NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

జగన్ మాయమాటలతో మభ్యపెడుతున్నారు

ఏపీలో బీజేపీ నేతలు మాటల దాడి పెంచుతున్నారు. అనంతపురంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఏపీ లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మాయమాటలతో మభ్యపెడుతోంది. మోసం, అబద్దాలు చెబుతున్నారు.అభివృద్ధి పక్కన పెట్టి రాజకీయాలు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులను మభ్య పెట్టడానికి క్యాబినెట్ సబ్ కమిటీ అంటున్నారు. ఉద్యోగస్తులను అమాయకులు అనుకోవడం ప్రభుత్వ పెద్దల అవగాహన రాహిత్యం అన్నారు. ప్రతిదీ ఎన్నికలకు లింక్ చేస్తూ ప్రభుత్వం పనిచేస్తోంది. నాలుగేళ్లు మాట్లాడకుండా ఎన్నికల వేళ గ్లోబల్ సమ్మిట్ పెట్టి రూ.లక్షల కోట్లు వస్తాయి అంటున్నారు.ముఖ్యమంత్రి సహా ఎవరికీ అవగాహన లేదని అర్థం అవుతోంది. సమ్మిట్ లో ఒక్క విదేశీ పెట్టుబడిదారుడు లేడు. ఒక్క రూపాయి విదేశీ పెట్టుబడి రాలేదు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి ముందస్తు ప్రణాళిక లేదన్నారు సత్యకుమార్. రాబోయే కాలంలో బీజేపీ పటిష్టానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అవసరం అయినప్పుడల్లా బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.

మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయ్.. కుట్రలో భాగంగానే కవితకు నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నేత, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం మోదీ ప్రభుత్ దుర్మార్గాలకు పరాకాష్ట అని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ దురాగతాలను బయటపెడుతున్నారని సీఎం కేసీఆర్ పై మోదీ కుట్ర పన్నారని, ఇందులో భాగంగానే కవితకు నోటీసులు ఇచ్చారని అన్నారు. అణచివేత దోరణితోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని బీజేపీ ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తుందంటూ దుయ్యబట్టారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదని, నియంతలు నిలబడినట్లు చరిత్రలో లేదని ఆయన అన్నారు. బీజేపీ అసలు రూపాన్ని ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తామని అన్నారు.

త్రిపుర సీఎంగా మాణిక్ సాహా.. ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని

త్రిపురలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతోంది. త్రిపుర ముఖ్యమంత్రిగా నేడు మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీని వరసగా రెండోసారి అధికారంలోకి తీసుకురావడంతో మాణిక్ సాహా కీలకంగా పనిచేశారు. దంతవైద్యుడు, రాజకీయనాయకుడిగా సాహాకు క్లీన్ ఇమేజ్ ఉంది. అగర్తలా వివేకానంద మైదాన్ లో ప్రమాణస్వీకారం జరిగింది. ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం

ఏపీలో ఈ నెల 13వ తేదీన టీచర్, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ జరగనుంది. అటు టీడీపీ, ఇటు అధికార వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తాజాగా తిరుపతిలో దొంగ ఓట్లు నమోదయ్యాయని విపక్షాలు అధికార పార్టీపై ఆరోపణలు చేస్తున్నాయి. తిరుపతిలో దొంగఓట్లు కలకలం రేపుతున్నాయి. అర్హత లేని వేలాదిమందికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క తిరుపతిలోనే ఏడు వేల దొంగ ఓట్లు ఉన్నాయి అంటున్నారు టీడీపీ నేతలు. డిగ్రీ అర్హత లేకుండా ఓటర్లుగా నమోదై లిస్టులో ఉన్న వారిపై దృష్టి సారించాయి వామపక్షాలు. తిరుపతి నగరంలోని అధికార వైసిపి కార్యాలయం చిరునామా పేరుతో 20 దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపిస్తుంది సిపిఎం. ఓటర్లుగా ఉన్న వాళ్ళ ఇళ్లకు వెళ్లి విచారిస్తున్పారు వామపక్ష నేతలు.. చదువు రాని వారు, పదవ తరగతి కూడా పూర్తి చేయని వారికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కల్పించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. డిగ్రీ పత్రాల జిరాక్స్ లో పేర్లు మార్చి ఓటర్లుగా నమోదైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దొంగ ఓట్ల విషయంలో అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి టీడీపీ, సీపీఎం, సీపీఐ నేతలు. ఈసీ దీనిపై దృష్టిపెట్టాలని కోరుతున్నాయి.

ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతిలో నారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లను నమోదు చేయించిన రెవెన్యూ అధికారులను ఉరితీయాలి. తిరుపతి వైసిపి పడమటి కార్యాలయం చిరునామాతో 36 దొంగ ఓట్లను నమోదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా ఖూనీ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడిన పిడిఎఫ్ అభ్యర్థుల విజయం ఖాయం. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోంది. వాలంటీర్ ఇంటిలో 22ఓట్లు నమోదు చేయించారు.ఒక మహిళకు 21మంది భర్తలు ఉన్నట్లు సృష్టించి ఓట్లు నమోదు చేశారు. యశోద నగర్ లోని ఖాళీ స్థలంలో 11 ఓట్లు నమోదు చేయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అక్రమాలకు అంతులేకుండా పోతోంది. తిరుపతి నగరంలో 7వేల దొంగ ఓట్లున్నాయన్నారు నారాయణ. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. శ్రీకాకుళంలో టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికను కూడా అవినీతిమయం చేయాలని చూస్తున్నారు. పది , ఐదు తరగతిచదవని వారు కూడా ఓటర్లుగా నమెదు అయ్యారు.తప్పుడు దృవపత్రాలతో ఓటర్లుగా నమెదైన వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అర్హతలేని వారు గ్రాడ్యుయేట్స్ గా నమెదు అయ్యారు. తక్షణం వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.వాలంటీర్ ల ద్వారా ఓట్లు కోనుగోలు చేయాలని కుట్ర చేస్తున్నారు.బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమచేసి , ఓట్లు కోనుగోలు చేయాలని చూస్తున్నారు. జిల్లా మంత్రులు ధర్మాన , సీదిరి ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేవిధంగా వ్యవహరిస్తున్నారు.

కరోనా వచ్చి.. తగ్గిపోలేదు.. ఏడాది తర్వాతే దాని విశ్వరూపం
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ప్రజా జీవితాన్ని సమూలంగా మార్చేసింది. మనిషి ఎదుటి వారిని చూసి జడుసుకునేంతగా చేసేసింది. అప్పటి వరకు మాస్క్, శానిటైజర్లంటే తెలియని జనానికి వాటిని తప్పనిసరి చేసింది. పలు దేశాల ఆర్థికవ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ప్రతి సారి దాని ప్రభావం పోయింది.. అనుకునే లోపే మళ్లీ రూపం మార్చుకుని తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. తాజాగా బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడ్డ ఏడాది తర్వాత శరీరంలోని ఏదో ఒక అవయవం దెబ్బతింటున్నదని అధ్యయనంలో తేలింది.

ఈ ఏడాది గూగుల్ లో ప్రమోషన్లు తక్కువే.. తాజా నివేదికలో వెల్లడి..

ఐటీ ఇండస్ట్రీలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడుతాయో తెలియడం లేదు. వరసగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది గూగుల్ సంస్థల్లో కొద్ది మందికి మాత్రమే ప్రమోషన్లు ఉంటాయని సీఎన్బీసీ నివేదిక వెల్లడించింది. సీనియర్లుగా ప్రమోషన్లు తగ్గుతాయని గూగుల్ ఇప్పటికే ఉద్యోగులకు తెలిపినట్లు సమాచారం. ఎల్ 6, ఆపై స్థాయిలకు తక్కువ ప్రమోషన్లు ఉంటాయని తెలుస్తోంది. ఎల్ 6 అనేది సీనియర్ గా పరిగణించే మొదటిస్థాయి ఉద్యోగులను సూచిస్తుంది. సాధారణంగా వీరు పదేళ్ల సీనియారిటీ కలిగి ఉంటారు. ఉద్యోగుల పనితీరు అంచనా వేయడానికి గూగుల్ రివ్యూస్ అండ్ డెవలప్మెంట్(జీఆర్ఏడీ) అమలు తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సిస్టమ్ ప్రకారం చాలా మంది ఉద్యోగులు తక్కువ పనితీరున రేటింగ్ సాధించారు. కొందరు మాత్రమే మంచి రేటింగ్ సాధించారు.

ప్రియురాలు పిలిచింది.. కట్ చేస్తే ప్రాణాలు ఫట్
ప్రియురాలు అర్ధరాత్రి ప్రేమతో పిలిచిందని కలిసేందుకు వెళ్లాడు. అక్కడే కాచుకుని కూర్చున్న గుంపు దారుణంగా కొట్టడంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన కేరళలోని త్రిసూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వృత్తిరీత్యా బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న అవివాహిత యువకుడు సహర్ అర్ధరాత్రి తన వివాహిత ప్రియురాలిని కలవడానికి వెళ్లాడు. వివాహిత ఇంటి సమీపంలోని గుడిదగ్గర మోరల్ పోలీసింగ్ పేరుతో కూర్చున్న ఓ గుంపు ఆ యువకుడిని మొదట విచారించింది. ఆ తర్వాత యువకుడిపై దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన అంతా ఓ గుడి దగ్గర ఉన్న కెమెరాలో రికార్డయింది. ఈ షాకింగ్ సంఘటన ఫిబ్రవరి 18 న జరిగింది. గాయపడిన బస్సు డ్రైవర్ మంగళవారం త్రిసూర్ ఆసుపత్రిలో మరణించాడు.

ఫేక్ మెసేజ్ ల వల.. 3 రోజుల్లోనే 40 మంది కస్టమర్ల అకౌంట్లు హాంఫట్

Hawala Mony

డియర్ కస్టమర్.. ఈరోజు మీ బ్యాంకు ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడుతోంది.. డియాక్టవేట్ కాకుండా ఉండేందకు ఇప్పుడే మీ కేవీసీ, పాన్ ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేయడానికి కింద లింక్ క్లిక్ చేయండి’’ అంటూ మేసేజ్ వస్తే మీరు దాన్ని ఓపెన్ చేశారంతే అంతే సంగతులు. మోసగాళ్లు మీ ఖాతాలోని నగదును కొట్టేస్తారు. ఇలాంటి మేసేజులు వస్తే క్లిక్ చేయొద్దు. ఇలాంటి మెసేజులను చదివి నిజమే అనుకుని ముంబైలో ఓ బ్యాంకుకు చెందిన 40 మంది కష్టమర్లు తమ డబ్బును పోగొట్టుకున్నారు. లక్షల డబ్బు మోసగాళ్లకు చేరిపోయింది.

20 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు.. ఉదారత చాటుకున్న భారత్
ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సాయాన్ని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్-మధ్య ఆసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన విడుదలైంది. ఈ సహాయం కాబూల్‌కు పాకిస్తాన్ ద్వారా కాకుండా ఇరాన్‌లోని చబహార్ పోర్ట్ ద్వారా అందించబడుతుంది.

అహ్మదాబాద్ టెస్టులో చరిత్ర సృష్టించనున్న రోహిత్..

రత్ vs ఆస్ట్రేలియా 4 టెస్ట్ సిరీస్ ఇరు జట్ల మధ్య జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి 2 మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం 4 టెస్టుల సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. కాబట్టి మార్చి 9 నుంచి ప్రారంభమయ్యే అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం కానుంది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారీ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా చేయలేకపోయాడు. కానీ అహ్మదాబాద్ టెస్టులో మాత్రం 21 పరుగులు మాత్రమే చేసి భారీ రికార్డు సృష్టించే అవకాశం ఉంటుంది. 21 పరుగులు చేసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌లో 17 వేల పరుగులు పూర్తి చేస్తాడు. ఇప్పటివరకు అతను 16,989 పరుగులు చేశాడు. సునీల్ గవాస్కర్ తన కెరీర్‌లో 13,214 పరుగులు చేశాడు. మహ్మద్ అజారుద్దీన్ 15,593 పరుగులు చేశాడు.