Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Congress Mp Candidate Raghuveer Reddy And Nalgonda Congress Party

Off The Record: నా కుటుంబంతో పాటు.. నా వేలు విడిచిన బామ్మర్ది..!

Published Date :March 12, 2024 , 10:30 pm
By Sudhakar Ravula
Off The Record: నా కుటుంబంతో పాటు.. నా వేలు విడిచిన బామ్మర్ది..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Off The Record: కాంగ్రెస్‌ నల్గొండ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డిని ప్రకటించింది పార్టీ హై కమాండ్‌. ఆ ప్రకటన మీదే ఇప్పుడు కొందరు సీనియర్స్‌, ఇతర నాయకులు మండిపోతున్నారట. అంతా మీరేనా.. ? అన్నీ మీకేనా? మాకు టిక్కెట్స్‌ లేవా? కనీసం మాపేర్లు పరిగణనలోకి కూడా తీసుకోరా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇదే టైంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడి, నల్లగొండ లోక్‌సభ సీటు హామీ పొందిన పటేల్ రమేష్ రెడ్డి సంగతి ఏంటన్న ప్రస్తావన కూడా వస్తోంది. పార్టీ సీనియర్ నేతలు ఇచ్చిన హామీకి కూడా దిక్కులేదా అని ప్రశ్నిస్తున్నారు. నోటి మాటగా కాకుండా అప్పటి నల్లగొండ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో సీనియర్ నేత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి లిఖిత పూర్వకంగా తమ లెటర్‌ హెడ్స్‌ మీద రాసి సంతకాలు చేసి ఇచ్చారు. ఆ లేఖలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గ్రూప్స్‌లో సర్క్యులేట్‌ అవుతున్నాయి. వాటికింద ఇదేనా మీ నిబద్ధత అన్న కామెంట్స్‌ కూడా వస్తుండటంతో ఉక్కిరి బిక్కిరి అవుతోందట నల్గొండ కాంగ్రెస్‌.

ఈ టిక్కెట్‌ ఆశించిన ఇంకొందరు నేతలైతే… ఉదయ్ పూర్ డిక్లరేషన్ నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్లకు వర్తించదా? డిక్లరేషన్లు, తీర్మానాలు, రూల్స్‌ అన్నీ మాకు,… పదవులు, కీలక భాధ్యతలు మాత్రం పెద్దపెద్ద హోదాలు ఉన్న వాళ్లకా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి వెంకటరెడ్డి నల్లగొండ, రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరో సీనియర్ నేత జానారెడ్డి కుటుంబం నుండి ఆయన చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి నల్లగొండ ఎంపీ టిక్కెట్‌ ఇవ్వడాన్నిఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నిస్తున్నారు సదరు నేతలు. కొత్త పాత అన్నదాంతో సంబంధం లేకుండా… పెద్దోళ్ళ పేర్లు చెప్పి ఇలా ఫ్యామిలీ ప్యాకేజీలు తీసుకుంటే… ఇక మాకెప్పుడు అవకాశాలు? మేం ఎదిగేది ఎన్నడు అని ప్రశ్నిస్తున్నారు నల్గొండ కాంగ్రెస్‌ ఇతర సీనియర్‌ లీడర్స్‌. భార్య, తమ్ముడు, చిన్నకొడుకు, పెద్దకొడుకు, ఇలా అంతా వాళ్ళేనా? ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు, సీనియర్ నేతల కీలక అనుచరులకు మాత్రమే టిక్కెట్‌ అడిగే అర్హత ఉంటుందా. అన్నది ఆశావహుల క్వశ్చన్‌.

Also Read

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్
  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
  • PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
Add as a preferred
source on google

బీఆర్ఎస్ హవా నడుస్తున్నప్పుడు… క్యాడర్ కేసులపాలైతే… వీళ్ళంతా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. తమ పేరు కనీసం టిక్కెట్‌ రేసులో చర్చకు కూడా రాకుండా కొందరు సీనియర్లు అడ్డుపడుతున్నారని ఆవేదనగా ఉన్నారట నల్గొండ కాంగ్రెస్‌ నేతలు. పెద్దోళ్ళ వ్యవహారశైలే తమ రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉందని లోలోపల రగిలిపోతున్నట్టు తెలిసింది. గతంలో ఒకరి పేరు మరొకరు పలకడానికి కూడా ఇష్టపడని, ఎదరుపడితే పలకరించుకోకుండా ముఖం చాటేసుకున్న సీనియర్లు… ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారేసరికి ఫ్యామిలీ ప్యాకేజీలతో దిగిపోతున్నారని, అంతా బాగున్నప్పుడు మేమున్నామని వచ్చేవారికంటే……. పార్టీ కష్టం కాలంలో ఉన్నప్పుడు అంటిపెట్టుకుని ఉన్న వారికి అవకాశం ఇవ్వకూడదా…. అని గాంధీభవన్‌ పెద్దలను ప్రశ్నిస్తున్నారు నల్గొండ నేతలు. ఎంపీ అభ్యర్థిగా రఘువీర్‌ పేరు ప్రకటనతో ఆధిపత్యపోరుకు తెరలేచినట్లేనని, అంతా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారనే చర్చజరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రేపు ఎన్నికలప్పుడు ఎవరు ఎంత మేరకు సహకరిస్తారు? సహకరించినట్టు నటించి కొంప ముంచేవాళ్ళు ఎవరన్న ప్రస్తావన కూడా వస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • jana reddy
  • Nalgonda Congress Party
  • off the record
  • Raghuveer Reddy

తాజావార్తలు

  • PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!

  • Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions