Site icon NTV Telugu

Off The Record: తెలంగాణ పాలిటిక్స్‌లో కవిత లేఖ ప్రకంపనలు.. తండ్రికి కూతురు రాసిన లేఖ బయటకు ఎలా వచ్చింది..?

Kavitha

Kavitha

Off The Record: తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు ఆ లేఖ చుట్టే తిరుగుతోంది. తన తండ్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కి ఎమ్మెల్సీ కవిత రాసిన లెటర్‌… ఇటు పార్టీలో, అటు బయట కూడా పొలిటికల్‌ ప్రకంపనలు రేపుతోంది. ఒక పార్టీనేత మరో పార్టీకి లెటర్‌ రాయడం సాధారణం. కానీ…. ఒకే పార్టీలో ఉండి రాస్తే… దాన్ని ధిక్కారంగానే భావిస్తారు. ఇలాంటి వాతావరణంలో… తండ్రీ కూతుళ్ళ బంధాన్ని పక్కనపెడితే…ఎమ్మెల్సీ కవిత బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడికి రాసిన లేఖ మాత్రం ఉన్నట్టుండి పొలిటికల్‌ హీట్‌ పెంచేసింది. ఇందులో చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారామె. పాజిటివ్, నెగిటివ్ అంశాలు అంటూ సుదీర్ఘ ప్రస్తావన చేశారు. పాజిటివ్ అంశాలపై బీఆర్‌ఎస్‌లో ఎవరికీ అభ్యంతరం లేకపోయినా… నెగిటివ్ మీదే ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పార్టీ రజతోత్సవ బహిరంగ సభ వేదిక మీద జరిగిన అంశాలు కూడా ప్రస్తావించారు కవిచ. అలాగే కేసీఆర్‌ ఎవరికీ యాక్సెస్ ఇవ్వడం లేదని ఆరోపించారు.

Read Also: Anaganaga : అనగనగా.. ఓటీటీ నుంచి థియేటర్లలోకి..

అదంతా ఒక ఎత్తు, పార్టీ అంతర్గత విషయం. కానీ… పార్టీ అధ్యక్షుడికి స్వయంగా ఎమ్మెల్సీ రాసిన లెటర్‌ బయటికి ఎలా వచ్చిందన్నది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌. ఇంత ఘాటుగా రాసిన లేఖను, అదీ.. 20 రోజుల తర్వాత ఎవరు బయటపెట్టారన్న చర్చ జోరుగా జరుగుతోంది రాష్ట్ర రాజకీయవర్గాల్లో. ప్లీనరీ బహిరంగ సభ ముగిసిన తర్వాత మే రెండున లెటర్‌ రాశారు కవిత. దీనికి సంబంధించి ఆమె అమెరికా పర్యటనకు వెళ్లే ముందే రూమర్లు వచ్చినా… కొట్టి పారేశారు ఇటు బిఆర్ఎస్ నేతలు, అటు తెలంగాణ జాగృతి నాయకులు. కవిత అమెరికా టూర్‌కి ముందే…లెటర్‌కు సంబంధించిన లీకులు ఉన్నా… అప్పుడు దీనిపై ఎవరూ మాట్లాడలేదు, సీరియస్‌గా తీసుకోలేదు. చివరకు ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ బయలుదేరిన గంటలోనే లెటర్‌ బయటికి రావడం ఆసక్తికరంగా మారింది. దాన్ని రిసీవ్ చేసుకున్న కేసీఆర్‌ బయటపెట్టే అవకాశం లేదంటున్నారు. ఇక మిగిలిఉన్న రెండో ఆప్షన్‌ కవిత వైపు నుంచే.

Read Also: RCB vs SRH: ఇషాన్ కిషన్ వన్ మ్యాన్ షో.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్..!

అంటే… ఈ లీకు విషయం కచ్చితంగా ఆమెకు తెలిసే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్సీ సూచనలతో… ఆమె అనుచరులే కాపీని బయటకు వదిలారా? లేక ఆమెకు తెలియకుండా ఓవర్‌గా రియాక్ట్‌ అయ్యే అనుచరులు బయటపెట్టారా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో బిజీగా ఉన్నాయి రాజకీయ వర్గాలు. ఒకవేళ కవితకు తెలియకుండా లెటర్‌ బయటకు వస్తే… ఆమె వెంటనే ఖండించడమో, లేక తనకేమీ సంబంధం లేదని ట్వీట్ చేయడమో జరిగేది. కానీ… ఇప్పటివరకు ఎవరూ ఎవరు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. అటు బీఆర్‌ఎస్‌ కూడా ఇందుకు బాధ్యులు ఎవరో తెలుసుకునే పనిలో పడిందట. మొత్తంగా ఈ వ్యవహారం మీద అటు బీఆర్‌ఎస్‌ నాయకులు, ఇటు కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఆచితూచి స్పందిస్తున్నారు. అసలు బయటికి ఎలా వచ్చిందన్న విషయమై కవిత ఆఫీస్‌ చుట్టూ తిరుగుతోందట వ్యవహారం.

Exit mobile version