Off The Record: టీడీపీలో మరో కొత్త గోల..! మాజీ మంత్రుల మధ్య తారా స్థాయికి విభేదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి విశాఖజిల్లా తెలుగుదేశంపార్టీలో బండారు, చింతకాయల ఫ్యామిలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారసత్వ రాజకీయ పునాదులపై బలమైన నాయకులుగా ఎదిగారు మాజీ మంత్రులు సత్యనారాయణ మూర్తి, అయ్యన్నపాత్రుడు. ఉత్తరాంధ్రలో కీలకమైన వెలమ సామాజిక వర్గానికి ప్రతినిధులుగా ఆవిర్భావం నుంచి టీడీపీనే నమ్ముకున్న ఈ ఇద్దరు నేతలు సమాన గౌరవం ఆశిస్తుంటారు. అయ్యన్న పొలిట్ బ్యూరో సభ్యుడు కాగా… సత్యనారాయణ మూర్తికి కీలకమైన కాకినాడ, కోనసీమ జిల్లాల సమన్వయ బాధ్యతలు అప్పగించింది పార్టీ. దశాబ్దాల తరబడి ఒకే పార్టీలోఉన్నా.. ఇద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలు. ఎవరి నియోజకవర్గ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నా.. వ్యక్తిగత ప్రయోజనాలను సాధించుకునే దగ్గర మాత్రం తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. అయితే..ఉమ్మడిజిల్లాపై గట్టిపట్టు ఉన్న అయ్యన్నపాత్రుడి ఆధిపత్యం పార్టీలో కనిపిస్తుంది. రాజకీయ కుటుంబాలతో ఉన్న విస్త్రతమైన బంధుత్వాలు బండారుకు అడ్వాంటేజ్.
పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే క్రమంలో అయ్యన్న దూకుడు మంచి ఫలితాలను ఇచ్చిందన్న అభిప్రాయం స్థానికంగా ఉంది. అదే సమయంలో మాజీ మంత్రి గంటాశ్రీనివాసరరావు, బండారు సత్యనారాయణమూర్తి ఒక గ్రూప్ అయ్యారు. పార్టీలోనూ….అధికారంలో వున్నప్పుడూ తనతో సమానమైన అయ్యన్నకు ఎక్కువ అవకాశాలు లభిస్తుండటంపై బండారు తీవ్ర అసంతృప్తితో ఉండేవారట. దీంతో అంతర్గతంగా ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయ వైరం నడుస్తుంటుంది. ఐతే, గతంతో పోలిస్తే ఇప్పుడు బండారు బలం, బంధుత్వం పెరిగింది. కారణం..శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయకుడికి బండారు స్వయానా మామ. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి వియ్యంకుడు. ఇవన్నీ పార్టీలో సత్యనారాయణమూర్తికి కలిసివచ్చే అంశాలు. ఇక్కడే అసలు సిసలు పొలిటికల్ డ్రామాకు తెరలేచింది.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
వచ్చే ఎన్నికలు లక్ష్యంగా వారసుల రాజకీయ ఆరంగేట్రం కోసం అయ్యన్న, బండారు పావులు కదపడం మొదలుపెట్టారు. నర్సీప ట్నం నుంచి తిరిగి పోటీ చేయాలనుకుంటున్న అయ్యన్నపాత్రుడు…. అనకాపల్లి ఎంపీ సీటు తన కుమారుడు విజయ్‌కి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇందు కోసం ఆయన హైకమాండ్ తో అమితుమీ తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. ఒకవేళ సామాజిక కోణంలో ఎంపీ సీటును కాపులకు కేటాయిస్తే మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ్‌ని బరిలో దించాలనేది అయ్యన్న ప్లాన్. ఇక్కడే మడత పేచీ మొదలైంది. పెందుర్తిలో తాను, మాడుగులలో తన కుమారుడు అప్పలనాయుడు పోటీ చేయాలని అనుకుంటున్నారట సత్యనారాయణమూర్తి. సీనియర్స్ కుటుంబాలకు రెండు టిక్కెట్లు ఇస్తే తనకూ కావాలని అంటున్నారట ఆయన. స్థానికంగా తనకున్న బలగం, బంధుత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకోమంటున్నారట. దీంతో మాజీమంత్రుల మధ్య విభేదాలు ఇప్పుడు పతాక స్థాయికి చేరినట్టు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో టీడీపీ ప్రయోగాలు చేసే అవకాశం ఏ మాత్రం లేదని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్లకే సీటు గ్యారెంటీ లేనప్పుడు ఒకే కుటుంబానికి రెండేసి ఎలా సాధ్యమన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ విషయాలు అటు అయ్యన్నకు, ఇటు బండారుకు తెలియనివి కాదని, ఒకరి ఎత్తుగడలను మరొకరు ప్రభావితం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రతిపాదనలు చేసుకుంటున్నారన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. బండారు, గంటా వంటి నేతలు ఒక గ్రూప్ గా ఏర్పడి రాజకీయాలు నడుపుతున్నందున అయ్యన్న తన డిమాండ్లను ఎలా సాధించుకుంటారు? దానికి సత్యనారాయణమూర్తి రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!