌ర్లతో క‌ల‌సి రాజ‌కీయాలు న‌డుపుతున్నారు. ఇది పైకి కూట‌మి ధ‌ర్మంలా కనిపిస్తున్నా….అంతర్గతంగా మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి టార్గెట్‌గానే అడుగులు వేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒంగోలు అర్బన్ డెవ‌లప్మెంట్ అధారిటీ చైర్మన్ ప‌ద‌వి టీడీపీకి రావాల్సి ఉన్నా…ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల ప‌ట్టుబ‌ట్టి తన పార్టీ నాయకులందర్నీ ఒప్పించి మరీ రియాజ్‌కు వ‌చ్చేలా చేశార‌ని చెప్పుకుంటారు. ఇందులో కూటమి ధర్మంకంటే బాలినేనికి చెక్‌ పెట్టే వ్యూహమే ఉందని, అందుకు తగ్గట్టు రియాజ్‌ కూడా తమ పార్టీ నాయకుడైన బాలినేనికంటే ఎమ్మెల్యే దామచర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్నది ఒంగోలు వాయిస్‌. ఈ పరిణామాలతో మాజీ మంత్రి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

ఆ మ‌ధ్య మార్కాపురం వ‌చ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాలినేనిపై త‌న‌కున్న ప్రత్యేక అభిమానాన్ని చెప్పారు. గ‌తంలో ప‌రిస్దితులు ఎలా ఉన్నా.. కూటమిలోకి వ‌చ్చాక అంద‌రూ ఒక‌టేన‌ని.. స‌ర్దుకుని క‌లిసి ప‌నిచేసుకోవాల్సిందేన‌ని చెప్పడంతో… అంతా సెట్‌ అవుతుందని అనుకున్నారుగానీ…. అంతర్గతంగా రగులుతూనే ఉంది. అసలు కూటమితో స‌ర్దుబాట్ల సంగ‌తేమోగానీ… అస‌లు జ‌న‌సేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ అదే పార్టీ నేత బాలినేనితో క‌ల‌సి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. ఓడా ఛైర్మన్‌గా రియాజ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాలినేనిని ఆహ్వానించ‌లేదు స‌రిక‌దా.. క‌నీసం ఫ్లెక్సీల్లో సైతం ఆయన ఫోటో క‌నిపించ‌క‌పోవ‌టం చ‌ర్చనీయాంశమైంది.ఆ క‌ధ అలా… న‌డుస్తున్న క్రమంలో జ‌న‌సేన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమం ఒంగోలులో వివాదాస్పదమైంది. జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌ జనసేన ఇన్ఛార్జ్‌లను ఒంగోలులోని తన ఆఫీస్‌కు పిలిచి ప్రోగ్రామ్ చేశారు మాజీ మంత్రి. కానీ.. అక్కడికి రియాజ్‌ టీమ్‌ను పిలవలేదు. ఈ క్రమంలో.. తాజాగా జరిగిన మరో విడత కార్యక్రమం హాట్‌ టాపిక్‌ అయింది. రియాజ్‌ టీమ్‌ నిర్వహించిన ఈ ప్రోగ్రామ్‌కు బాలినేనితో పాటు ఆయ‌న‌కు ద‌గ్గర‌గా ఉండే పార్టీ నేత‌ల‌కు, కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల ఇన్ఛార్జ్‌లకు సైతం ఆహ్వానాలు అంద‌లేద‌ని తెలిసింది. దాంతో ఈ పరిణామాలను జ‌న‌సేన జిల్లా ప‌రిశీల‌కుడు, అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే కొణ‌తాల రామ‌కృష్ణ దృష్టికి తీసుకెళ్లారు బాలినేని. కొణతాల ఒంగోలు వచ్చి శ్రీనివాసరెడ్డికి ఆయన ఇంట్లో కలిశారు. ఈ సంద‌ర్బంగా జిల్లా జ‌న‌సేనలో జరుగుతున్న ప‌రిణామాల‌ను పూసగుచ్చినట్టు వివరించారని తెలిసింది.

పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్ధన్‌కు బీ టీంలాగా మారిపోయార‌న్నది బాలినేని వర్గం ఆరోపణ. దామ‌చ‌ర్లకు అనుకూలంగా పార్టీని న‌డిపిస్తూ లైన‌ప్‌ను దెబ్బతీస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది. జ‌న‌సేనలో ఉంటూ… జనార్థన్‌కు జైకొట్టిన వాళ్ళకే ప్రాధాన్యం ద‌క్కుతోందని, త‌మ‌కు క‌నీసం పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానం ఉండటం లేదని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇలా అయితే జిల్లాలో పార్టీ బ‌లోపేతం సంగ‌తి తర్వాత….. క‌నీస ఉనికి కూడా లేక టీడీపీ పైనే ఆధార‌ప‌డాల్సి ఉంటుంద‌ని వివరించారట. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల జ‌న‌సేన నేత‌లు బాలినేని శ్రీనివాసరెడ్డితో క‌లిసి న‌డుస్తున్నా… జిల్లా అధ్యక్ష స్థానంలో ఉన్న రియాజ్‌ కలుపుకుని పోయే ప్రయత్నం చేయడంలేదని, పిలవని కార్యక్రమాలకు నేను ఎలా వెళ్ళగలనంటూ మాజీ మంత్రి గట్టిగానే ప్రశ్నించినట్టు సమాచారం. అంతా విన్న కొణ‌తాల….. జ‌రుగుతున్న పరిణామాల‌ను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు బాలినేనికి సముచిత ప్రాధాన్యం దక్కేలా చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ పంచాయితీని పవన్‌కళ్యాణ్‌ ఎలా తీరుస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh political news
  • Balinenni Srinivasa Reddy
  • Damacharla Janardhan
  • Konathala Ramakrishna
  • off the record

తాజావార్తలు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

  • Karnataka: నన్నే పెళ్లి చేసుకోవారా: బాయ్‌ఫ్రెండ్‌పై కత్తితో మహిళ దాడి..

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions