అధికారులు ఆలోచించి పనిచేయాలి
అమరావతి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో కొత్త ఎమ్మెల్సీలకు అభినందన సభ జరిగింది. అభినందన సభకు హాజరయ్యారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ముగ్గురిది.. ఒక్కో కష్టం. డబ్బు లేనిదే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదన్న పరిస్థితికి చంద్రబాబు, కొత్త ఎమ్మెల్సీలు చరమ గీతం పాడారన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. బాబాయిని గొడ్డలిపోటుతో చంపేశాక ప్రజలు భయపడుతున్నారు.ఓటు అడగడానికి రావొద్దు.. మీకే ఓటేస్తామని వేపాడ చెప్పిన విషయం నిజం. ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తంగా ఉంది.వేపాడకు ఎకనమిస్టుగా మంచి పేరు ఉంది.మంచి పేరు ఉంది కాబట్టే వేపాడ ఎమ్మెల్సీగా గెలిచారు.వేపాడ విశ్వసనీయతే గెలిపించింది.వేపాడ పేరు ప్రకటించి వెంటనే పార్టీ గెలిచిందనే ఫీలింగ్ వచ్చేసింది.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు శ్రీకాంత్ అండగా నిలిచారు.వేపాడ, శ్రీకాంత్, రాంగోపాల్ రెడ్డి భార్యలు వారి గెలుపు కోసం కష్టపడ్డారు.శ్రీకాంత్ టెక్నాలజీని కూడా బాగా వినియోగించుకున్నారు.. ఎమ్మెల్సీగా గెలిచారు.రాంగోపాల్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చే ముందు నేనూ ఆలోచించాను.పులివెందుల బిడ్డ రాంగోపాల్ రెడ్డి పులివెందుల పులి.. జగన్ పులివెందుల పిల్లి.పులివెందుల్లో వైసీపీ రౌడీయిజాన్ని రాంగోపాల్ రెడ్డి అడ్డుకున్నారు.జగన్ పిరికివాడు.తన కోసం చాలా మందిని తన క్రైమ్ లో పార్టనర్లను చేస్తారు. టీడీపీ గెలిచిన తర్వాత సీఎం జగన్ ఆదేశాల మేరకు రీ కౌంటింగ్ కోసం డిమాండ్ చేశారు.ఎన్నికల ఫలితాలు ప్రకటించాకే రీ-కౌంటింగ్ డిమాండ్ చేశారు.. డిక్లరేషన్ ఫారం ఇవ్వలేదు.రాత్రంతా మానిటర్ చేస్తూ డిక్లరేషన్ ఫారం కోసం ఒత్తిడి చేశాం.మన ఎఫర్ట్సుతోనే వాళ్లకి ఇష్టం లేకున్నా డిక్లరేషన్ ఫారం ఇచ్చారు.గెలిచిన ఎమ్మెల్సీని ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు.ఆర్వోను రెచ్చగొట్టిన సీఎంను ఏమనాలి..?రేపు ఏదైనా తేడా జరిగితే.. బాధితులయ్యేది ఆర్వో, కలెక్టర్లే.. ఇదే పార్టనర్స్ ఇన్ క్రైమ్ థియరీ.టీడీపీ హిట్ లిస్టులో అధికారులని చేర్చి.. వాళ్లని టీడీపీని ఎగదొస్తున్నారు.
రైతుల వెన్నంటే ఉండాలి.. వారికి భరోసా కల్పించాలి
అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు వెన్నంటే ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలని వారితో అన్నారు. ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రైతులకు వారికి భరోసా ఇచ్చి వారిలో విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలన్నారు. దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతం అంశం పైన దృష్టి సారించి.. వర్షాకాలం లోపల పనులు పూర్తయ్యేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులు, ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. ఉపాధి హామీ, పట్టణ, పల్లె ప్రగతి వంటి అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపు పై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి హామీకి సంబంధించిన రూ.1300 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో బిల్లుల చెల్లింపు ఆలస్యమైందన్నారు. వచ్చేనెల 29 నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలని.. ఇందుకు సంబంధించి, ఇప్పటికే జిల్లా ఇన్ చార్జులుగా వెళ్లిన వారి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయన్నారు.
చంద్రబాబుని సీఎంని చేయడం కోసం పనిచేస్తా
తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విద్యావేత్త డా.కంచర్ల శ్రీకాంత్ ఉద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను ఆయన వివరించారు. ఇంతకంటే ఇంకేం కావాలి.365 రోజులు పార్టీ కోసం.. చంద్రబాబుని సీఎం చేయడం కోసం పని చేస్తా.ఈ ఎన్నికలను ఓ కేస్ స్టడీగా తీసుకోవాలి.నిఖార్సైన కార్యకర్తకు గౌరవం దక్కుతుందని చెప్పడానికి నేనే నిదర్శనం.2013లో గెలుపునకు అవకాశం లేని కందుకూరు రూరల్ జడ్పీటీసీ నుంచి పోటీ చేసి గెలిచాను.. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది.ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలుపు కష్టమని చాలా మంది నిరుత్సాహ పరిచారు.కానీ బంపర్ మెజార్టీ సాధించాను.. ఇప్పుడూ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం.నా గెలుపును లోకేషుకు అంకితం ఇస్తున్నానురెండో ప్రాధాన్యత ఓట్లను పీడీఎఫ్ తో షేరింగ్ చేసుకునే విషయంలో వేరే అభిప్రాయంతో ఉన్నాం.కానీ చంద్రబాబు కాలిక్యులేషన్ పవి చేసింది. ముగ్గురం ఎమ్మెల్సీలుగా గెలిచాం. పార్టీ పటిష్టత కోసం అంతా కలిసి పనిచేస్తాం అన్నారు. తనకు సహకరించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
డయాబెటిస్ రోగులు తినకూడని ఫుడ్ ఏంటో తెలుసా?
గత దశాబ్ద కాలంగా దేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశంలోని అన్ని నగరాలు డయాబెటిస్ రోగులతో నిండిపోతున్నాయి. పెరుగుతున్న వయస్సు, కుటుంబ చరిత్ర మధుమేహం వ్యాధి వ్యాప్తిని పెంచుతుంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు కూడా ఈ వ్యాధి పెరుగుదలకు దారితీస్తాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ దైనందిన జీవితంలో ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే, రక్తంలో చక్కెర శాతం అకస్మాత్తుగా పెరుగుతుంది. డయాబెటిస్ రోగులు ఈ ఆహారం తినకుండా ఉంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.డయాబెటిస్ రోగులు ప్రతిరోజు క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. ఎక్కువసేపు కడుపుని ఖాళీగా ఉంచకూడదు. అందుకే మధుమేహంతో బాధపడేవారికి అల్పాహారం చాలా ముఖ్యం. ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన అనేక అధ్యయనాలు అల్పాహారం మానేసిన వ్యక్తులు ఈ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. రాత్రి పడుకోవడానికి మరియు ఉదయం భోజనం తర్వాత నిద్ర లేవడానికి మధ్య ఎనిమిది నుండి పది గంటల గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. కాబట్టి డయాబెటిస్ రోగులు బ్రేక్ ఫాస్ట్ ఎంత త్వరగా తింటే అంత మంచిది.
గెలిచాక కూడా చాలా ఇబ్బంది పెట్టారు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాక కూడా వైసీపీ నేతలు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారని అన్నారు పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి. ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారు అయింది.అడిగిన వెంటనే లోకేష్ ఓకే చెప్పారు.. భుజం తట్టారు.అభ్యర్థిత్వాలని అధికారికంగా ఖరారు చేశాక.. లోకేష్ నిరంతరం రివ్యూ చేశారు.ఓటరు నమోదు విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి గెలిచాను.కర్నూల్లో హైకోర్టును వ్యతిరేకిస్తున్న టీడీపీకి ఓటేయొద్దన్నారు.. దాన్ని ఎదుర్కొన్నాం.. ప్రతి ఒక్కరికీ వివరించాం.జగన్ అరాచకాలపై అనుభవం ఉండడంతో పకడ్బందీగా వ్యవహరించాం.ముఖ్య నేతలను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లుగా పెట్టాం.తలలు తెగిపడ్డా వెనక్కు తగ్గొద్దు.. భయపడొద్దని కౌంటింగ్ సందర్భంగా టీడీపీ ఏజెంట్లకు చెప్పాను.అవసరమైతే ప్రతిదాడులకూ సిద్దపడ్డాం.టీడీపీ ఏజెంట్ల మీద దాడి చేస్తే.. టీడీపీ వాళ్లనే కొట్టుకుంటూ పోలీసులు అరెస్టు చేశారు.వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి వచ్చి అభినందనలు తెలిపారు.. ఆ తర్వాత అరగంటకే వచ్చి ఆందోళన చేశారు.డిక్లరేషన్ ఫారం ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెట్టారన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల సహకారంతో విజయం సాధించామన్నారు. ఎన్నికల్లో అడుగడుగునా ఎన్నో ఆటంకాలు ఎదురైనా చివరాఖరుకు ధర్మం గెలిచిందన్నారు.జగన్ స్వంత జిల్లాతో పాటు పశ్చిమరాయలసీమలో టీడీపీకి ఓటర్లు బ్రహ్మరథం పట్టడం రాబోయే మార్పులకు నిదర్శనం అన్నారు రామగోపాల్ రెడ్డి.
దీప్తిని వదిలేసి కొత్త లవర్ తో ముద్దులు
బిగ్ బాస్ పుణ్యమా అంట యూట్యూబర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఈ జంట ప్రేమికులుగా ఉన్నా బిగ్ బాస్ వలనే వీరు బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి కెరీర్ను బిల్డ్ చేసుకొనే పనిలో వారు ఉన్నారు. దీప్తి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ.. అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాల్లో కనిపిస్తుండగా.. షన్ను.. వెబ్ సిరీస్ లను, మ్యూజిక్ ఆల్బమ్స్ ను చేస్తూ బిజీగా మారాడు. ఇక ఈ జంట విడిపోయిన్నప్పుడు వీరికన్నా ఎక్కువ వీరిని అభిమానించే అభిమానులే ఎక్కువగా బాధపడ్డారు. అయితే తాజాగా షన్ను.. దీప్తి ప్లేస్ ను రీప్లేస్ ను చేసే పనిలో ఉన్నాడని టాక్ నడుస్తోంది. ఈ జంట చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇక తాజాగా షన్ను తన కొత్త మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. అయ్యోయ్యో అనే పేరుతో రిలీజ్ అయిన ఈ వీడియో సాంగ్ ప్రస్తుతం విమర్శలను అందుకుంటుంది. ఈ వీడియో సాంగ్ లో షన్ను మితిమీరి రొమాన్స్ చేయడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
కేరళలో ఫస్ట్ ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..
కేరళలో మొదటి జెండర్ న్యాయవాదిగా పద్మాలక్ష్మీ చరిత్ర సృష్టించారు. కేరళ రాష్ట్ర బార్ కౌన్సిల్ లో లాయర్ గా తమ పేరును నమోదు చేయించుకున్నారు. దీనిపై కేరళ మంత్రి పీ రాజీవ్ స్పందించారు. అనేక మంది ట్రాన్స్ జంటర్లకు పద్మాలక్ష్మీ ప్రేరణగా నిలుస్తారని ఆయన అన్నారు. మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ లో పద్మాలక్ష్మీని అభినందిస్తూ పోస్ట్ చేశారు. బార్ ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికేట్ కోసం బార్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న 1500 మందిలో పద్మాలక్ష్మీ కూడా ఒకరని ఆయన అన్నారు. పద్మా లక్ష్మి ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో పట్టభద్రురాలయ్యారు. లాయర్ కావడానికి పద్మాలక్ష్మీ ప్రయత్నాలను మంత్రి ప్రశంసించారు. జీవితంలో ఎదురైన అన్ని అడ్డంకులను అధిగమించి కేరళలో మొదటి ట్రాన్స్‌జెండర్ న్యాయవాదిగా నమోదు చేసుకున్న పద్మాలక్ష్మికి అభినందనలు తెలియజేశారు. ఎన్నొ అడ్డంకులు అధిగమించి పద్మా లక్ష్మి న్యాయ చరిత్రలో తన పేరును లిఖించుకుంది అని మంత్రి రాజీవ్ సోషల్ మీడియాలో ప్రశంసించారు. అడ్వకేట్ కమ్యూనిటీకి అభినందనలు, స్వాగతం అంటూ పోస్ట్ లో వ్యాఖ్యానించారు.
మార్కెట్ కి ఉక్రెయిన్ ఊరట
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించింది. మొదటి రోజైన ఇవాళ సోమవారం ఆద్యంతం నెగెటివ్ జోన్‌లోనే ట్రేడింగ్ జరిగింది. ఉదయం రెండు కీలక సూచీలు నష్టాలతో మొదలై సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. ఎంపిక చేసిన బ్యాంక్ స్టాక్స్‌తోపాటు ఎఫ్‌ఎంసీజీ రంగంలో చివరి నిమిషంలో జరిగిన కొనుగోళ్లు ఇంట్రాడేలో వచ్చిన నష్టాలను కాస్త పూడ్చగలిగాయి.ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపేసే ప్రతిపాదన వార్తలు కూడా బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు మెరుగైన ఫలితాలను నమోదుచేయటానికి ఉపయోగపడ్డాయి. క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ అవి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ని పూర్తిస్థాయిలో పెంచలేకపోయాయి. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక శాతం చొప్పున డౌన్ అయ్యాయి. చివరికి.. సెన్సెక్స్.. 360 పాయింట్లు కోల్పోయి 57 వేల 628 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.నిఫ్టీ.. 111 పాయింట్లు తగ్గి 16 వేల 988 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 25 కంపెనీలు లాభాల బాటలో నడవగా 5 కంపెనీలు మాత్రమే లాభాలను ఆర్జించాయి. రాణించినవాటిలో హెచ్‌యూఎల్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా ఉండగా వెనకబడ్డ సంస్థల జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులతోపాటు ఏసియన్ పెయింట్స్, టైటాన్ తదితర కంపెలు ఉన్నాయి.నిఫ్టీలో హెచ్‌యూఎల్ మరియు బీపీసీఎల్ షేర్ల విలువలు 2 శాతానికి పైగా పెరిగాయి. బజాజ్ ట్వాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, మెటల్ స్టాక్స్ నేలచూపులు చూశాయి. 10 గ్రాముల బంగారం రేట్ 432 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 59 వేల 815 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 596 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 69 వేల 97 రూపాయలు పలికింది.
ఈ ఉగాదికి వస్తున్నాం….రీమేక్ మొదలుపెడుతున్నాం
టాలీవుడ్ సీనియర్ హీరోలు ఈ వయస్సులో కూడా చేతిలో రెండు మూడు సినిమాలకు తగ్గకుండా లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు పోటీఇస్తున్నారు. చిరు, బాలయ్య, వెంకీ మామ.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే అక్కినేని నాగార్జున మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా రిలీజ్ కాదు కదా కనీసం ప్రకటించకపోవడం అక్కినేని అభిమానులను కలవరపరుస్తోంది. గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు. ఎవరు ఎంత మాట్లాడిన నాగ్ మాత్రం మౌనమే సమాధానమంటూ దాటేస్తూ వచ్చాడు. అయితే అందుకు కారణం.. నాగ్ రీమేక్ చేయాలనుకుంటున్న సినిమా రైట్స్ విషయంలో కొద్దిగా అవకతవకలు జరగడమే. అవును.. నాగ్.. ఒక మలయాళ సినిమాను రేంక్ చేయాలనుకుంటున్నాడు. అదే.. పోరింజు మరియమ్ జోస్.
