Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blood Sugar Test Timing: డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ తరచూ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నాయో తెలియడమే కాకుండా, డయాబెటిస్ వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను ముందే అడ్డుకోవచ్చు. అయితే అసలు షుగర్ ఎప్పుడు చెక్ చేయాలి? రోజుకు ఎన్నిసార్లు పరీక్షించుకోవాలి? మనలో చాలామంది బ్లడ్ షుగర్ చెక్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేస్తున్నారు? అనే విషయాలపై ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు పలు కీలక సూచనలు చేశారు. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎవరు ఎన్నిసార్లు షుగర్ చెక్ చేసుకోవాలి..
టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు రోజుకు 4 నుంచి 5 సార్లు బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా భోజనానికి ముందు, తిన్న తర్వాత, వ్యాయామానికి ముందు, పడుకునే ముందు టెస్ట్ చేసుకోవడం అవసరం. అలాగే రోజుకు ఒకటికంటే ఎక్కువసార్లు ఇన్సులిన్ షాట్స్ తీసుకునేవారు సాధారణంగా భోజనానికి ముందు, పడుకునే ముందు చెక్ చేసుకోవాలి. అదే లాంగ్-యాక్టింగ్ ఇన్సులిన్ తీసుకునేవారైతే కేవలం బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు, కొన్నిసార్లు రాత్రి భోజనానికి ముందు లేదా పడుకునే ముందు చెక్ చేసుకుంటే సరిపోతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు అంటే.. కేవలం టాబ్లెట్లతో షుగర్ కంట్రోల్ చేసేవారు లేదా కేవలం డైట్, వ్యాయామం ద్వారా నియంత్రించేవారు రోజుకు ఒకసారి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
- Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
షుగర్ చెక్ చేసేటప్పుడు చేసే పెద్ద తప్పులివే..
బ్లడ్ షుగర్ రీడింగ్స్ కరెక్ట్‌గా రావడానికి వైద్యశాస్త్రంలో కొన్ని స్పష్టమైన నియమాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. కానీ చాలామంది ఇక్కడే పొరపాట్లు చేస్తుంటారని అన్నారు.
* కచ్చితమైన ఫాస్టింగ్ రీడింగ్ రావాలంటే కనీసం 8 గంటల పాటు ఏమీ తినకుండా (ఫాస్టింగ్) ఉండాలి. చాలామంది కేవలం 5-6 గంటలు లేదా ఏకంగా 12 గంటలు తినకుండా ఉన్న తర్వాత టెస్ట్ చేస్తారు. ఇది తప్పు. రాత్రి భోజనం తర్వాత కరెక్ట్‌గా 8 గంటల గ్యాప్ ఇచ్చి ఉదయాన్నే టెస్ట్ చేయడమే సరైన పద్ధతి. లేదంటే రీడింగ్ తప్పుగా వస్తుంది.
* భోజనం చేసిన కరెక్ట్‌గా 2 గంటల తర్వాతే షుగర్ చెక్ చేయాలి. కొందరు తిన్న గంటకే లేదా 3 గంటల తర్వాత చూసుకుంటారు. అలా కాకుండా భోజనం ముగించగానే 2 గంటలకు అలారం సెట్ చేసుకుని మరీ టెస్ట్ చేసుకోవాలి. అప్పుడే శరీరంలో గ్లూకోజ్ అసలు స్థాయిలు తెలుస్తాయి.
* డయాబెటిస్ పేషెంట్లు ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి తప్పనిసరిగా HbA1c పరీక్ష చేయించుకోవాలి. ఇది గత 3 నెలల సగటు షుగర్ లెవెల్స్ యొక్క కచ్చితమైన సమాచారాన్ని ఇస్తుంది. ఈ టెస్ట్ కోసం ఖాళీ కడుపుతో ఉండాల్సిన పనిలేదు, తిన్న తర్వాతైనా, ఎప్పుడైనా చేయించుకోవచ్చు.
నార్మల్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలంటే..
భోజనానికి ముందు (Fasting) 80 నుంచి 110 mg/dL
భోజనం చేసిన 2 గంటల తర్వాత (Post-Meal)180 mg/dL కంటే తక్కువ
షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఇలా చేయండి..
ఒకవేళ మీరు క్రమం తప్పకుండా డయాబెటిస్ మందులు వాడుతున్నప్పటికీ షుగర్ లెవెల్స్ ఈ రీడింగ్స్ కంటే ఎక్కువగా వస్తుంటే, వెంటనే మీ డాక్టర్‌ను సంప్రదించాలి. వైద్యులు మీ డైట్ ప్లాన్ మార్చడం లేదా మందుల డోసేజ్ పెంచడం ద్వారా షుగర్‌ను నియంత్రిస్తారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!