NTV Telugu Site icon

ODI World Cup 2023: ప్రపంచకప్‌ 2023కి శ్రీలంక, నెదర్లాండ్స్‌ అర్హత.. భారత్‌ లేటెస్ట్ షెడ్యూల్‌ ఇదే!

Odi World Cup 2023 New

Odi World Cup 2023 New

Team India Latest Fixtures for ICC ODI CWC 2023: వన్డే ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగే 10 జట్లు ఏవో తేలిపోయాయి. క్వాలిఫయర్స్‌ పోటీలలో ముందుగా మాజీ ఛాంపియన్ శ్రీలంక ప్రపంచకప్‌ బెర్త్‌ను కన్ఫర్మ్‌ చేసుకోగా.. తాజాగా చిన్న టీమ్ నెదర్లాండ్స్‌ అర్హత సాధించింది. భారత్‌, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, నెదర్లాండ్స్‌ ప్రపంచకప్ రేసులో ఉన్నాయి. 2011 అనంతరం భారత్ గడ్డపై మెగా టోర్నీ జరుగుతుండడంతో టీమిండియా ఫెవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్‌ పోటీల ద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్‌ మెగా టోర్నీకి అర్హత సాధించాయి. ఇప్పుడు క్వాలిఫయర్‌-1గా శ్రీలంక, క్వాలిఫయర్‌-2గా నెదర్లాండ్స్‌ నిలిచాయి. అక్టోబర్ 5 నుంచి ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇక నవంబర్ 19న అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు పూర్తయిన నేపథ్యంలో భారత్‌ ఆడే మ్యాచ్‌ల వివరాలకు సంబంధించి తాజా అప్‌డేట్ షెడ్యూల్‌ ఓసారి చూద్దాం.

భారత్ అప్‌డేట్ షెడ్యూల్‌ (ODI World Cup 2023 India Latest Schedule):
# భారత్‌ vs ఆస్ట్రేలియా : అక్టోబర్ 8, చెన్నై
# భారత్ vs అఫ్గానిస్థాన్‌ : అక్టోబర్ 11, ఢిల్లీ
# భారత్ vs పాకిస్థాన్ : అక్టోబర్ 15, అహ్మదాబాద్
# భారత్ vs బంగ్లాదేశ్‌ : అక్టోబర్ 19, పుణె
# భారత్ vs న్యూజిలాండ్ : అక్టోబర్ 22, ధర్మశాల
# భారత్ vs ఇంగ్లండ్: అక్టోబర్ 29, లక్నో
# భారత్ vs శ్రీలంక: నవంబర్‌ 2, ముంబై
# భారత్ vs దక్షిణాఫ్రికా: నవంబర్ 5, కోల్‌కతా
భారత్ vs నెదర్లాండ్స్‌ : నవంబర్ 11, బెంగళూరు

Also Read: iPhone 13 Mini Price 2023: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 13 మినీపై రూ. 18200 ఆదా!

Also Read: Black Color Car: బ్లాక్ కలర్ కారుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి!