Odisha: ఒడిశాలో పడవ ప్రమాదం.. ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో శుక్రవారం జరిగిన పడవ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఖర్సియాకి చెందిన 50 మందికిపైగా ప్రయాణికులు బార్‌ఘర్ జిల్లా పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా పడవ బోల్తా పడింది. దీంతో అందులోని 50 మంది నదిలో మునిగిపోయారు. వారిలో కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు నిలుపుకోగా ఏడుగురు ఈత రాక నీట మునిగిపోయారు. జార్సుగూడ జిల్లా రెంగలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా ఘాట్ వద్దకు చేరుకోగానే బోటు బోల్తా పడినట్లు సమాచారం. మత్స్యకారులు.. 35 మంది ప్రయాణికులను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మరో 13 మందిని రక్షించారు. ఏడుగురు గల్లంతయ్యారని.. వారిని వెతికేందుకు సర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఘటనకు కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో స్కూబా డైవర్లు, సెర్చ్ కెమెరాలను ఘటనాస్థలికి తరలించారు.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
పడవ ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని నవీన్ భరోసా ఇచ్చారు. ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!