Site icon NTV Telugu

Top Headlines@9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*పులివెందులలో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి అరెస్ట్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. భాస్కర్‌రెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో సీబీఐ అధికారుల వాహనాలను అవినాష్‌ అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు. భాస్కర్‌రెడ్డిపై సెక్షన్ 130బి,రెడ్ విత్ 302, 201 కింద కేసు నమోదు చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డి భార్య వైఎస్ లక్ష్మికి అరెస్టు సమాచారం ఇచ్చి సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు. భాస్కర్ రెడ్డిని హైదరాబాద్‌లో సీబీఐ స్పెషల్‌ కోర్టులో హాజరుపరచనున్నారు. భాస్కర్‌రెడ్డి ఫోన్‌ను సీబీఐ అధికారులు సీజ్‌ చేశారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌ను అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం అవినాశ్‌ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని సీబీఐ కడపలో అరెస్టు చేసింది. వివేకా హత్యకు ముందు భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉదయ్‌ ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా సీబీఐ గుర్తించింది. సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్‌ని అదుపులోకి తీసుకుxof. తాజాగా భాస్కర్‌ రెడ్డిని కూడా అరెస్టు చేయడంతో అవినాశ్‌ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. తొలుత హైదరాబాద్‌లోని అవినాష్‌రెడ్డి ఇంటికీ సీబీఐ అధికారులు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అయితే అక్కడికి ఎవరూ రాలేదని ఎంపీ సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.

 

*కుషాయిగూడలో అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్, శాస్త్రీపురం, నాచారంలో జరిగిన వరుస అగ్నిప్రమాద ఘటన మరువక ముందే ఇక తాజాగా మరోసారి కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున టింబర్‌ డిపోలో మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవదహనమయ్యారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికులు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగ కమ్మేయడంతో మంటలను ఆర్పేందుకు సిబ్బందికి ఇబ్బంది ఎదుర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల వివరాలను ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మల్లాపూర్ పారిశ్రామికవాడలో జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ శాఖ ప్రాథమిక నిర్దారించారు. కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే భారీ అగ్నిప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. మొత్తం 11 ఫైర్ ఇంజన్ లు అదనంగా 40 వాటర్ ట్యాంకర్ ద్వారా ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. దీంతో జేపీ పెయింటింగ్ కంనిలో మంటలు పూర్తిగా అదుపులో వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు. లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని తెలిపారు.

 

*సీబీఐ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ కేసుకి సంబంధించి ప్రశ్నించేందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్ కు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా ఇవాళ సీబీఐ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సీబీఐ విచారణ ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు కేజ్రీవాల్ పై కుట్ర జరుగుతుందని ఆప్ నేతలు ఆరోపిస్తుంటే.. మరొవైపు ఢిల్లీ సీఎంకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలున్నట్లు సీబీఐ చెబుతుంది. తాను అవినీతిపరుడైతే ఈ ప్రపంచంలో నిజాయితీపరుడు ఎవరూ ఉండరని ఆయన కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర ఏజెన్సీలు తమపై కోర్టుకు అబద్దాలు చెబుతున్నాయని అరెస్ట్ చేసిన వ్యక్తులను చిత్రహింసలకు గురిచేస్తున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక కేసులో తెలంగాణకు పలువురు ప్రముఖులను ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పలుసార్లు విచారించింది. సీబీఐ సమన్లు అందుకున్న కేజ్రీవాల్ కూడా ఈ కేసులో నేరుగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పాడింది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి రాజకీయా వర్గాల్లో నెలకొంది. మొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఇలా విచారణకు హాజరుకావడంపై ఢిల్లీ అంతటా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

*అతీక్ అహ్మద్ హత్య.. మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా..
గ్యాంగ్‌స్టర్ టర్న్డ్ పొలిటీషియన్ అతీక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి మెడికల్ చెకప్ కోసం ఈ ఇద్దరిని తీసుకెళ్తుండగా.. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. ధూమంగంజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వాళ్లిద్దరు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దుండగులు 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సోదరులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు వెంటనే కాల్పులు జరిపిన హంతకుల్ని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే.. ఈ విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. నిందితులను లవ్లేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించారు.కాగా.. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసుతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉమేష్ పాల్ హత్యకేసులోనూ అతీక్ అహ్మద్ నిందితుడిగా ఉన్నాడు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్‌తో పాటు మరో నిందితుడైన అతని స్నేహితుడు గులామ్‌ను ఏప్రిల్ 13వ తేదీన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఝాన్సీ సమీపంలో ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే! అతీక్ అహ్మద్‌కి మొత్తం ఐదుగురు కొడుకులు ఉండగా.. అసద్ వారిలో మూడోవాడు. కాగా.. పక్కా ప్లాన్‌తోనే అతీక్, ఆయన సోదరుడు అష్రఫ్‌లపై కాల్పులు జరిపి హతమార్చారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

*అతీక్ అహ్మద్ హత్యపై ఘాటుగా స్పందించిన అసదుద్దీన్
ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. అతిక్, అతని సోదరుడి దారుణ హత్య యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తుల చేతులకు సంకెళ్లు కూడా ఉన్నాయి. అలాంటి వారిని గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపడం దారుణమైన ఘటన అని అన్నారు. జైశ్రీరామ్ నినాదాలు చేసిన దుండగులు, నిందితులను పోలీసులు అడ్డుకోకపోవడాన్ని అసదుద్దీన్ తప్పుబట్టారు. యోగి పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. ఎన్ కౌంటర్లు జరిగితే సంబరాలు చేసుకుంటున్న ఎన్ కౌంటర్ రాజ్యం కూడా హత్యతో సమానం అంటూ ట్వీట్ చేశారు. ఇదేనా న్యాయవ్యవస్థ, న్యాయం జరిగే తీరు అరి యూపీ సీఎం యోగి ప్రభుత్వాన్ని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఈ ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ఒవైసీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏ అధికారి కూడా దర్యాప్తులో పాల్గొనవద్దని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రభుత్వాన్ని నడపడం లేదని.. తుపాకీ పాలనతో ప్రభుత్వం నడుస్తోందని ఒవైసీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

*అతను మా బంగారు కొండ అంటున్న పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతుంది. శనివారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆద్యంతం ఉత్కంగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 2 రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సికిందర్ రజా హాఫ్ సెంచరీతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆఖర్ లో సికిందర్ రజా ఔటవ్వడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ షారూఖ్ ఖాన్ తన సూపర్ స్మార్ట్ ఇన్సింగ్స్ తో పంజాబ్ ను విజయతీరాలకు చేర్చాడు. అయితే షారూఖ్ ఖాన్ చేసింది 23 పరుగులే కావొచ్చు.. కానీ ఒత్తిడిలో అతను పంజాబ్ నె గెలిపంచిన విధానం సూపర్ అని చెప్పొచ్చు.. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్సింగ్స్ సమయంలో షారూఖ్ ఖాన్ రెండు స్టన్నింగ్ క్యాచ్ లతో మెరిశాడు. బౌండరీ లైవ్ వద్ద కష్టసాధ్యంగా అనిపించిన క్యాచ్ లను బౌండరీ లైన్ తొక్కకముందే బంతిని గాల్లోకి ఎగరేసి బ్యాలెన్స్ చేసుకొని మళ్లీ బౌండరీ లైన్ ఇవతలకు వచ్చి స్మార్ట్ గా క్యాచ్ లు తీసుకున్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే దాదాపు రెండు క్యాచ్ లను ఒకేలా తీసుకున్న షారూఖ్ ఖాన్ స్మార్ట్ నెస్ ఉపయోగించాడు. అలా శనివారం జరిగిన మ్యాచ్ లో సికందర్ రజాతో పాటు షారూఖ్ ఖాన్ కూడా పంజాబ్ కింగ్స్ కు హీరో అయ్యాడు. షారూఖ్ ఖాన్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజంగా షారూఖ్ ఖాన్ పంజాబ్ కింగ్స్ కు దొరికిన ఒక వరం.. అతన్ని ఉపయోగించుకుంటే తెలివిగా మ్యాచ్ లను గెలవొచ్చు అంటూ కామెంట్స్ చేశారు.

 

*విలక్షణ పాత్రలతో ఢీ… జేడీ!

అసలు పేరు కనుమరుగై, కొసరుపేరే నిలచిపోయిన వారు ఎందరో చిత్రసీమలో ఉన్నారు. అంతెందుకు మన మెగాస్టార్ అసలు పేరు కొణిదెల శివశంకర ప్రసాద్. అలా పిలిస్తే చిరంజీవి అభిమానుల్లోనే కొందరు గుర్తుపట్టలేరు. అలాగే సినిమాలోని పాత్ర పేరునే ఇంటిపేరుగా చేసుకొని జనం ముందు నిలిచారు జేడీ చక్రవర్తి. ఆయన అసలు పేరు నాగులపాటి శ్రీనివాసచక్రవర్తి. ఆ పేరు చెబితే ఎవరూ గుర్తు పట్టలేరు. అదే జేడీ చక్రవర్తి అనగానే ఆయన తెరపై కనిపించిన తొలి చిత్రం ‘శివ’ను గుర్తు చేసుకుంటారు జనం. ఆ తరువాత అనేక చిత్రాలలో తనదైన బాణీ పలికిస్తూ సాగారు జేడీ చక్రవర్తి. అతనేమీ నటుల వారసుడు కాదు, నటించాలన్న అభిలాష బలంగా ఉండడంతో అదృష్టం కలసి వచ్చి ‘శివ’ సినిమాలో జేడీగా నటించి ఆకట్టుకున్నారు. జేడీ చక్రవర్తిగా జనానికి సుపరిచితుడైన శ్రీనివాస చక్రవర్తి 1970 ఏప్రిల్ 16న హైదరాబాద్ లో జన్మించారు. ఆయన తల్లి డాక్టర్ కోవెల శాంత. తండ్రి సూర్యనారాయణ రావు నాగులపాటి. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో చదివారు చక్రి. సిబిఐటీలో బి.ఇ, పూర్తి చేశారు. చదువుతున్న రోజుల్లోనే చక్రవర్తి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు.

Exit mobile version