Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Pawan Kalyan Delhi Tour And Bjp Leaders

Off The Record: పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ వెళ్తారా..? వెళ్తే అది ఎప్పుడు? అసలు అపాయింట్‌మెంట్‌ ఇస్తారా?

Published Date :October 7, 2023 , 10:48 pm
By Sudhakar Ravula
Off The Record: పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ వెళ్తారా..? వెళ్తే అది ఎప్పుడు? అసలు అపాయింట్‌మెంట్‌ ఇస్తారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: పొత్తుల ప్రకటన తర్వాత పవన్‌ కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహి యాత్ర చేపట్టారు. గతంతో పోల్చుకుంటే ఈసారి జోష్‌ కూసింత తక్కువగా ఉందనే చర్చ జరుగుతోంది. పైగా ఎన్డీఏ నుంచి వచ్చేశానని ఓసారి.. అదేం లేదు.. నేనెక్కడికి వెళ్లలేదని మరోసారి పవన్‌ చెప్పారు. ఇదే సందర్భంలో ప్రెస్‌మీట్‌లో ఇంకొన్ని కీలక కామెంట్లూ చేశారు. వాస్తవానికి పొత్తును ఢిల్లీలో ప్రకటిద్దామని భావించానని.. అయితే రాష్ట్ర పరిస్థితులు, జీ-20 సదస్సులో బీజేపీ అగ్ర నేతలు బిజీగా ఉండడంతో వారికి చెప్పకుండానే చేయాల్సి వచ్చిందంటూ దాదాపు బీజేపీ అధినాయకత్వానికి వివరణ ఇచ్చుకున్నట్టుగా చెప్పారాయన. ఈ క్రమంలో ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు..? అడిగిన వెంటనే ఢిల్లీ పెద్దలు అప్పాయింట్మెంట్‌ ఇచ్చేస్తారా? కలవడానికి కమలం పెద్దలు సుముఖంగా ఉన్నారా లాంటి చర్చలు బయలుదేరాయి. పొత్తులో ఉన్న తమకు మాట మాత్రంగానైనా చెప్పలేదనే ఆగ్రహం బీజేపీ స్థానిక నేతల్లోనే కాకుండా.. ఢిల్లీ లోటస్‌ లీడర్లకు ఉన్నట్టుగానే కనిపిస్తోంది.

పవన్‌ అనూహ్య ప్రకటన తర్వాత ఇక బీజేపీతో కటీఫేనా..? అనే రీతిలో విశ్లేషణలు కూడా వచ్చేశాయి. వీటన్నింటికి జవాబు చెబుతున్న విధంగా.. పవన్‌ తన ప్రెస్‌ మీట్లో వివరించారు. ముందే చెప్పాల్సింది. కానీ.. చెప్పలేకపోయాం. ఇప్పుడు చెబుతాం..అంటూ దీర్ఘాలు తీస్తున్నారాయన. తాను ఎన్డీఏలో ఉన్నానో.. లేనోననే విషయాన్ని చెప్పాల్సింది ఆయనేనని ఏపీ బీజేపీ నేతలు చేసిన కామెంట్స్‌పైనా… సూటిగా స్పందించడానికి తటపటాయించారు పవన్‌. దీన్ని బట్టి.. పైకి కన్పిస్తున్న విధంగా పవన్‌ బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి జనసేనాని అంతగా సుముఖంగా లేరనే వాదన బలంగా వినిపిస్తోంది. అప్పుడున్న పరిస్థితిని బట్టి.. ఏదో ప్రకటించేశారు కానీ.. ఆ తర్వాత తత్వం బోధపడి ఉంటుందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ టూర్‌పై ఉత్కంఠ నెలకొంది. పవన్‌కళ్యాణ్‌ ఇప్పటికే బీజేపీ ఢిల్లీ పెద్దల అప్పాయింట్మెంట్‌ అడిగినట్టు సమాచారం. అయితే వాళ్ళు సుముఖంగా ఉన్నారా? లేదా అన్నది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ థియరీ ప్రకారం ఏపీలో నడుచుకోవడానికి బీజేపీ ముందుకు వస్తుందా..? పవన్‌ బీజేపీని ఒప్పించగలరా..? అన్న అనుమానాలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. టీడీపీతో వద్దు.. బీజేపీ-జనసేన కూటమిగానే ఎన్నికలకు వెళ్దామనే ప్రతిపాదనను పవన్‌ ముందు పెడితే అప్పుడు రియాక్షన్‌ ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది. ఇదే సందర్భంలో .. అటు జనసేన కానీ.. ఇటు టీడీపీ కానీ.. బీజేపీతో మేం వెళ్లేదే లేదని గట్టిగా చెప్పలేకపోతున్నాయి. బీజేపీకి దాదాపు వివరణ ఇచ్చుకున్నట్టుగా పవన్‌ మాట్లాడితే.. అదే రోజున లోకేష్‌ కూడా కీలక కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ వెనక బీజేపీ పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని.. దాని గురించి నేనేం మాట్లాడనంటూ.. దాదాపు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టుగానే అన్నారు. ఇప్పుడీ పరిణామాలే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో పవన్‌ ఢిల్లీ వెళ్తే చాలా అంశాలకు అవుననో.. కాదనో సమాధానాలైతే లభిస్తాయని అంచనా వేస్తున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌. మొత్తానికి పవన్‌కళ్యాణ్‌ ఢిల్లీ టూర్‌ మీద ఉత్కఠ పెరుగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • Chandrababu Arrest
  • janasena
  • off the record

తాజావార్తలు

  • Hardik Pandya: హార్దిక్ కెప్టెన్‌ కాకపోయుంటే ముంబై గెలిచేది.. ఎంఐ బుల్లి ఫ్యాన్ ఫైర్!

  • Redmi A7 Pro 5G: 32MP AI కెమెరా + 6,300 mAh బ్యాటరీ, 6.9-అంగుళాల డిస్‌ప్లేతో.. రెడ్‌మీ A7 ప్రో 5G విడుదల

  • South Vs North : సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్లుగా మారిపోయిన బాక్సాఫీస్ లెక్కలు

  • Tenant Ownership after 12 Years: అద్దె చెల్లించేవారే 12 ఏళ్ల తర్వాత యజమాని అయిపోతారా..? చట్టం ఏం చెబుతుంది..?

  • Nani: నాని డేట్స్ కోసం దర్శకుల పోరాటం.. ఆ లుక్ మారే వరకు ‘రోమియో’ రానట్టే!

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions