మెక్సికోలో విషాదం చోటు చేసుకుంది. మెక్సికో నగరానికి సమీపంలోని ప్రఖ్యాత టియోటిహుకాన్ పురవస్తు ఏరియాలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. టియోటిహుకాన్ ప్రాంతానికి వచ్చే సందర్శకులు ఎక్కువ మంది అక్కడ హాట్ ఎయిర్ బెలూన్స్ లో విహరిస్తుంటారు. ఈ క్రమంలో పలువురు సందర్శకులు శనివారం హాట్ ఎయిర్ బెలూన్స్ లో ఎక్కి విహంగ వీక్షణ చేస్తున్నారు. కొంతదూరం పైకి వెళ్లిన తరువాత బెలూన్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భయంతో అందులోని ప్రయాణికులు కిందకు దూకగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
https://twitter.com/Lerpc75/status/1642228555026186243
Also Read : malladi vishnu: మంత్రివర్గ విస్తరణ నిర్ణయం ఆయనకు మాత్రమే తెలుసు…
ఈ ఘటనకు సంబంధించి మెక్సికో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు బెలూన్ నుంచి దూకడంతో ఇద్దరు మరణించారని ఆ ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. మరణించిన వారిలో 39 ఏళ్ల మహిళ, 50 ఏళ్ల వృద్దులుగా గుర్తించారు. గాయపడిన వారిలో ఓ మైనర్ బాలుడి ముఖానికి కాలిన గాయం కాగా.. కిందకు దూకడంతో కుడి తొడకు ఎముక ఫ్రాక్చర్ అయిందని తెలిపారు. అయితే బెలూన్ లో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు అనే విషయాలు వెల్లడించలేదు.
Also Read : COVID 19 : ఢిల్లీలో కరోనా టెన్షన్.. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
మెక్సికోలోని టియోటిహుకాన్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది కొలంబియన్ పూర్వకాలం నాటి స్మాకరక చిహ్నం. అనేక మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. టూర్ ఆపరేటర్లు మెక్సికో నగరానికి ఈశాన్యంగా 45 మైళ్ల దూరంలో ఉన్న టియోటిహుకాన్ మీదుగా దాదాపు 150 డాలర్లకు హాట్ ఎయిర్ బెలూన్ ను అందిస్తారు. ఇందులో ప్రయాణికులు గాలిలో ప్రయాణిస్తుంటారు. అయితే శనివారం హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణిలకు గాలిలో ప్రయాణిస్తున్న క్రమంలో మంటలు వ్యాప్తి చెందడంతో బెలూన్ నుంచి ప్రయాణికులు దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.