కన్నా చేరేది ఆ పార్టీలోనే… ముహూర్తం ఫిక్స్
బీజేపీకి గుబ్‌బై చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ.. ఇప్పుడు ఏ పార్టీలో చేరతారు? అనే చర్చ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. గతంలో కన్నా నివాసానికి వచ్చి మరీ జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలిసి వెళ్లారు.. బీజేపీ రాష్ట్ర అధినాయకత్వంపై హాట్‌కామెంట్లు చేసిన తరుణంలోనే ఈ ఇద్దరు నేతల భేటీ జరగడంతో.. కన్నా.. పవన్ కల్యాణ్ పార్టీ గూటికి చేరతారా? బీజేపీ బైబై చెప్పేస్తారా? అనే చర్చ సాగింది.. అయితే, ఆ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఇద్దరు నేతలు ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. కన్నా లక్ష్మీనారయణ చూపు జనసేన వైపు కాదు.. తెలుగుదేశం పార్టీ వైపు ఉందని ప్రచారం సాగుతోంది.. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడికి పంపిన కన్నా.. టీడీపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది.. ఈ నెల 23 లేదా 24వ తేదీన కన్నా లక్ష్మీనారాయణ.. టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.. 10 రోజుల క్రితం కన్నాతో హైదరాబాద్‌లో టీడీపీ పెద్దలు సమావేశం అయ్యారట.. సముచిత గౌరవం ఇస్తామని కన్నాను పార్టీలోకి ఆహ్వానించారట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, టీడీపీలో చేరికపై రెండు రోజుల్లో కన్నా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు..
టర్కీ భూకంపంలో మృత్యుంజయులెందరో
టర్కీ భూకంపంలో ఇప్పటికే మరణాల సంఖ్య 42,000లను దాటింది. గత వారం టర్కీ దక్షిణ ప్రాంతంలో 7.8, 7.5 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. వెయ్యికి పైగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో టర్కీతో పాటు సిరియా దేశం తీవ్రంగా దెబ్బతింది. గత దశాబ్ధాల్లో ఎన్నడూ లేని విధంగా టర్కీలోని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా.. ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇలాంటి సమయంలో కూడా అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజులుగా ఎలాంటి నీరు, ఆహారం లేకుండా కొంత మంది మృత్యుంజయులుగా శిథిలాల నుంచి బయటపడుతున్నారు. తాజాగా హతాయ్ ప్రాంతంలో అర్జెంటీనా రెస్క్యూ టీమ్ ముగ్గురిని సజీవంగా బయటకు తీసింది. తల్లితో పాటు ఇద్దరు బిడ్డలు క్షేమంగా బయటపడ్డారు. ఎన్టీవీ ఎక్స్ క్లూసివ్ గా టర్కీ పరిస్థితులను ప్రపంచానికి తెలియజేస్తోంది. ఎన్టీవీతో మాట్లాడిని అర్జెంటీనా రెస్క్యూ టీం సభ్యుడు లూథర్ దీన్ని అద్భుతం అని కొనియాడారు. ముగ్గురిని సజీవంగా బయటకు తీసిన టీమ్ లో తాను ఉన్నందుకు ఆనందంగా ఉందని వెల్లడించారు. ముగ్గురు కూలిపోయిన భవనం కింద ఉందని బంధువులు సమాచారం ఇవ్వడంతో రెస్య్కూ ప్రారంభించామని.. మమ్మల్ని చూడగానే వారి కళ్లలో కనిపించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని లూథర్ అన్నారు.
ఎస్సై ముగ్గురు కానిస్టేబుళ్ళకు జైలు శిక్ష.. ఎందుకంటే?
నేరం చేసిన ఎవరికైనా శిక్ష పడాల్సిందే. విశాఖలో గిరిజనుడిని నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేసినందుకు తీర్పు వెల్లడించిన మొదటి ఏడిసి జడ్జి యుగంధర్. ఎస్సై బీబీ గణేష్, ముగ్గురు కానిస్టేబుళ్ళకు జైలు శిక్ష,జరిమానా విధించారు. గిరిజన యువకుడిని అక్రమంగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి అకారణంగా చిత్రహింసలకు గురిచేసిన ఎస్సై బిబి గణేష్, కానిస్టేబుళ్లు ఏ గణేష్, టి సంతోష్ కుమార్, పివివి రామకృష్ణలకు కోర్టు ఏడాది జైలు శిక్ష, జరిమానాతో పాటు నష్టపరహరం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. నగర పోలీస్ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్న ఈ కేసు వివరాలలోకి వెళితే..నగరంలో నివాసం ఉంటున్న అధరశెట్టి చంద్రశేఖర్ అనే గిరిజన యువకుడిని 2013, అక్టోబర్ 6న రాత్రి 9 గంటల సమయంలో అప్పటి నాలుగో పట్టణ పిఎస్ ఎస్ఐ బి బి గణేష్, పైన పేర్కొన్న ముగ్గురు కానిస్టేబుళ్లు కలిసి అదుపులోకి తీసుకొని స్టేషనకి తరలించారు. అయితే చంద్రశేఖర్ పై ఎటువంటి ఫిర్యాదు, కేసు లేకుండా పోలీసులు మరుసటి రోజు వరకు లాకప్ లో ఉంచి చిత్ర హింసలకు గురి చేశారు. రెండు రోజులు కావస్తున్నా కుమారుడు ఇంటికి చేరకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి, చంద్రశేఖర్ చిన్నాన్న డాక్టర్ ఏ గోపాలరావుకు ఫోన్ చేసి, కుమారుడు ఇంటికి రాలేదని చెప్పాడు. దీంతో గోపాలరావు వాకబు చేయగా చంద్రశేఖర్ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. అయితే అప్పటికే చంద్రశేఖర్ ను పోలీసులు చిత్ర హింసలకు గురి చేయడంతో కాలుకు చేతులకు తీవ్ర గాయాలై, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు.
సీఎం జగన్ తో జయమంగళ వెంకటరమణ భేటీ
ఎన్నికల సమయం వచ్చేస్తోంది. వివిధ పార్టీల నుంచి వలసల ప్రస్థానం ప్రారంభం అయింది. సీఎం జగన్మోహన్ రెడ్డితో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకట రమణ భేటీ అయ్యారు. జయమంగళను వెంట పెట్టుకుని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు జయమంగళ. జయమంగళకు వైసీపీ ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ నెల 23వ తేదీన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు జయ మంగళ వెంకటరమణ. పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు జయ మంగళ. వడ్డెర సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తానని ఎన్నికల సందర్భంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. నాటి హామీ మేరకు జయమంగళకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తున్నారు. గత కొంతకాలంగా కైకలూరు రాజకీయాల్లో జయమంగళ వెంకటరమణ స్తబ్ధుగా ఉన్నారు. కార్యకర్తలతో భేటీ అనంతరం కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే జయమంగళ వెంకటరమణ పార్టీ మారడంపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. వ్య
అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు మరణ శాసనం
రాయలసీమలో అప్పర్ భద్ర ప్రాజెక్టు చిచ్చురేపుతోంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు మరణ శాసనం లాంటిది అన్నారు మాజీ ఎమ్మెల్యే,బీజేపీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నంద్యాలలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి పంగనామాలు కాదు రాయలసీమ అభివృద్ధి చెందాలన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. మూడు రాజధానులు పేరిట ఏపీ ప్రజలకు మూడు నామాలు పెడుతున్నారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. వివేకానంద రెడ్డి కేసులో ఇరుక్కొని వాటి వాసన కడుక్కోలేకపోతున్నారు. ఏపీ అభివృద్ధి కోసం పాటుపడకుండా మూడు ముక్కలాట రాజధానుల కోసం కృషి జగన్ తహతహలాడుతున్నాడన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే కేంద్ర నిర్ణయం తప్పు అన్నారు. మూడు రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టును నిర్మించాలనుకోవడం అన్యాయం అన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు మరణశాసనం లాంటిదే అని అభిప్రాయపడ్డారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అప్పర్ భద్రా ప్రాజెక్టును వెంటనే ఆపాలన్నారు రాజశేఖరరెడ్డి..రాజకీయాలు ముఖ్యం కాదు నాకు రాయలసీమ అభివృద్ది ముఖ్యం అన్నారు బైరెడ్డి రాజశేఖరరెడ్డి.
ఆప్ కు షాక్.. హజ్ కమిటీ ఛైర్మన్ గా కౌసర్ జహాన్
ఢిల్లీలో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ హజ్ కమిటీపై ఆప్ అధికారాన్ని కోల్పోయింది. హజ్ కమిటీ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన కౌసర్ జహాన్ విజయం సాధించారు. ఢిల్లీ చరిత్రలోనే ఓ మహిళ చైర్మన్ పదవిని చేపట్టడం ఇది రెండోసారి మాత్రమే. గత కొంత కాలంలో ఢిల్లీ హజ్ కమిటీపై ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేదని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ హజ్ కమిటీపై నియంత్రణ కోల్పోవడం ఇదే తొలిసారి. కౌసర్ జహాన్ కు ముందు ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ తాజ్దార్ బాబర్ ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న ఏకైక మహిళ. తాజాగా జరిగిన ఎన్నికల్లో సభ్యుల్లో మహ్మద్ సాజ్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ జహాన్ కు మద్దతుగా నిలిచారు. ‘‘ఢిల్లీ హజ్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన కౌసర్ జహాన్‌కు అభినందనలు.. ఢిల్లీ హజ్ కమిటీలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో దేశాభివృద్ధిలో ముస్లిం సమాజం కూడా భాగస్వామ్యమైందనే విషయం స్పష్టమైంది’’ అంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా ట్వీట్ చేశారు.
మాయ మాటలు, ఎలక్షన్ టైంలో డబ్బుల మూటలతో వొచ్చి గెలుస్తున్నడు కేసీఆర్
నల్గొండ హలియ మున్సిపాలిటీ అనుముల గ్రామంలో హాత్ సే హాత్ జొడో యాత్రలో మాజీ సీఎల్పీ నాయకుడు జానారెడ్డి పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది నేను… కేంద్రంలో మోదీ తెలంగాణాలో కేసీఆర్ పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. మాయ మాటలు, ఎలక్షన్ టైంలో డబ్బుల మూటల సంచులతో వొచ్చి గెలుస్తున్నడు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. దళితుల మూడెకరాల భూమి హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగు భృతి రైతు రుణమాఫీ ఏమైందని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలు మోసాలను ప్రజలకు వివరించేందుకు ఈ యాత్ర ఉద్దేశమని ఆయన వివరించారు. అధికారం లేకున్నా మీకు అండగా తోడుగా నిలుస్తున్నానని, అనుముల గ్రామంలో ప్రజాశక్తితో నేను చెక్ డ్యాం నిర్మిస్తానన్నారు. అనుముల గ్రామ ప్రజల దీవెనతో రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం నాకు దక్కిందని జానా రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆ విజయం దీనికి రాసి పెట్టి ఉంది: నాని
సుహాస్ హీరోగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. ఇటీవల చిన్న చిత్రంగా విడుదలైన ఇది పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే మహేశ్ బాబు, శివరాజ్ కుమార్, రవితేజ, రష్మిక మందణ్ణ తదితరులు చిత్ర యూనిట్ ను అభినందించారు. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా వీరికి తన శుభాకాంక్షలు తెలియచేశాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ”సుహాస్ నా ఫేవరేట్ యాక్టర్. ఈ విషయం ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. స్క్రీన్ మీద వుంటే తన పెర్ ఫార్మెన్స్ అలా చూస్తూ వెళ్లిపోవచ్చు. ‘రైటర్ పద్మ భూషణ్’ సినిమా ఎంతో గొప్పగా ఆడుతోంది. ఎంతోమంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. న్యూ ఏజ్ సినిమాకి సపోర్ట్ చేస్తున్న టీం అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సుహాస్ కి అభినందనలు. ‘కలర్ ఫోటో’ కూడా థియేటర్ లో వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యిండేది. కానీ అది ‘రైటర్ పద్మభూషణ్’కి రాసి పెట్టినట్లు ఉంది. శరత్, అనురాగ్… నేను ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి సినిమాలు తీయాలని…
రాణించిన టెక్ మహింద్రా. 61,682కి సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇవాళ గురువారం కూడా ఆశాజనకమైన పరిస్థితి కనిపించింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం సైతం స్వల్ప లాభాలతో ముగిశాయి. వీక్లీ నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్ ఫ్లాట్‌గా ఎండ్ అయింది. మధ్యాహ్నం జరిగిన డీల్స్ మాత్రం మంచి లాభాలను తెచ్చిపెట్టాయి.ఈ రోజు.. సెన్సెక్స్.. క్యాలెండర్ ఇయర్‌లోనే అత్యధిక విలువ అయిన 61 వేల 682 పాయింట్లకు చేరుకోవటం విశేషం. ఐటీ మరియు ఫైనాన్షియల్ షేర్లు బాగా రాణించాయి. బ్రాడర్ ఇండెక్స్‌లు కూడా ఔట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. సెన్సెక్స్.. 44 పాయింట్లు పెరిగి 61 వేల 319 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. 20 పాయింట్లు లాభపడి 18 వేల 35 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 18 కంపెనీలు నష్టాల బాటలో నడవగా మిగిలిన 12 సంస్థలు లాభాలు పొందగలిగాయి. టెక్ మహింద్రా కంపెనీ షేర్లు 5 శాతం ర్యాలీ తీశాయి. ఎల్‌టీటీఎస్ స్టాక్స్ కూడా మంచి పనితీరు కనబరిచాయి. అన్ని సెక్టార్ల స్టాక్స్ పాజిటివ్‌గానే ట్రేడయ్యాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల షేర్లు ఒకటిన్నర శాతానికి ప్రాఫిట్స్ సాధించాయి.
మరింత ఎక్కువ రేంజ్‌తో బజాజ్ చెతక్ ఈ-స్కూటర్
పాపులర్ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ నుంచి చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు త్వరలోనే అప్‍డేటెడ్ వెర్షన్ రానుంది. కొత్త వెర్షన్-2023 చెతక్ స్కూటర్ మరింత ఎక్కువ రేంజ్‍ను ఇవ్వనుందని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న దాని కంటే సుమారు 20 శాతం ఎక్కువ రేంజ్‍ను కలిగి ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 108 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా బజాజ్ చెతక్ కొత్త వెర్షన్ రేంజ్ ఉండనుంది. 2.88 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీ ఉన్న ప్రస్తుత మోడల్ 90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. బజాజ్ చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్‍కు సంబంధించిన ఆర్టీవో డాక్యుమెంట్లు కూడా బయటికి వచ్చాయి. పూర్తి వివరాలు ఇవే.. బజాజ్ చెతక్ అప్‍డేటెడ్ వెర్షన్ కూడా 2.88 kWh బ్యాటరీనే కలిగి ఉంటుంది. అయితే సాఫ్ట్‌వేర్ మార్పుల కారణంగా ప్రస్తుత మోడల్ కంటే అదనంగా 20 శాతం ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. మొత్తంగా నయా వెర్షన్ 108 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని ఆర్టీవో డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. అయితే మోటార్ ఔట్‍పుట్ మాత్రం ప్రస్తుతం ఉన్న మోడల్‍లాగే ఉంటుందని సమాచారం. ఈ స్కూటర్ మోటర్ 4kW పవర్‌ను కలిగి ఉంటుంది.
