NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

మోడీ మహా నటుడు.. రేవంత్ కు అంత సీన్ లేదు

మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉంటే వార్త కేసీఆర్ పాలనలో కరెంటు పోతే వార్త అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రేవంత్ రెడ్డి గొంతు చించుకుంటున్నాడు.. 10 సార్లు అవకాశాలు ఇస్తే 50 ఏళ్ళు పాలించి ఎం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. పరిపాలించడం చేతగాని వారు ఇపుడు ఒక్క చాన్స్ ఇవ్వమని అడుగుతున్నారని రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం చెందారు. భారతదేశంలోనే అబద్ధాలు చెప్పడం.. నటించడంతో ప్రధానమంత్రి మోడీ కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని తెలంగాణ మున్సిపాల్ శాఖ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మహా నటుడు మోడీ.. దేశ సంపద అంతా దోస్తు ఖాతాలో జమచేస్తూ విపక్షాలను కొనుగోలు చేస్తున్నాడని విమర్శలు గుప్పించాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. నల్లధం తెస్తానని ఇపుడు తెల్లమొఖం వేశాడని ప్రధాని నరేంద్ర మోడీపై ఐటీమంత్రి కేటీఆర్ విమర్శాలు గుప్పించాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయాలి.. తెలంగాణ పై కేంద్రం కక్ష గట్టిందని ఆయన తెలిపారు.

ఫుట్ బాల్ ఆడిన రేవంత్.. కేసీఆర్ ఖేల్ ఖతం

రాజకీయాలు, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉంటే రేవంత్ రెడ్డి కాసేపు సరదాగా ఫుట్ బాల్ గేమ్ ఆడారు. హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు.. ప్రస్తుతం ఆ పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో సాగుతుంది. ఈ సందర్భంగా 29వ రోజు యాత్రలో భాగంగా నగరంలోని ఓ ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఆయన పలువురు యువతీ, యువకులతో ఓట ఆడారు. అంతేకాదు.. యువతతో పాటు పోటాపోటీగా పరుగులు పెట్టిన రేవంత్ రెడ్డి గోల్ కూడా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.. అంతేకాదు.. దీనికి కేసీఆర్ ఖేల్ ఖతం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి స్పందించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఆయన యాత్ర ఈ రోజు నిజామాబాద్ జిల్లా మోపాల్ మీదుగా సాగుతుంది. గతంలోనూ ఏఎల్ఎం, ఎంసెట్ వంటి పరీక్షలు ప్రశ్నాపత్రాలు లీకైనట్లు తెలిపారు. కేసీఆర్ సర్కార్ వచ్చినప్పటి నుంచి 30లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహించిన పోటీ పరీక్షలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కోటంరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

ఏపీ అసెంబ్లీలో కొందరు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పై సస్పెన్షన్ వేటు పడింది. కోటంరెడ్డితో పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు సభాపతి తమ్మినేని సీతారాం. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, , పయ్యావుల కేశవ్ (Payyavula kesav), నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu)ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అలాగే మిగిలిన సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. హౌస్‌ను మిస్ లీడ్ చేసినందుకు, సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుతగిలినందుకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. దీంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.అంతకుముందు కేవలం ఇద్దరు టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును మాత్రమే స్పీకర్ సస్పెండ్ చేశారు. గవర్నర్ రిసీవింగ్ అంశంపై సభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తనకు అవకాశం కల్పించాలని పదే పదే అడిగారు. సుమారు 40 నిమిషాలకు పైగా సభలో అధికారపార్టీ మంత్రులు, సభ్యులు మాట్లాడుతున్న సమయంలో పయ్యావుల పదే పదే అడ్డుతగిలారు. దీంతో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేకుండా తమరెలా సస్పెండ్ చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. దీంతో అప్పటికప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ మరలా వీరిద్దరి సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. అప్పుడు స్పీకర్ మరోసారి ఇద్దరు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సస్పెండ్ అయిన వారు సభ నుంచి బయటకు వెళ్లాలని కోరారు. అయితే టీడీపీ సభ్యులు ఇంకా తమ ఆందోళన కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యులు మొత్తాన్ని సస్పెండ్ చేస్తేనే వెళతామని అంటున్నారని… వీరి మొత్తాన్ని సస్పెండ్ చేస్తే తప్ప సభను జరగనివ్వరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సభ్యులను అందరిని సస్పెండ్ చేయాలని మరో మంత్రి దాడిశెట్టి రాజా స్పీకర్‌కు తెలిపారు. సభలో అధికార పార్టీ తీరుపై టీడీపీ సభ్యులు మండిపడుతున్నారు.

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్.. దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్

ఇటీవల లండన్ వేదికగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. విదేశీ గడ్డపై భారతదేశ పరువు తీశారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి సంస్థలను ఆయన అగౌరపరిచారని అన్నారు. భారతదేశాన్ని అవమానించడం ప్రజాస్వామ్యామా..? సభాపతిని అగౌరపరచడం ప్రజాస్వామ్యామా.? అని ఆమె రాహుల్ గాంధీని ప్రశ్నించారు. వెంటనే రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబం ఆదేశాల మేరకు కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటులో స్పీకర్ చైర్ వద్దకు వెళ్లి, కాగితాలు చింపివేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. భారత ప్రజల గొంతుకగా ఉన్న పార్లమెంట్ నుంచి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశానికి క్షమాపణలు చెప్పే బదులు ఆయన సభకు గౌర్హాజరు కావాలని అనుకుంటున్నారని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.

ఏపీ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాల్సిందే

 

 

ఉద్యోగుల సమస్యల పై ఏపీ ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇటీవల కాలంలో వివిధ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో తరచూ భేటీ అవుతోంది. ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు తమను ఆహ్వానించకపోవడం పై హైకోర్టును ఆశ్రయించారు ఏపీ జీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ. తమను ఆహ్వానించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు సూర్యనారాయణ తరపు న్యాయవాది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కూడా ఆహ్వానించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు కూడా దిగారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసమావేశాల్లో అమరావతి జేఏసీ నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులకు వైసీపీ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, జీత భత్యాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించకపోవడం, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి హామీలు నెరవేర్చలేదు. దీంతో ఉద్యోగ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.ప్రభుత్వం ఇవాళ తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ సమావేశాలకు మంత్రులతో పాటు సజ్జల, చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు (ఏపీ జేఏసీ అమరావతి), బండి శ్రీనివాసరావు (ఏపీ ఎన్జీవోలు), వెంకట్రామిరెడ్డి (సచివాలయ ఉద్యోగుల సంఘం)ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ప్రభుత్వంతో విభేదిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో సూర్యనారాయణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజా ఆదేశాలతో ప్రభుత్వం ఏపీ జీఈఏని కూడా చర్చలకు ఆహ్వానించక తప్పదు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

త్వరలో ప్రభుత్వాన్నే ప్రజలు సస్పెండ్ చేస్తారు

ఏపీ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో నా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గం.అసెంబ్లీ చరిత్రలో నల్ల అక్షరాలతో లిఖించాలి. నెల్లూరు రూరల్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించే ప్రయత్నం చేశాను. ఈ సమస్యలపై నాలుగేళ్లుగా మట్లాడుతూనే ఉన్నాను. ప్రభుత్వం దృష్టికి తేవడం ద్వారా సమస్యలపై పరిష్కరించే ప్రయత్నం చేశాను. ప్రజా సమస్యలపై మాట్లాడతానని నేను కోరితే నాకు అవకాశం ఇవ్వలేదు. నన్ను తిట్టించేందుకు ఇద్దరు మంత్రులకు ఇరవై నిమిషాల సమయం ఇచ్చారు. ఇవాళ సభ జరుగుతున్నంత సేపు నిలబడే గాంధీగిరీ పద్దతిలో నిరసన తెలిపాను.టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత నా దగ్గరకు ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి నా వద్దనున్న ప్లకార్డు లాక్కుని చించేశారన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఇదేం దాదాగిరి అని స్పీకరును అడిగితే నన్ను సస్పెండ్ చేశారు. నన్ను స్పీకర్ తాత్కాలికంగా సభ నుంచి సస్పెండ్ చేశారు.కానీ ఈ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా డిస్మిస్ చేస్తారన్నారు కోటంరెడ్డి.

ఒక్కరోజుకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన ఒకపక్క సినిమాలు ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ గా ఆయన రేంజ్ వేరు. ఒక్క సినిమా తీస్తే కోట్లు వస్తాయి. అయినా అలాంటి లగ్జరీ లైఫ్ వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక జనసేన పార్టీని నడపడానికి మాత్రమే సినిమాలు చేస్తున్నాని అందరి ముందు చెప్పుకొచ్చారు. ఇంకో పక్క పవన్.. కొన్ని రాజకీయ పార్టీల ద్వారా ప్యాకేజీలు అందుకుంటున్నారని రూమర్స్ గుప్పుమంటున్నాయి. అంతే కాకుండా పవన్ ఒక్కో సినిమాకు దాదాపు రూ. 100 కోట్లు తీసుకుంటున్నారని కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ పుకార్లన్నింటికీ పవన్ చెక్ పెట్టారు. గతరాత్రి మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన జనసేన పదవ ఆవిర్భావి దినోత్సవంలో పవన్ కళ్యాణ్ తన రెమ్యూనిరేషన్ తో సహా మొత్తం చెప్పుకొచ్చారు.

టీమిండియాకు భారీ దెబ్బ…ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ ప్లేయర్ దూరం

ఇటీవల లండన్ వేదికగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. విదేశీ గడ్డపై భారతదేశ పరువు తీశారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి సంస్థలను ఆయన అగౌరపరిచారని అన్నారు. భారతదేశాన్ని అవమానించడం ప్రజాస్వామ్యామా..? సభాపతిని అగౌరపరచడం ప్రజాస్వామ్యామా.? అని ఆమె రాహుల్ గాంధీని ప్రశ్నించారు. వెంటనే రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబం ఆదేశాల మేరకు కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటులో స్పీకర్ చైర్ వద్దకు వెళ్లి, కాగితాలు చింపివేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. భారత ప్రజల గొంతుకగా ఉన్న పార్లమెంట్ నుంచి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశానికి క్షమాపణలు చెప్పే బదులు ఆయన సభకు గౌర్హాజరు కావాలని అనుకుంటున్నారని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.

శాకుంతలం ప్రమోషన్స్ మొదలుపెట్టిన సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యనే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడింది. ఇక యశోద సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఏడాది శాకుంతలం చిత్రంతో అభిమానుల ముందుకు రానుంది. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం ఏప్రిల్ 14 న పరిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. శకుంతల- దుశ్యంతుల ప్రేమ కావ్యంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎన్నో వాయిదాలా తరువాత ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. అందులోనూ దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. సమంత కొద్దిగా కోలుకోవడంతో ఆమె కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొననుంది. తాజాగా శాకుంతలం చిత్రం బృందం పెద్దమ్మ తల్లి టెంపుల్ లో సందడి చేశారు. శుభప్రదంగా అమ్మవారి ఆశీస్సులు అందుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. సమంత, హీరో దేవ్ మోహన్, డైరెక్టర్ గుణశేఖర్, ఆయన కుమార్తె, నిర్మాత నీలిమ గుణ, నిర్మాత దిల్ రాజు కలిసి పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.