Sravanthi Ravikishore Clarity on Ram’s wedding reports: ఈ మధ్యకాలంలో వరుసగా హీరోలు పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో యంగ్ అండ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని కూడా వివాహం చేసుకోబోతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతానికి రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇంకా పేరు ఫిక్స్ చేయని ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ ఏడాదిలో రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే ప్రచారం…
(జూలై 11న రవికిశోర్ పుట్టినరోజు) బ్యానర్ పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. మూడున్నర దశాబ్దాలుగా చిత్రాలను నిర్మిస్తున్నారు రవికిశోర్. తన మనసుకు నచ్చిన కథను సినిమాగా తెరకెక్కించడంలోనూ, మెచ్చిన పరభాషా చిత్రాన్ని తెలుగులోకి అనువదించడంలోనూ రవికిశోర్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. విలక్షణ దర్శకుడు వంశీతో రవికిశోర్ చిత్రప్రయాణం ఆరంభించారు. వంశీ దర్శకత్వంలో ‘లేడీస్ టైలర్’ నిర్మించి, ఆ సినిమాతోనే తన అభిరుచి ఏమిటో చాటుకున్నారు.…
ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావుగారు అనారోగ్య సమస్యలతో మంగళవారం (ఈ రోజు) ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. తాతయ్య మరణంతో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం ఈస్థాయికి రావడం వెనుక తాతయ్య కృషి, శ్రమను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘స్రవంతి’ రవికిశోర్ సోదరుడు మురళి కుమారుడు రామ్ అనే సంగతి తెలిసిందే.రామ్ మాట్లాడుతూ…