NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

Ntv top-headlines March 12, 2023 -at-9AM

CISF సాధించిన విజయాలకు భారత గర్విస్తోంది

దేశాన్ని రక్షించడంలో CISF సిబ్బంది సాధించిన విజయాలకు భారతదేశం గర్విస్తోందని కేంద్ర హోమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్‌లో 54వ సీఐఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, ఎంపీ లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరులకు నివాళులర్పించిన అమిత్ షా..CISF పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కాగా, కేంద్ర హోమంత్రి అమిత్ షా నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇతర బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి అమిత్ షా నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీకి వెళ్లారు. అక్కడ బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ తో అమిత్ షా భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలు, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు, బీఆర్ఎస్ వ్యూహాలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పార్టీ నేతలతో అమిత్ షా మరోసారి సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది. కాగా,హైదరాబాద్ పర్యటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో కేరళలోని కోచికి వెళతారు.

బఖ్ మూత్ లో మారణ హోమం…ఒక్క రోజే 500 మంది రష్యా సైనికుల మరణం

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లోని బఖ్‌ముత్ పట్టణాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ బఖ్‌ముత్ చేజారిపోకుండా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో బఖ్‌ముత్ కేంద్రంగా మారణహోమం జరుగుతోంది. నెలల తరబడి ఈ పట్టణంపై ఆధిపత్యం కనబరిచేందుకు రష్యన్ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఇదిలా ఉంటే బఖ్‌ముత్ లో జరుగుతున్న పోరాటంలో ఒకే రోజు 500 మందికి పైగా రష్యన్ సైనికులు గాయలపాలవడంతో పాటు చంపబడ్డారని ఉక్రెయిన్ వెల్లడించింది. బఖ్‌ముత్‌లో 23 ఘర్షణలు జరిగాయని, 24 గంటల వ్యవధిలో రష్యన్లు 16 దాడులకు పాల్పడ్డారని తూర్పు దళాలకు చెందిన సైనిక ప్రతినిధి సెర్హి చెరెవాటీ తెలిపారు. ఈ పోరాటంలో 221 మంది రష్యా సైనికులు మరణించడంతో పాటు 314 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అయితే ఉక్రెయిన్ చేసిన ఈ వ్యాఖ్యలను రష్యా కానీ ఇతర ఏ మీడియా కానీ ధృవీకరించలేదు.

రాజకీయాల్లోకి ఎందుకు రాలేదంటే… ?

రాజకీయాల్లోకి ఎందుకు రాలేదనే విషయం పై క్లారటీ ఇచ్చారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. పొలిటికల్‌ ఎంట్రీకి దాదాపు రెడీ అయ్యాను. అయితే అదేటైంలో కరోనా వచ్చిందన్నారు. రాజకీయాల్లో రావాలనే ప్లాన్ లో ఉన్నప్పుడు డాక్టర్లు కీలమైన సూచనలు చేశారు …ప్రజలను కలిసే సమయంలో పది అడుగుల దూరం ఉండాలి,మాస్క్‌ వేసుకోవాలని అన్నారు. ఆరోగ్య పరిస్థితి రీత్యా పొలిటికల్‌ ఎంట్రీ పై ఆలోచించి అడుగు వేయాలన్నారు..అప్పటికే కిడ్నీ సమస్య ఉండటం …దానికి తోడు కరోనా వైరస్ తీవ్రమైన ఉన్న జనాల్లోకి వెళ్ళడం మంచిది కాదన్నారు..రాజకీయాల్లో రజనీకాంతరావు రావడానికి భయపడ్డాడు అన్నారు. రాజకియాల్లో రాకపోవడానికి అసలు నిజం నా ఆరోగ్యం సహకరించకపోవడమే అని అసలు సంగతి చెప్పేశారు. రజనీకాంత్ రాజకీయాలకు ఎందుకు దూరమయ్యారనేది ఇప్పటికీ చాలామందికి అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. తాజాగా రజనీకాంత్‌ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఆయన అభిమానులకు ఊరట నిస్తాయేమో చూడాలి. తనకు మూత్రపిండాల సమస్య ఉండటం వల్లే రాజకీయాలకు దూరమయ్యానని రజనీకాంత్‌ చెప్పడంతో ఆయనపై విమర్శలు చేసేవారికి సమాధానం చెప్పినట్టు అయిందంటున్నారు విమర్శకులు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీలో జరిగిన సేఫియన్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ రజతోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి ఆయన అతిథిగా పాల్గొన్నారు. రాజకీయాలంటే తనకు భయమనీ అంతా అనుకుంటారని, అందుకే ఎక్కడా చెప్పలేదని వివరించారు.

నిజామాబాద్‌ జిల్లాలోకి రేవంత్ పాదయాత్ర.. పూర్తి రూట్ మ్యాప్ ఇదే !

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర నిజామాబాద్ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపనుంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో ముగించుకుని 11వ తేదీ రాత్రి 9 గంటలకు నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చేరుకుంది. రాత్రి రేవంత్ అక్కడే బస చేశారు. ఇవాల్టి నుంచి నిజామాబాద్ నియోజకవర్గాల్లో ఆరు రోజుల పాటు రేవంత్ పాదయాత్ర కొనసాగనుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. కాగా.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నేటి స్ట్రాంగ్ క్యాడర్ ఉండటంతో..తిరిగి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చే విధంగా రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేలా తన యాత్ర షేడ్యూల్ ను రూపొందించారు. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ఎద్దును ఢీకొట్టిన వందే భారత్.. రైలుకు మళ్లీ డ్యామేజ్!

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు తరుచూ చిన్న చిన్న ప్రమాదాలకు కేంద్రబిందువు అవుతోంది. ఇప్పటికే గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఈ రైలు ప్రమాదాల బారిన పడింది. తాజాగా తెలంగాణలోని ఖమ్మంలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్‌ రైలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్‌ వద్దకు రాగానే ట్రాక్‌పైకి వచ్చిన ఎద్దును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.కొన్ని నిమిషాల పాటు రైలును అక్కడే నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. మరమ్మతు పనులు పూర్తయిన తరువాత విశాఖపట్నానికి పంపిస్తామని అధికారులు తెలిపారు. సిబ్బంది మరమ్మతులు చేయగా, 25 నిమిషాల ఆలస్యంగా రైలు బయలుదేరి వెళ్లింది. షెడ్యూల్‌ ప్రకారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకోవాల్సి ఉంది.

ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు?
తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.మార్గదర్శి కార్యాలయాల్లో కొనసాగుతున్న సీఐడీ దాడులు..విజయవాడ , గుంటూరు , విశాఖ సహా ఏడు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. 24 గంటలుగా కొనసాగుతున్న సోదాలలో ఏం జరుగుతోంది? మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే మార్గదర్శి పై కేసు నమోదయింది.

ఉప రాష్ట్రపతి పదవిపై రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఉప రాష్ట్రపతి పదవిపై ఆయన చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముప్పవరపు వెంకయ్య నాయుడు గతంలో వివిధ పదవులు అధిరోహించారు. అనంతరం ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి పదవీ విరమణ చేశారు. వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం నాకు నచ్చలేదు. గొప్పనాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారన్నారు రజనీకాంత్. ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవు. చాలా విషయాల్లో ప్రోటోకాల్ కండిషన్స్ ఉంటాయని అభిప్రాయపడ్డారు రజనీకాంత్.నేను ఉపరాష్ట్రపతి పదవిని కించపరచడం లేదు .. వెంకయ్యనాయుడు మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగివుంటే బాగుండేదన్నారు. చిన్న మచ్చకూడా లేకుండా ఉన్న వ్యక్తి వెంకయ్యనాయుడు అన్నారు రజనీకాంత్. గతంలోనూ అనేక మార్లు ఉప రాష్ట్రపతి పదవి విషయంలో వెంకయ్యనాయుడు తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అనేకమంది కూడా ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి వెంకయ్యనాయుడిని రాజకీయాలకు దూరం చేశారని అభిప్రాయపడ్డారు. తాజాగా రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రజనీకాంత్ వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్లు వస్తాయో చూడాలి మరి.

90 ఏళ్లకు పైగా ఉన్న ఆస్కార్ చరిత్రలో కీలకమార్పు
కళా ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన అవార్డు ఆస్కార్. 90 ఏళ్లకు పైగా ఆస్కార్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. సినీ పరిశ్రమలోని నటులు ఒక్క సారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటారు. అయితే అది నిజం కావడం చాలా కష్టమని భావిస్తారు. ఒక్కొక్కటిగా నాణ్యమైన సినిమాలు ప్రస్తుతం ఆస్కార్ రేసులో ఉన్నాయి. ఆదివారం, మార్చి 12 అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. ఈ సారి ఆస్కార్ భారతదేశానికి కూడా చాలా ప్రత్యేకం ‘RRR’ కూడా ఆస్కార్ రేసులో చేరింది. అని భారతీయులు అందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనితో పాటు 62 ఏళ్లలో తొలిసారిగా మరో మార్పు కూడా రానుంది. అవార్డ్ షో ఏదయినా రెడ్ కార్పెట్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ రెడ్ కార్పెట్‌పై తారలు తమ గ్లామర్‌ను చాటుకుంటారు. అయితే 62 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆస్కార్ అవార్డులకు రెడ్ కార్పెట్ పరుచుకోనుంది. ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడవాలనేది ప్రతి స్టార్ కల, కానీ ఈసారి రెడ్ కార్పెట్ రంగు మారనుంది. 1961 నుండి అంటే 33వ అకాడమీ అవార్డుల వేడుక నుండి, ప్రతిసారీ రెడ్ కార్పెట్ ధరిస్తారు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయాన్ని మార్చాలని నిర్ణయించారు. నిజానికి ఆస్కార్‌ వేడుకలను నిర్వహిస్తున్న అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఈసారి ఎరుపు రంగుకు బదులు ‘షాంపైన్‌’ రంగును ఎంచుకుంది.