NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని కలల కంటోంది

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని కలలు కంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. సోమవారం లండన్ లో జరిగి చాథమ్ హౌస్ థింక్ ట్యాంక్‌లో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని గుర్తు చేశారు. బీజేపీ 2014లో అధికారంలోకి రాకముందు తాము అధికారంలో ఉన్నామని, అయితే బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని అనుకుంటున్నారని, అది ఎప్పటికీ జరగదని అన్నారు. బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్, ముస్లిం బ్రదర్ హుడ్ తరహాలో నిర్మించబడిందని, అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుని, ఆ తరువాత ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోందని ఆరోపించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏం జరుగుతోందో, ఇండియా-చైనాల మధ్య అదే జరుగుతోందని ఆయన అన్నారు. యూరప్, అమెరికాలో సంబంధాలు పెట్టుకోవడం రష్యాకు ఇష్టం లేదని, అందుకే ఉక్రెయిన్ సమగ్రతను దెబ్బతిస్తోందని, ఇదే విధంగా భారత్ అమెరికాతో సంబంధాలు పెట్టుకోవద్దని చైనా లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతోందని రాహుల్ గాంధీ అన్నారు.

రెడ్డిగూడెంలో పోస్ట్ మెన్ రమేష్ చేతివాటం

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెంలో ఘోరం జరిగింది. రెడ్డిగూడెంలో పోస్ట్ మేన్ రమేష్ చేతివాటం ప్రదర్శించాడు. ఆర్డీ ఖాతాదారుల పొదుపు సొమ్ము స్వాహా చేశాడు పోస్ట్ మేన్ రమేష్. ఖాతాదారుల నుండి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. పల్లెటూరు కావడంతో పోస్ట్ ఆఫీస్ లో తమ డబ్బు డిపాజిట్,విత్ డ్రా కోసం పోస్ట్ మేన్ పైనే ఆధారపడుతున్నారు ఖాతాదారులు. విత్ డ్రా డబ్బును స్వంత అవసరాలకు వాడుకుని పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు ఇంకా ఇవ్వలేదని నమ్మించే ప్రయత్నం చేశాడు పోస్ట్ మేన్ రమేష్. వత్తిడి పెరగడంతో 10రోజుల క్రితం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలియడంతో నిన్న పోస్ట్ ఆఫీస్ లో విచారణ‌ చేపట్టారు పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డి.శ్రీనివాసరావు. ఇప్పటి వరకూ సుమారు 4నుండి 5 లక్షల రూపాయలు స్వాహా జరిగినట్లు సమాచారం. బాధితులు బయటకు వస్తే ఈ మొత్తం పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఖాతాదారులు నమ్మినందుకు పోస్ట్ మెన్ తన నైజం ప్రదర్శించాడు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని, రమేష్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు పోస్టల్ శాఖ అధికారులను, పోలీసులను కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా అని అక్కడ డబ్బులు దాచుకుంటే ఇలాంటి ఉద్యోగులు ఆ నమ్మకాన్ని వమ్ముచేస్తున్నారని ఖాతాదారులు వాపోతున్నారు.

విజయవాడ వైఎస్సార్ కాలనీలో కార్డన్ సెర్చ్

ఈమధ్యకాలంలో అసాంఘిక కార్యకలాపాలు సాగించేవారు ఎక్కువయ్యారు. వివిధ కాలనీల్లో నివసిస్తున్న వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. విజయవాడలో వైఎస్సార్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ ఎసిపి హనుమంతరావు ఆధ్వర్యంలో కొనసాగిన కార్డన్ సెర్చ్ లో సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు,ఆటోలు, స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసులు అనుమానితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించారు. తాజాగా ఇదే కాలనీలో గంజాయి తాగుతూ పట్టుబడ్డారు 10 మంది యువకులు. మత్తు పదార్దాల వినియోగంపై ఫోకస్ పెట్టారు పోలీసులు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరించారు.

హోలీ సందర్భంగా అలీగఢ్ మసీదుకు ముసుగు..

దేశవ్యాప్తంగా హోలీ పండగ సంబరాలు మొదలయ్యాయి. అయితే కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. కొన్ని చోట్ల మసీదులను టార్పిలిన్లలో కప్పారు. ముఖ్యంగా చాలా సున్నిత ప్రాంతం అయిన అలీగఢ్ లోని మసీదును టార్పలిన్లతో కప్పారు. హోలీ సమయంలో రంగులు పడకుండా మసీదును కప్పినట్లు నిర్వాహకులు తెలిపారు.అలీగఢ్ లోని అబ్దుల్ కరీం మీసీదు హల్వాయియన్ ప్రాంతంలో ఉంది. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటిగా ఈ ప్రాంతం ఉంది. పోలీసుల సూచనల మేరకు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. గత కొన్నేళ్లుగా హోలీ రోజున మసీదును కప్పి ఉంచుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 6-7 ఏళ్లుగా హోలీ రోజున ఇలాగే మసీదును కప్పిఉంచుతున్నారని స్థానిక నివాసి అఖీల్ పహల్వాన్ అన్నారు.

నల్ల ద్రాక్షను ఖాళీ కడుపుతో తింటే…

మనం ఇష్టంగా తినే పండ్లల్లో ద్రాక్షపండ్లు ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ద్రాక్ష పండ్ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్ష దాదాపు అన్ని కాలాల్లో మ‌న‌కు విరివిరిగా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. ద్రాక్ష‌ పండ్ల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోషకాలు దాగి ఉన్నాయి. ద్రాక్షను తీసుకోవ‌డం వ‌ల్ల మనం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఇందులో రెండు రకాల ద్రాక్ష ర‌కాలు ఉన్నాయి.. ఒకటి ఆకుప‌చ్చ ద్రాక్ష పండ్లు, రెండు న‌ల్ల ద్రాక్ష పండ్లు. అయితే ఇందులో ఆకుప‌చ్చ ద్రాక్ష పండ్ల కంటే న‌ల్ల ద్రాక్ష పండ్లు మ‌న శ‌రీరానికి మ‌రింత మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ఫైబ‌ర్ తో పాటు శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ఇక శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో ద్రాక్ష పండ్లు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. నల్ల ద్రాక్షను త‌ర‌చూ ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అంతేకాదు క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటాము.

ఒక ఫోన్ కొంటే రెండు బీర్లు ఫ్రీ.. వ్యాపారి అరెస్ట్

పండుగల సీజన్ వస్తుందంటే చాలు కంపెనీలు, షాపులు ఆపర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి ఈ కామర్స్ సైట్లు బిగ్ బిలయన్ సేల్, ఫ్లాష్ సేల్ అని ప్రచారాలు ఊదరగొడతాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన బదోహిలో ఓ మొబైల్ దుకాణం దారుడు వినియోగదారుడిని ఆకట్టుకునేందుకు ఓ ప్రకటన చేశాడు. స్మార్ట్ ఫోన్ పై రెండు బీర్లు ఆఫర్ ప్రకటించడంతో జనం పోటెత్తారు దీంతో ట్రాఫిక్ కు భారీగా అంతరాయం ఏర్పడింది. ఇంకేముంది సమాచారం అందుకున్న పోలీసులు ఆ షాపు యజమానిని అరెస్ట్ చేశారు.

2035నాటికి ప్రపంచ జనాభాలో సగం మందికి ఆ వ్యాధి 

మారుతున్న జీవనశైలి, ఆహారం కారణంగా ఊబకాయం బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2035 నాటికి ప్రపంచంలో సగం మంది దీనితో బాధపడుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతేడాది మార్చి 4ని ప్రపంచ స్థూలకాయ దినోత్సవంగా పాటిస్తారు. ప్రపంచంలో పెరుగుతున్న ఊబకాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ఈ రోజును జరుపుకుంటారు. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ ఈ ఏడాది కొత్త నివేదికను ప్రకటించింది. దీని ప్రకారం 2035 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది స్థూలకాయంతో బాధపడతారని వెల్లడించింది.

నచ్చజెప్పాడు.. వినలేదు.. తుపాకీతో కాల్చి చంపాడు

కొల్హాపూర్‌లోని కాగల్ తాలూకాలోని బలేఘోల్‌లో అనైతిక సంబంధం కారణంగా ఓ యువకుడిని కాల్చి చంపిన షాకింగ్ సంఘటన జరిగింది. చనిపోయిన యువకుడి పేరు భరత్ బలిరామ్ చవాన్. హత్య అనంతరం నిందితుడే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ముర్‌గూడ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు. అనుమానిత నిందితుడి పేరు వికాస్ హేమంత్ భోంస్లే. ఈ ఘటన బలేఘోల్‌లోని సేనాపతి కాప్షి ప్రాంతంలో చోటుచేసుకుంది.