NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

ఆరు రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లోని ఆరు రాష్ట్రాల్లోని 100కి పైగా సోదాలు నిర్వహించింది. వివిధ ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్‌స్టర్‌లకు, డ్రగ్స్ స్మగ్లింగ్ మాఫియాకు ఉన్న సంబంధాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ దాడులు చేపట్టింది. రాష్ట్ర పోలీసు బలగాలతో సన్నిహిత సమన్వయంతో ఉగ్రవాద నిరోధక సంస్థ బుధవారం తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాలు, అనుమానితులతో సంబంధం ఉన్న ఇతర ప్రదేశాలలో ఈ దాడులు నిర్వహించింది. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. గత ఏడాది ఎన్‌ఐఏ దాఖలు చేసిన మూడు వేర్వేరు కేసులకు సంబంధించి ఈ దాడులు నిర్వహించబడుతున్నాయి. 2022 మేలో మొహాలిలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై ఆర్‌పీజీ దాడిలో ప్రధాన షూటర్ దీపక్ రంగా అనే వ్యక్తిని ఈ ఏడాది జనవరి 25న ఏజెన్సీ ఓ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో అరెస్టు చేసింది. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ సంధు అలియాస్ లాండాకు, పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్-టెర్రరిస్ట్ హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండాకు సన్నిహితుడు. మేలో ఆర్పీజీ దాడిలో ప్రమేయంతో పాటు, దీపక్ హింసాత్మక హత్యలతో సహా అనేక ఇతర హింసాత్మక ఉగ్రవాద, క్రిమినల్ నేరాలలో పాల్గొన్నాడు. అతను రిండా, లాండా నుంచి తీవ్రవాద నిధులు, లాజిస్టికల్ మద్దతును చురుకుగా పొందుతున్నాడు.

కొత్త పార్లమెంట్ బిల్డింగ్ రెడీ.. జాతికి అంకితం ఎప్పుడంటే?

ప్రస్తుత పార్లమెంట్ భవనం పాతది కావడంతో మోడీ నూతన భవనాన్ని నిర్మించ తలపెట్టారు. కొత్త భవనం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ నెలాఖరులోగా పార్లమెంటు భవనాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధాని మోదీ మే 26న కొత్త భవనం ప్రారంభిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం భవనం తుది మెరుగుల దిద్దుకుంటోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ భవన ప్రారంభించాలని ఆ పార్టీ భావిస్తోంది. 2014, మే 26న ప్రధాని నరేంద్ర మోదీ మొదటి సారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మీడియా నివేదికల ప్రకారం.. జూలైలో ప్రారంభమయ్యే రాబోయే వర్షాకాల సమావేశాలు కొత్త భవనంలో జరిగే అవకాశం లేదు. 2023 జి20కి భారత్‌ అధ్యక్షత వహిస్తోంది. జీ20 దేశాల పార్లమెంట్ స్పీకర్ల సమావేశం ఈ ఏడాది చివర్లో కొత్త భవనంలో జరగవచ్చని ఊహాగానాలు ఉన్నాయి.

బైడెన్ పర్యటన వాయిదా… క్వాడ్‌ సమ్మిట్‌ రద్దు చేసిన ఆస్ట్రేలియా

దేశీయ సమస్యల కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన పర్యటనను వాయిదా వేసుకోవడంతో వచ్చే వారం సిడ్నీలో జరగాల్సిన క్వాడ్‌ సమ్మిట్‌ను ఆస్ట్రేలియా బుధవారం రద్దు చేసింది. రుణ గరిష్ఠ పరిమితిపై యూఎస్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న చర్చల మధ్య బైడెన్ ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా పర్యటనలను రద్దు చేసుకున్నారు. అయితే ఈ వారాంతంలో జరిగే జీ7 సదస్సుకు ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. జపాన్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో భారత్, జపాన్, యూఎస్ నాయకులను కలుస్తానని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ చెప్పినట్లు సమాచారం. “వచ్చే వారం సిడ్నీలో క్వాడ్ నాయకుల సమావేశం జరగదు. అయితే జపాన్‌లోనే క్వాడ్ నాయకులతో చర్చిస్తాము” అని ఆస్ట్రేలియా ప్రధాని విలేకరులతో అన్నారు.2017లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావానికి ప్రతిస్పందనగా యూఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాలు క్వాడ్ లేదా చతుర్భుజ కూటమిని ఏర్పాటు చేశాయి. కెనడా, యూకే, యూఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్.. ఏడు దేశాలు సభ్యులుగా గల జీ7 గ్రూప్‌లో భారతదేశం, ఆస్ట్రేలియా సభ్యులు కాదు. అయితే మే 19 నుంచి మే 21 వరకు జపాన్‌లోని హిరోషిమాలో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు. “G7కి హాజరు కావాల్సిందిగా నన్ను ఆహ్వానించినందుకు (జపనీస్) ప్రధాన మంత్రి (Fumio) కిషిడాకు ధన్యవాదాలు.

ఇదేం డీజే డ్యాన్స్ జేసీ.. హవ్వ అంటున్న పెద్దారెడ్డి

అనంతపురం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా సాగుతుంటాయి. అందులోనూ తాడిపత్రిలో అయితే నువ్వా నేనా అనే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్ది వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతూ ఉంటుంది. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన డీజే డ్యాన్స్ హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి తనదైన రీతిలో స్పందించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ …73 సంవత్సరాల వయసులో జేసీ ప్రభాకర్ రెడ్డికి డిజె డాన్స్ అవసరమా …! అని ఎద్దేవా చేశారు. కొడుకు బర్త్ డే కి కార్యకర్తలతో కలిసి డాన్స్ చేస్తున్నాడు.. తాడిపత్రి ప్రాంతంలో నేనే రౌడీ అంటూ 30 సంవత్సరాలు చక్రం తిప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి పరిస్థితి డిజె డాన్స్ వేసుకునే స్థితికి వచ్చింది.తిట్టే సంస్కృతి మారాలని దేవుని ప్రార్థిస్తున్నా. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యం. జేసీ ప్రభాకర్ రెడ్డి రేపటి నుంచి మీ ఇంట్లో బర్త్ డే ఫంక్షన్లు ఉంటే నన్ను పిలవండి… నేను డీజే డ్యాన్స్ చేస్తా అంటూ పిలిచినట్టు ఉందన్నారు పెద్దారెడ్డి. కార్యకర్తల్ని, మహిళా కార్యకర్తలతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన డ్యాన్స్ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హిందూ మహాసముద్రంలో మత్స్యకార నౌక బోల్తా.. 39 మంది గల్లంతు

హిందూ మహాసముద్రం మధ్య భాగంలో చైనా మత్స్యకార నౌక మంగళవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న మొత్తం 39 మంది గల్లంతైనట్లు తెలిసింది. సిబ్బందిలో 17 మంది చైనా జాతీయులు, 17 మంది ఇండోనేషియా, ఐదుగురు ఫిలిప్పీన్స్ నుంచి ఉన్నారు. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికవవరకు ఒక్కరి జాడ లభించనట్లు సమాచారం.మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు (బీజింగ్ కాలమానం ప్రకారం) మధ్య హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన ఫిషింగ్ నౌక బోల్తా పడింది. నౌక బోల్తా పడటంతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పూర్తి సహాయ చర్యలకు ఆదేశించారు. పరిస్థితిని ధృవీకరించడానికి, అదనపు రెస్క్యూ దళాలను మోహరించడానికి అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాన్ని వెంటనే మోహరించాలని చైనా వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, చైనా రవాణా మంత్రిత్వ శాఖ షాన్‌డాంగ్ ప్రావిన్స్‌ను ఆదేశించింది. అంతర్జాతీయ సముద్ర శోధన, రెస్క్యూ సహాయాన్ని సమన్వయం చేయాలని కూడా జిన్‌పింగ్‌ ఆదేశించారు. ప్రజల భద్రతను నిర్ధారించడానికి సుదూర ప్రాంత కార్యకలాపాలకు భద్రతా ప్రమాదం గురించి ముందస్తు హెచ్చరికలను బలోపేతం చేయాలని కూడా ఆయన ఆదేశించారు.

మందు బాబులు అలర్ట్.. లిక్కర్‌ అలర్జీ ముప్పు..

సంతోషం వచ్చినా.. బాధ కలిగినా.. ప్రమోషన్‌ వచ్చినా.. డిమోషన్‌ వచ్చినా.. బంధువులు వచ్చినా.. ఫ్రెండ్స్‌ కలిసినా.. ఇలా ఏది జరిగినా.. వచ్చేది ఒక్కటే మాట.. అదే మందు వేద్దామా? అని అంతలా చాలా మంది లిక్కర్‌లో మునిగితేలుతున్నారు.. అయితే, మందు బాబులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఇప్పటి వరకు లిక్కర్‌తో లివర్‌ చెడిపోతుందని మాత్రమే అనుకొనేవాళ్లు.. కానీ, ఇప్పుడో షాకింగ్ వ్యవహారం వెలుగు చూసింది.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన అరుదైన కేసు.. మందు బాబులు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేస్తోంది.. ఇది ఎందరిలో ఉంది.. ఎలా వస్తుంది.. ఎలాంటి రియాక్షన్‌ ఉంటుంది? ఎలా గుర్తించాలి? లాంటే అనేక సందేహాలను తెరపైకి తెచ్చింది..మందు తాగేవారిలో ఎర్రటి దద్దుర్లతో ‘లిక్కర్‌ అలర్జీ’ అనే అరుదైన వ్యాధి సోకుతుందని చాలా మందికి ఇప్పటి వరకు తెలిసి ఉండదు.. కానీ, దాని గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చేంది.. ఎందుకంటే మనదేశంలో లిక్కర్‌ అలర్జీని ఇటీవల తొలిసారి హైదరాబాద్‌లోనే గుర్తించారు. ఆగ్రా నుంచి వచ్చిన జాన్‌ అనే 36 ఏళ్ల యువకుడికి ఈ వ్యాధిని గుర్తించారు.. జాన్‌కు ఈ వ్యాధి సోకినట్టు హైదరాబాద్‌లోని అశ్విని అలర్జీ సెంటర్‌ వైద్యులు తేల్చారు.. ఇది చాలా అరుదైన వ్యాధి అని, మద్యం సేవించడం వల్ల కొంతమంది శరీరంలో అలర్జీకి సంబంధించిన మార్పులు కనిపిస్తాయంటున్నారు డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్‌.. అయితే, చాలా అరుదైన కేసు.. ప్రపంచంలోనే ఈ తరహా కేసులు వందకు మించి ఉండవని పేర్కొన్నారు.. జాన్‌ కొంతకాలం క్రితం ఓ విందులో పాల్గొన్నాడు.. అక్కడే మద్యం సేవించగానే, అతని ముఖం వేడిగా మారడంతోపాటు ఎర్రబడింది. చర్మంపై దురదలు రావడం, ఛాతీ పట్టేసినట్టుగా ఉండటంతో ఆస్పత్రిలో చేరాడు.. చికిత్స తర్వాత అతని ఆరోగ్యం మెరుగుపడింది.. కానీ, రెండు నెలల తర్వాత మరోసారి మద్యం సేవించడంతో మళ్లీ అదే పరిస్థితి వచ్చింది..

త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లిం యువకులు అరెస్ట్

ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ ఆలయంలోకి బలవంతంగా చొరబడ్డారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని నాసిక్‌లో నలుగురు ముస్లిం పురుషులను పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేసింది. ఆలయ ట్రస్ట్ ఫిర్యాదు మేరకు నిందితులు అకిల్ యూసుఫ్ సయ్యద్, సల్మాన్ అకిల్ సయ్యద్, మతిన్ రాజు సయ్యద్, సలీం బక్షు సయ్యద్‌లను మంగళవారం అరెస్టు చేశారు. మే 13న నలుగురు వ్యక్తులు ఊరేగింపులో భాగంగా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి, శివలింగానికి చాదర్ సమర్పించేందుకు ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది. గొప్ప ముస్లిం సాధువుల ఉర్స్ (వర్థంతి)లో భాగంగా వారి గౌరవార్థం చెప్పుల ఊరేగింపు జరుగుతుంది. శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన త్రయంబకేశ్వర్ ఆలయంలో హిందువులకు మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంది.గుంపును పవిత్ర స్థలంలోకి ప్రవేశించకుండా సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి భద్రత పెంపు!

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి భద్రతను పెంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ‘వై’ కేటగిరీ భద్రతను పొందేందుకు అర్హులైన భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించనున్నారు. భద్రతను బెంగాల్ ప్రభుత్వం ‘వై’ నుంచి ‘జెడ్’ కేటగిరీకి పెంచింది. పరిపాలనా స్థాయిలో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. గంగూలీకి భద్రత పెంచడం ద్వారా గంగూలీ ఇప్పుడు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించారు. ఇక నుంచి గంగూలీకి వీఐపీ కేటగిరీ భద్రత కల్పించనున్నారు. ఓ సమావేశం తర్వాత సౌరవ్ గంగూలీకి జెడ్ భద్రత ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. నివేదికల ప్రకారం.. సౌరవ్ గంగూలీకి భద్రతను పెంచాలని బెంగాల్ ప్రభుత్వం పోలీసు అధికారులను ఆదేశించింది. బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు 24 గంటల పాటు గంగూలీ ఇంటి వద్ద ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు భద్రతను మోహరించారు. కోల్‌కతాలోని బెహలా ప్రాంతంలో ఉన్న సౌరవ్ ఇంటిని తనిఖీ చేసేందుకు ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లోని స్పెషల్ బ్రాంచ్ అధికారులు వచ్చారు. ఇక నుంచి సౌరవ్ ఇంటి వద్ద ఇద్దరు ప్రత్యేక భద్రతా అధికారులు ఎల్లప్పుడూ ఉంటారు. ఆయన ఇంటి వద్ద భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా పెంచనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులందరికీ అలాంటి భద్రత ఉంటుంది.

బ్లాక్ డ్రెస్ లో అదరహో అనిపించిన అలియా భట్

దక్షిణ కొరియాలోని సియోల్‌లో జియోంగ్‌బాక్‌గుంగ్ ప్యాలెస్‌లో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్‌లో అలియా భట్ తన స్టైలిష్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆమె ఇటీవల ఒక లగ్జరీ బ్రాండ్ యొక్క మొదటి భారతీయ గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రకటించబడింది. కటౌట్ తో అద్భుతమైన బ్లాక్ మినీ డ్రెస్‌లో అలియా ఎప్పటిలాగే కనిపించింది. ఆమె ప్లాట్‌ఫారమ్ హీల్స్ మరియు పారదర్శక పర్స్ ఆమె అందంగా ఈ షోలో హాట్ లుక్స్ తో కనిపించింది. అలియా గూచీ షోలో పాల్గొనింది. సారా అలీ ఖాన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఈ సాయంత్రం ఫ్రెంచ్ రివేరాకి ప్రియాంక చోప్రా వెళ్లారు.అయితే ప్రస్తుతం అలియా భట్ ఫోటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అలియా షేర్ చేసిన వెంటనే లైక్‌లు మరియు కామెంట్‌లు రావడం ప్రారంభించాయి. ఒక అభిమాని, బ్యాగ్ ఖాళీగా ఉంది కాబట్టి అలియా ఎందుకు తీసుకువెళుతోంది అని రాస్తే, మరొకరు బ్రా పర్సు అంటే కనీసం కొన్ని వస్తువులను పట్టుకోవడమే!..ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించాడు..చిన్న బ్యాగ్‌కు ఎంత ప్రాముఖ్యత లభిస్తుందో చూడండి! ప్రజలు నిజంగా 5.5 పొడవాటి వ్యక్తి నిలబడి తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని అంత ప్రపంచ స్థాయిలో చూడలేరు. భారతదేశం ఎప్పుడూ ఒక దేశంగా ఎదగకపోవడానికి ఒక కారణం ఉంది అంటై మరో వ్యక్తి కామెంట్ చేశాడు.