Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ntv Top News At 9am 24 10 2023

Top Headlines@9AM: టాప్‌ న్యూస్‌

Published Date :October 24, 2023 , 9:00 am
By Chandra Shekhar Pamena
Top Headlines@9AM: టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడు మేడిగడ్డకు కేంద్ర జలసంఘం‌ సభ్యులు
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఈరోజు మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీని కేంద్రం జల సంఘం సభ్యులు సందర్శించనున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్‌జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల‌ బృందంతో కుంగిన బ్యారేజ్ ను పరిశీలించనున్నారు.

నాకు సీఎం కావాలని కోరిక ఉంది.. కచ్చితంగా సీఎం అవుతా
సంగారెడ్డిలో సోమవారం దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం కావాలని కోరిక ఉంది. మీరు ఇలాగే ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లకు నేను తెలంగాణకి సీఎం అయ్యి తీరుతానని జగ్గారెడ్డి అన్నారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నానన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా అని ఆయన ప్రశ్నించారు.

Also Read

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
  • OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?
  • Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
  • West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..

నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ లకు సెలవు..
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు కీలక ప్రకటన చేసింది. నేడు విజయదశమి సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాకాత్ లకు సెలవు ప్రకటించింది. ఈరోజు సెలవుకు సంబంధించి నోటీసులను జైలు అధికారులు జారీ చేశారు. ఈ విషయాన్ని గ్రహించి ఖైదీలు, రిమాండ్ ఖైదీల కుటుంబ సభ్యులు సహకరించాలని జైలు అధికారులు కోరారు.

“నిజం గెలవాలి” కార్యక్రమంతో ప్రజల్లోకి నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు. చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

దేవరగట్టు బన్నీ ఉత్సవంపై ఉత్కంఠ.. కర్రల సమరంపై పోలీసుల వ్యూహాం
కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లోని కొండపై కొలవైన ఉన్న శ్రీ మాల మల్లేశ్వర స్వామి క్షేత్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. దసరా తరువాత స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఆ సందర్భంగా ఉరేగింపు ఘట్టంలో కర్రల సమరం ఆనవాయితీగా వస్తుంది. గత కొన్ని ఏళ్లుగా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి గొడవల వల్ల కర్రల సమరంగా ఆ పేరు వచ్చింది. ఇది సమరం కాదు.. సంప్రదాయం అని అక్కడి భక్తులు అంటున్నారు. దేవరగట్టు బన్నీ ఉత్సవానికి కౌంట్‌ డౌన్ స్టార్ట్ అయింది. అర్ధరాత్రి నుంచి ఇక హైవోల్టేజీ ఉంటుంది.

Road Accident: తమిళనాడులో రోడ్ టెర్రర్.. లారీ-సుమో ఢీ, 7 మంది మృతి

పండగపూట తమిళనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై సమీపంలోని సెంగం పక్రిపాళయం సెంగం బైపాస్ వద్ద ప్రభుత్వ బస్సు, సుమో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై విషయం తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక్క కత్తితో ఎంత పెద్ద విషయాన్ని రివీల్ చేసావ్ కొరటాల…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ దేవర సినిమా చేస్తున్నాడు. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో స్టార్ట్ కానుంది. దేవర నుంచి ఇప్పటివరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో ఎన్టీఆర్ ది ఒక్క పోస్టర్ మాత్రమే ఉంది. ఇందులో ఎన్టీఆర్ బల్లెం పట్టుకోని, బ్లాక్ డ్రెస్ లో భయంపుట్టించే వీరుడిలా ఉన్నాడు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ ఎడమ చేత్తో ఆయుధాన్ని పట్టుకున్నాడు. లేటెస్ట్ గా దసరా ఆయుధపూజ అంటూ కొరటాల శివ మరో పోస్టర్ వదిలాడు. అందులో కేవలం కత్తిని మాత్రమే రివీల్ చేసాడు కొరటాల. ఈ కత్తిని కూడా ఎన్టీఆర్ ఎడమ చేత్తోనే పట్టుకున్నాడు. సో కొరటాల డిజైన్ చేసిన దాన్ని బట్టి ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్ క్యారెక్టర్ కి ఎడమ చేతి వాటం అనమాట. మరి యంగ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కి ఎలాంటి స్పెషలిటీని డిజన్ చేసారు అనేది చూడాలి.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • international news
  • latest news
  • national news
  • telangana

తాజావార్తలు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

  • OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions