Anaganaga : హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మంచి ఎమోషన్ ఉండటంతో ఓటీటీలో భారీ వ్యూస్ సాధిస్తోంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా థియేటర్లలో వచ్చిన సినిమాలో ఓటీటీలో వస్తుంటాయి. కానీ ఓటీటీలో ముందు వచ్చిన మూవీలు అసలు థియేటర్లలోకి రావడం గగనం. కానీ ఇప్పుడు సుమంత్ దాన్ని నిజం చేసి చూపించాడు. సుమంత్, కాజల్ చౌదరి నటించిన ఈ సినిమాను సన్నీ సంజయ్ డైరెక్ట్ చేశారు. ఓటీటీలో భారీ రెస్పాన్స్ రావడంతో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు.
Read Also : Off The Record: ఆ మాజీ మంత్రి వ్యవహారం వైసీపీలో బూమ్ రాంగ్ అయ్యిందా..?
ఈవెంట్ లో సుమంత్ కీలక ప్రకటన చేశాడు. ‘ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్, ప్రేక్షకుల కోరిక మేరకు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. విజయవాడలో ముందుగా ఈ నెల 24న, విశాఖపట్నంలో ఈ నెల 25న రిలీజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత మరిన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తాం. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. మళ్లీరావా తర్వాత నన్ను బాగా ఆకట్టుకున్న మూవీ ఇది. ముందు నుంచి కంటెంట్ పై నమ్మకంతోనే అందరం చేశాం. అదే నిజమైంది. ప్రేక్షకులు కంటెంట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మేం అనుకున్న దానికంటే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. అందుకే దీన్ని మరింత మందికి దగ్గర చేయాలని చూస్తున్నాం’ అంటూ తెలిపారు సుమంత్.
Read Also : Kavitha: కేసీఆర్ దేవుడే కానీ.. చుట్టూ దయ్యాలున్నాయ్.. కవిత సంచలన వ్యాఖ్యలు..