India vs Afghanistan Playing 11 Out: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని షాహిదీ చెప్పాడు. ఇది మంచి బ్యాటింగ్ వికెట్ అని, టీమిండియాను నియంత్రించడానికి తమకు మంచి బౌలింగ్ అటాక్ ఉందన్నాడు. తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి అవకాశం అని షాహిదీ తెలిపాడు.
మరోవైపు భారత్ ఈ మ్యాచ్ కోసం ఓ మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆర్ అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు. తాము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని రోహిత్ చెప్పాడు. వికెట్ మారుతుందని అనుకోవద్దన్నాడు. ఆస్ట్రేలియాపై రాహుల్, కోహ్లీ బాగా బ్యాటింగ్ చేశారని.. తమ ప్రదర్శనలో చాలా గర్వపడుతున్నామన్నాడు. మరో విజయం సాధించాలని బరిలోకి దిగుతున్నట్లు రోహిత్ తెలిపాడు.
పటిష్ట ఆస్ట్రేలియాపై గెలిచి ప్రపంచకప్ టోర్నీలో ఆరంభం చేసిన భారత్.. రెండో విజయంపై కన్నేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన అఫ్గాన్.. విజయంతో టోర్నీలో ఖాతా తెరవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరేట్ అయినా.. అఫ్గాన్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. భారత్, అఫ్గానిస్థాన్ జట్లు ఇప్పటివరకు మూడు వన్డేలు ఆడాయి. ఇందులో రెండు భారత్ గెలవగా.. ఒక మ్యాచ్ డ్రాగా అయింది. ఇక ప్రపంచకప్‌లలో ఇరు జట్లు ఓ మ్యాచ్ ఆడగా.. అందులో భారత్ గెలిచింది. అరుణ్ జైట్లీ స్టేడియం బౌండరీ లైన్స్ చిన్నవి కాబట్టి బ్యాటర్లు పండగ చేసుకునే అవకాశం ఉంది. అయితే స్పిన్నర్లకు కూడా ఈ పిచ్ సహకారం అందించనుంది.
Also Read: Pathankot Attack 2016: పఠాన్‌కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ హతం!
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ఆర్ జడేజా, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్.
అఫ్గానిస్థాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫరూఖీ.