Off The Record: తెలంగాణలో పవన్‌ని బీజేపీ పూచికపుల్లతో సమానంగా చూస్తోందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న టైంలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. మిత్రులు శత్రువులు అవుతున్నారు. శతృవులు మిత్రులు అవుతున్నారు. బీజేపీ- జనసేన బంధం కూడా ఇలాగే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌కళ్యాణ్ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయబోమన్నంతగా బిల్డప్ ఇస్తున్న బీజేపీ.. తెలంగాణకు వచ్చేసరికి ఆయన్ని పూచిక పుల్లతో సమానంగా తీసిపారేస్తోందట. గరికపాడు చెక్‌పోస్ట్‌కు అవతలే నీతో దోస్తీ తప్ప ఇవతల పనిలేదని నేరుగానే చెప్పేస్తున్నారు కమలనాధులు. ఏపీలో పొత్తు ఉన్నంత మాత్రాన తెలంగాణలో అది కంటిన్యూ అవ్వాలన్న రూలేమీ లేదన్నట్టుగా ఉంది వ్యవహారం. ఈసారి తెలంగాణలో పోటీ చేయాలని పవన్ అనుకుంటున్నా…అది మాకు సంబంధంలేని మేటర్ అన్నట్టుగా ఉందట బీజేపీ నేతల వైఖరి. అది గమనించే…తన సొంత ప్రయత్నాల్లో ఉన్నారు జన సేనాని. కొన్ని నియోజక వర్గాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించింది పార్టీ. తెలంగాణలో నాలుగు పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటోందట జనసేన.
జన సేనతో పొత్తు ఆంధ్రలో ఉంటుంది కానీ తెలంగాణలో కాదని నేరుగానే చెప్పారు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా.. మేం సింగిలే తప్ప మింగిల్ అయ్యేది లేదని తేల్చేశారు. దీంతో.. బీజేపీ మిత్ర ధర్మం ఇలాగే ఉంటుందా అని వెటకారాలు చేస్తున్నారట రాజకీయ ప్రత్యర్థులు. గతంలో కూడా రెండు పార్టీల మధ్య ఇలాంటి వ్యవహారమే జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లు కావాలని అడిగింది జనసేన. బీజేపీ మాత్రం ససేమిరా అంది. అయినా ఆ బంధం అలా కొనసాగుతూ వచ్చింది. తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో brs అభ్యర్థికి మద్దతు ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక తాజాగా తెలంగాణ జన సేన నేతలతో భేటీ అయినా… పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది. అంటే సింగిల్‌గానే ముందుకు వెళ్ళాలని డిసైడైనట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా బీజేపీ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు పవన్. పొత్తు అంటారు… ప్రచారం చేస్తానంటే వద్దంటారని అప్పట్లోనే అన్నారాయన.
Also Read
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- Virat Kohli: "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది".. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
- Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే…కలిగే లాభ నష్టాల విషయంలో టిఎస్ కాషాయ దళానికి కన్ఫ్యూజన్ ఉందట. ఆంధ్రా నుంచి వచ్చి స్థిరపడ్డ వారి విషయంలో పాజిటివ్‌గానే ఉన్నా… మరి కొందరు దాన్ని వివాదం చేసే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్నారట. ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం బీజేపీ లెక్కలు మరీ ఇంత నిర్దాక్షిణ్యంగా ఉంటాయా అని గుసగుసలాడుతున్నారు. నేను గిల్లితే గిల్లిచ్చుకోవాలి, గిచ్చితే గిచ్చిచ్చుకోవాలన్న ప్రకాష్‌రాజ్ డైలాగ్‌ని గుర్తు చేసుకుంటూ… బీజేపీకి మూడొచ్చి పొత్తు పెట్టుకోమంటేనే పెట్టుకోవాలి తప్ప అవతలి వాళ్ళ మూడ్స్‌తో పని లేదని సెటైర్స్ వేసుకుంటున్నారట.
తాజావార్తలు
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
-
Kishan Reddy : ఓట్ల చోరీ చేయం.. మనసులే గెలుస్తాం
-
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?