Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record %e0%b0%95%e0%b0%be%e0%b0%ae%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d %e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d %e0%b0%ae

Off The Record : కామ్రేడ్స్ కాంగ్రెస్ మీద అలిగారా? అంతా మీ వల్లే..!

Published Date :February 12, 2025 , 10:34 pm
By Gogikar Sai Krishna
Off The Record : కామ్రేడ్స్ కాంగ్రెస్ మీద అలిగారా? అంతా మీ వల్లే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కామ్రేడ్స్‌… కాంగ్రెస్‌ మీద అలిగారా? అంతా మీ వల్లే… అంటూ నిందిస్తున్నారా? దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అగ్గికి ఆజ్యం పోసిందా? తెలంగాణ కామ్రేడ్స్‌ కూడా మేము సైతం అంటూ… ఓ పుడక వేసేస్తున్నారా? అసలిప్పుడు కమ్యూనిస్ట్‌లు ఏమనుకుంటున్నారు? జరుగుతున్న చర్చ ఏంటి? రకరకాల పొలిటికల్‌ ఈక్వేషన్స్‌, ఎన్నో ప్రాధాన్యతల నడుమ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకున్న ఇండియా కూటమి వ్యవహారం నానాటికీ తీసికట్టు అన్నట్టుగా మారుతోందంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. మిత్ర పక్షాల మధ్య లుకలుకలు, వరుస పరాజయాలు నైతిక స్ధైర్యాన్ని దెబ్బ తీస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు. అదే సమయంలో అలకలు చాలవా అన్నట్టు ఇంకో స్టెప్‌ ముందుకేస్తున్న మిత్రపక్షాల నేతలు కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఇప్పుడసలు ఇండియా కూటమిలో ఏం జరుగుతోందన్న డౌట్స్‌ వస్తున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో. కర్ణాటక, తెలంగాణ తప్ప ఇటీవలి కాలంలో ఇంకెక్కడా కాంగ్రెస్‌ పార్టీ అంత ప్రభావం చూపలేకపోవడంతో… సహజంగానే మిత్ర పక్షాల్లో గౌరవం తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోందన్నది కొందరి వెర్షన్‌. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ నేతల వైఖరి, వాళ్ళ మాటలు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయట. కాంగ్రెస్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎర్రన్నలు. మాతో సహా… ఇండియా కూటమిలోని ఏ పార్టీతోనూ…కాంగ్రెస్ అధినాయకత్వం సరిగా సమన్వయం చేసుకోలేకపోతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారట లెఫ్ట్‌ నాయకులు. కూటమి నుంచి ఎవైనా పార్టీలు పక్కకు తప్పుకున్నాయంటే… అది కాంగ్రెస్‌ కారణంగానే అంటూ తాజాగా సీపీఐ నాయకులు కామెంట్‌ చేస్తున్నారంటే… పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. అంటే… కూటమికి బీటలు వారుతున్నాయని వామపక్ష నేతలు చెప్పకనే చెబుతున్నారా అన్న డౌట్స్‌ సైతం వస్తున్నాయట.

ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పునరాలోచించుకోకుంటే…. మొదటికే మోసం వస్తుందన్నది వామపక్ష నేతల వార్నింగ్‌గా చెప్పుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూటమిలో చీలికలు వస్తున్నా… నాయకత్వ స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ అందరినీ కలుపుకుని పోవడంలో విఫలమైందని ఆరోపిస్తున్నారు లెఫ్ట్‌ లీడర్స్‌. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని కూడా ఈ సందర్భంగా ఉదహరిస్తున్నట్టు సమాచారం. కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లే అక్కడ ఆప్ విడిగా పోటీ చేసిందని, ఫలితంగా ఓట్లు చీలిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటూ విశ్లేషిస్తున్నారట వామపక్ష నాయకులు. ఢిల్లీలో ఆప్‌ ఓటమికి ఎవరినైనా నిందించాల్సి వస్తే…. అది ముందు కాంగ్రెస్‌నే అన్నది వాళ్ల వెర్షన్‌గా తెలుస్తోంది. తెర వెనక బీజేపీ అనేక కుట్రలు చేస్తున్నా…
కాంగ్రెస్ అధినాయకత్వం పసిగట్టలేకపోతోందని, నాయకత్వ లక్షణం ఇదేనా అంటూ ఫైరైపోతున్నట్టు సమాచారం. కేజ్రీవాల్‌ అరెస్ట్‌, జైలు జీవితం, విడుదల లాంటి వ్యవహారాల్లో కాంగ్రెస్‌ నిర్లక్ష్యమే కొంప ముంచిందన్నది సీపీఐ ఆరోపణ. మొత్తంగా కాంగ్రెస్‌ అధిష్టానం నిర్లిప్తత, ప్లానింగ్‌ లేమి, ఒంటెద్దు పోకడలవల్లే ఇండియా కూటమి బలహీనపడుతోందని, అంతిమంగా అది బీజేపీకి బలంగా మారుతోందన్నది సీపీఐ నేతల వెర్షన్‌గా కనిపిస్తోంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌, సీపీఐ కలిసే పోటీ చేశాయి. ఈ పరిస్థితుల్లో లెఫ్ట్‌ తాజా వైఖరి, వ్యాఖ్యలు ఇక్కడ కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • CPM
  • ntv
  • off the record

తాజావార్తలు

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

  • Growth Risks: భారత ఆర్థిక వృద్ధికి పొంచి ఉన్న ముప్పు.. భారీగా తగ్గిన అంచనాలు..

  • Trump: ‘నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు’.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions