Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About High Political Drama In Ibrahimpatnam Municipality As Congress And Brs Battle For Chairman Post

Off The Record: ఇబ్రహీంపట్నం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు

Published Date :February 25, 2026 , 10:01 pm
By Sudhakar Ravula
  • ఇబ్రహీంపట్నం కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎత్తులకు పై ఎత్తులు..
  • మా కౌన్సిలర్స్‌ని ఇబ్బందిపెడుతున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపణలు..
  • గెలుపు కోసం అడ్డదారులు తొక్కారంటున్న కాంగ్రెస్‌..
  • మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి ఫ్యామిలీ మీద కౌన్సిలర్‌ కిడ్నాప్‌ కేసు..
  • ఇబ్రహీంపట్నంలో 24 వార్డ్‌లు, మేజిక్‌ ఫిగర్‌ 13..
  • బీఆర్‌ఎస్‌కు 14 మంది కౌన్సిలర్స్‌..
  • ఇద్దరు ముగ్గురు హ్యాండ్‌ ఇస్తే పరిస్థితి ఏంటని బీఆర్‌ఎస్‌లో కంగారు..
  • 23వ వార్డ్‌ కౌన్సిలర్‌ శ్వేత మీద కులం వివాదం..
  • 21వ వార్డ్‌ కౌన్సిలర్‌ బుగ్గ రాములు మీద డబుల్‌ ఓట్‌ ఫిర్యాదు..
  • ఓపెన్‌ వద్దు, సీక్రెట్‌ ఓటింగ్‌ కావాలంటున్న కాంగ్రెస్‌..
  • సీక్రెట్‌ ఓటింగ్‌ జరిగితే తేడా కొడుతుందని బీఆర్‌ఎస్‌ టెన్షన్‌..
  • ఇబ్రహీంపట్నం నంబర్‌ గేమ్‌పై పెరుగుతున్న ఉత్కంఠ..
Off The Record: ఇబ్రహీంపట్నం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో పొలిటికల్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ పీఠం కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులతో యమా రంజుగా మారుతోంది రాజకీయం. మున్సిపల్‌ ఛైర్మన్ సీటు కోసం అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష కౌన్సిలర్లను ఇబ్బందులు పెడుతోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అటు కాంగ్రెస్‌ నుంచి కూడా అదే రేంజ్‌లో రివర్స్ అటాక్‌ ఉండటంతో… కథ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్నికల్లో గెలవడం కోసం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అడ్డదారులు తొక్కారంటూ ఆధారాలు చూపిస్తోంది కాంగ్రెస్‌. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక
ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. రాళ్ల దాడి, కౌన్సిలర్ల మధ్య గొడవలు, బహిరంగ దాడులు, కోర్ట్ స్టే, మాజీ ఎమ్మెల్యేకు, ఆయన కుమారుడికి నోటీసులు.. ఇలా ఒకటేమిటి…. రకరకాలుగా అంతు చిక్కని ట్విస్ట్‌లతో ఇబ్రహీంపట్నం పొలిటికల్‌ స్క్రీన్‌ మామూలుగా కనిపించడం లేదు.

మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కేసు మొదలు.. ఇబ్రహీపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడం వరకు అన్నీ ఊహించని మలుపులే. దీంతో మున్సిపల్ రాజకీయం రచ్చకెక్కింది. ప్రస్తుతం ఇక్కడ గెలుపుకంటే ఎక్కువగా.. ప్రత్యర్థిని పడగొట్టడమన్న టార్గెట్‌తో పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ మున్సిపాలిటీలో ​మొత్తం 24 వార్డులు ఉండగా… ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన ​మ్యాజిక్ ఫిగర్ 13. ఇక పార్టీల గెలుపు లెక్కలు చూసుకుంటే…. బీఆర్ఎస్‌కు 14 మంది కౌన్సిలర్స్‌ ఉన్నారు. అంటే.. సరిపడా మెజార్టీ సాధించినట్టే. కానీ… ఛైర్మన్‌ ఎన్నిక అంటేనే ఆ పార్టీ బెంబేలెత్తిపోతోంది. ఇక్కడే రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో. ఇక్కడ ​కాంగ్రెస్ ఏడు, బీజేపీ 2 వార్డులను గెల్చుకోగా…. ఒకచోట ఇండిపెండెంట్‌ విజయం సాధించారు. అయితే… సరిపడా సీట్లు వచ్చాయన్న మాటేగానీ… బొటాబొటీ మెజార్టీ కారణంగా… సొంత కౌన్సిలర్స్‌ ఇద్దరు ముగ్గురు హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన గులాబీ పెద్దల్ని వెంటాడుతోందట. అదే ఇప్పుడు నియోజకవర్గ పార్టీ నాయకులకు కూడా నిద్ర లేకుండా చేస్తోందని అంటున్నారు. ఇక 23వ వార్డు కౌన్సిలర్ నీలం శ్వేత ఓసీ అయి ఉండి.. బీసీగా అవతారమెత్తారన్న ఆరోపణలున్నాయి. గెలవడం కోసం ఆమె కులాన్నే మార్చేశారని, నకిలీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారన్న ఫిర్యాదులతో బీఆర్‌ఎస్‌ శిబిరంలో కలవరం మొదలైందట. ఇక 21వ నంబర్‌ వార్డులో బీఆర్‌ఎస్‌ నుంచే గెలిచారు బుగ్గ రాములు. ఆయన ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పేతుళ్ళలో ఓటు వేశారని, అదే వ్యక్తి తిరిగి ఇబ్రహీంపట్నం టౌన్‌లో కౌన్సిలర్‌గా ఎలా పోటీ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్‌ నాయకులు. చట్టం కళ్ళు గప్పి చేసిన ఈ డబుల్ ఓటు వ్యవహారం ఇప్పుడు బట్టబయలైందంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

అలా… నకిలీ సర్టిఫికెట్లతో ఒకరు.. డబుల్ ఓటుతో మరొకరు.. కిడ్నాప్ కేసులో ఇంకొక బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ మీద కేసులు బుక్‌ అయ్యాయి. మరోవైపు బీఆర్ఎస్ క్యాంప్ పాలిటిక్స్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ వేసింది. మున్సిపాలిటీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్ ఓటింగ్ వద్దు.. సీక్రెట్ బ్యాలెట్ కావాలంటూ పట్టుబట్టింది. ఆ విధంగా రహస్య ఓటింగ్ పెడితే.. బీఆర్ఎస్ అసమ్మతి నేతలు తమ వైపు మొగ్గుతారన్నది హస్తం పార్టీ ధీమా. అయితే అది అప్పుడు సాధ్యపడలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి ఎన్నికల కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్ కలిసి ఎలక్షన్‌ డేట్‌ ఫిక్స్ చేయాల్సి ఉంది. అయితే ఈసారి రహస్య ఓటింగ్ పెడితే తమ పరిస్థితి ఏంటని బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ఇబ్రహీంపట్నం రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఈ పరిస్థితుల్లో సరిపడా మెజార్టీ ఉందని అనుకుంటున్నా….ఫైనల్‌గా నంబర్‌ గేమ్‌లో ఎక్కడ దెబ్బపడుతుందోనని ఆందోళన పడుతున్నారు బీఆర్‌ఎస్‌ లీడర్స్‌. తనను మానసికంగా వేధించారని, కిడ్నాప్ చేశారని యాదగిరి స్వయంగా కోర్టులో చెప్పడం.. ఇప్పుడు మంచిరెడ్డి ఫ్యామిలీ మెడకు చుట్టుకుంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ యాదగిరి ముందు మిస్సింగ్, తర్వాత ప్రత్యక్షం కావడమే మునిసిపల్ రాజకీయాలకు సెంటర్ గా మారింది. మొత్తం మీద ఇబ్రహీంపట్నం పొలిటికల్‌ గేమ్‌ మాంఛి రసవత్తరంగా మారుతోంది. ఈ ఆటలో ఫైనల్‌ అడ్వాంటేజ్‌ ఎవరికి ఉంటుందన్నది చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS councillor controversy
  • Congress vs BRS Ibrahimpatnam
  • Ibrahimpatnam chairman election news
  • Ibrahimpatnam municipal election
  • Manchireddy family notice case

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • Varanasi : అంటార్కిటికాలో ‘వారణాసి’.. ప్రియాంక చోప్రా నటనపై మహేశ్ షాకింగ్ కామెంట్స్

  • RK Roja: డీఎంకే పార్టీకి మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం..

  • TVK VIJAY : విజయ్ కు మరో షాక్.. మొన్న భార్య.. నేడు కొడుకు

  • PCB Fines Pakistan Players: అబ్బా ఏం ఫీల్ ఉంది.. పాక్ ప్లేయర్లకు PCB షాక్ ట్రీట్మెంట్.. ప్రతి ఆటగాడికి 50 లక్షల జరిమానా!

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

ట్రెండింగ్‌

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions