NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

ఆ జిల్లాల్లో పిడుగులు, భారీవర్షాలు పడే అవకాశం

అసలే ఎండలు మండిపోయి, రోళ్ళు కూడా బద్ధలు అయ్యే సమయం.. కానీ అకాలవర్షాలు, పిడుగులు పడుతూ వానాకాలాన్ని తలపిస్తోంది వాతావరణం. ఏపీలో వాతావరణ పరిస్థితులు, పిడుగులు పడే అవకాశం గురించి ఏపీ విపత్తుల నిర్వహణ తాజా ప్రకటన విడుదల చేసింది. దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల నాటికి గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలో 79మి.మీ అధికవర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
రానున్న మూడు రోజుల వాతావరణ వివరాలు ఏంటంటే?
బుధవారం:- శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగుల కూడి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

సీఎం జగన్ భరోసా.. బాలినేని అలక వీడతారా?

వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ కాకరేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. గత కొంతకాలంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలినేనితో సీఎం జగన్ బుజ్జగింపు ధోరణితో మాట్లాడారు. గత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో బాలినేని మంత్రి పదవిని కోల్పోయారు. ఇటీవల ఆయన వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి కూడా రాజీనామా చేశారు. బాలినేని ఇప్పటివరకు నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పార్టీపై అలక కారణంగానే ఆయన ఈ పదవి నుంచి వైదొలిగారంటూ కథనాలు వచ్చాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ బాలినేని గత కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల రాజీనామా తర్వాత తాడేపల్లి రావాలని పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినా ఆయన స్పందించలేదని తెలిసింది. బాలినేని గత మూడ్రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. అయితే, సీఎం జగన్ నుంచి పిలుపు రావడంతో ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయన పార్టీ వ్యతిరేకులతో తిరుగుతున్నారని, బాలినేనిపై ఫిర్యాదులు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు బాలినేని గురించి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది.

రజనీకాంత్ కు మేమెందుకు క్షమాపణ చెప్పాలి?

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల విమర్శలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ ముఖ్య అతిథిగా హాజరయిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్టీఆర్ గురించి పనిలో పనిగా చంద్రబాబు విజనరీ గురించి మాట్లాడారు. ఈ వ్యవహారం కాస్త వివాదంగా మారింది. రజనీకాంత్ పై వైసీపీ నేతలు మండిపడ్డారు. రజనీకాంత్ ని చెడామడా తిట్టేశారు. రజనీకాంత్ కి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి అమర్నాథ్ కామెంట్ చేశారు. అసలు రజనీకాంత్ కు మేమెందుకు క్షమాపణ చెప్పాలన్నారు.చంద్రబాబు గురించి రజనీకాంత్ చెప్పిన అవాస్తవాలనే మేం వ్యతిరేకించామ్….సినిమాల్లో మాదిరిగా ఎవరినైనా ఏమైనా అంటాం అంటే సమాజంలో కౌంటర్ ఫేస్ చేయవలిసిందే…..దొంగ,హంతకుడు పెట్టిన సభకు వచ్చి పొగడ్తలు కురిపిస్తే చూస్తూ ఊరు కోవాలా…..? సినిమాల్లో మాత్రమే రజనీకాంత్ సూపర్ స్టార్…..ఒక సారి చెబితే వంద సార్లు చెప్పినట్టు ఫీల్ అవ్వడానికి రాజకీయాలు సినిమా కాదు….ఈ విషయం అర్థం అయ్యే పార్టీ విషయంలో రజనీకాంత్ వెనక్కి తగ్గారు అనుకుంటున్నా అన్నారు మంత్రి అమర్నాథ్. వెన్నుపోటులో కుట్రదారుడు చంద్రబాబు…. ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రాగా మార్చిన చరిత్ర టీడీపీదే అన్నారు.

మే 6 నాటికి బంగాళాఖాతంలో వాయుగుండం.. ఐఎండీ రిపోర్ట్..

భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. మే 6 వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో మరో 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐఎండీ మంగళవారం తెలిపింది. యూఎస్ వెదర్ ఫోర్‌కాస్ట్ మోడల్ గ్లోబర్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్(GFS), యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రెంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ECMWF) బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని తర్వాత ఐఎండీ కూడా తాజా నివేదికలో వాయుగుండం ఏర్పడుతుందని వెల్లడించింది. అయితే కొన్ని మోడల్స్ ప్రకారం తుఫాన్ ఏర్పడుతుందని అంచానా వేస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను గమనిస్తున్నామని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. మే మొదటి అర్థభాగంలో ఉష్ణమండల తుఫాన్ వచ్చే అవకాశం తక్కువ అని స్కైమేట్ వెదర్ తెలిపింది. ఏప్రిల్ నెలలో భారత సముద్రాల్లో తుఫాన్ ఏర్పడలేదు. వరసగా నాలుగో ఏడాది కూడా ఏప్రిల్ నెలలో తుఫానులు ఏర్పడలేదు.

పోకర్ ఇల్లీగని తెలీదు.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నా

థాయ్‌లాండ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జూదం ఆడుతూ.. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే! ఈ గ్యాంబ్లింగ్ విషయం తెలిసి మే 1వ తేదీన చౌనబురి ప్రావిన్స్ పోలీసులు ఆ సెంటర్‌పై దాడులు నిర్వహించి.. ప్రవీణ్ సహా చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ కేసులో థాయ్‌లాండ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 4500 బాట్స్ జరిమానాతో చికోటి ప్రవీణ్ సహా 83 మంది భారతీయులకు బెయిల్ ఇచ్చింది. అయితే.. జరిమానా కట్టేవరకు పాస్‌పోర్టులు ఇవ్వొద్దని చెప్పింది. గంట గ్యాప్‌లోనే ఫైన్ చెల్లించడంతో.. పోలీసులు వారికి పాస్ట్‌పోర్టులు ఇచ్చి విడుదల చేశారు.ఈ వ్యవహారంపై చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ నిషేధమని తనకు తెలియనది తెలిపాడు. తాను హాల్‌లోకి వెళ్లిన 10 నిమిషాలకే పోలీసులు దాడులు నిర్వహించారని అన్నాడు. అయితే.. తాను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని, బయటపడ్డానని చెప్పాడు. తాను ఈ గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్‌ని కాదని, అసలు తన పేరు ఎక్కడా లేదని స్పష్టం చేశాడు.

అనుమతి లేకుండా స్టిక్కర్లు .. తాడపత్రిలో టీడీపీ నేతలకు చుక్కెదురు..

ఎన్నికల సీజన్ వచ్చేస్తోంది. ప్రతి పార్టీ జనంలోకి వెళ్లాలని భావిస్తోంది. ఒకవైపు అధికార వైసీపీ నేతలు తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల గురించి పీపుల్స్ సర్వే చేపడుతున్నారు. జగనన్నే మా భవిష్యత్ అంటూ ఇంటింటికీ, గడప గడపకూ తిరిగి ప్రచారం చేస్తున్నారు. జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఈ మెగా మాస్ సర్వేకి అనూహ్య స్పందన లభించింది. ఇటు టీడీపీ నేతలు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల దృష్టికి తెస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి అంటూ సభలు పెడుతున్నారు. జగన్ స్టిక్కర్లను చూసి అదే తరహాలో ప్రచారానికి తెరతీశారు టీడీపీ నేతలు. అయితే అక్కడే రివర్స్ కొట్టింది వ్యవహారం. తాడిపత్రిలో జగన్ స్టిక్కర్ల తరహాలో టీడీపీ నేతలు స్టిక్కర్ల యుద్ధానికి దిగారు. అయితే వారికి స్థానికులు, ఇంటి యజమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అనుమతి లేకుండా స్టిక్కర్లు అంటించడంపై స్థానికుల నుంచి టీడీపీకి వ్యతిరేకత వచ్చింది. స్థానికులు ఆగ్రహించడంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గక తప్పలేదు.

టీడీపీ పుట్టుక నుంచి కాపు వ్యతిరేక పార్టీయే

ఏపీలో రాజకీయ విమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా మంత్రి అంబటి రాంబాబు టీడీపీ, జనసేనలపై ఒకస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపుల్ని బీసీల్లో చేర్చాలనే డిమాండ్ తో ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో ఉద్యమం జరిగిందన్నారు. అప్పుడు జరిగిన ఘటనలో తునిలో రైతు దగ్దం అయ్యింది. అప్పుడు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా కాపుల పై కేసులు కూడా పెట్టారు. ఆ కేసు విచారణ అనంతరం నేరాన్ని నిరూపించ లేకపోయారు అనే కారణంతో కోర్టు కేసు కొట్టేశారు. ఇది హర్షించదగ్గ పరిణామం.. రైలు దగ్దంలో దాడిశెట్టి రాజా, ముద్రగడ వంటి చాలా మంది పై రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబు కేసులు పెట్టారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కాపు వ్యతిరేక పార్టీ. కాపు నేత వంగవీటి మోహన రంగాను చంద్రబాబు ప్రోద్బలంతోనే హత్య చేశారు. హరిరామజోగయ్య స్వయంగా చెప్పారు. అప్పుడు జరిగిన ఘటనల్లో కూడా కాపులపై కేసులు పెట్టారు. నా పై కూడా కేసు పెట్టారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపుల పై పెట్టిన కేసులు కొట్టేశారు.. నిరాహార దీక్ష చేస్తానన్న ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను చిత్రవధ చేశారు. అప్పుడు కాపుల పై అక్రమంగా పెట్టిన 69 కేసులను జగన్ కొట్టేశారుచంద్రబాబు కాపుల పాలిట ఒక సైకో లా వ్యవహరించాడు. పవన్ కళ్యాణ్ కు చరిత్ర తెలియదు..

చనిపోయేముందు మానవ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

సైన్స్ అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నా ఇప్పటికి మనిషి మెదడు, శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంది. మానవ మెదడుకు సంబంధించి అనేక ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఇప్పటీకి ఎంత తెలుసుకున్నా.. చాలా సమాచారం అసంపూర్తిగా మిగులుతూ ఉంటోంది. అయితే చనిపోతున్న సమయంలో మానవ మెదడు ఏవిధంగా ప్రవర్తిస్తుందనే విషయంపై తాజాగా అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.మరణానికి చేరువలో కోమాలో ఉన్న నలుగురు వ్యక్తుల బ్రెయిన్స్ పై పరిశోధకులు అధ్యయనం చేశారు. అయితే అనూహ్యంగా మరణానికి ముందు మానవ మెదడు యాక్టవిటీ పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ సమయంలో మనిషి మెదడు పనితీరు మిస్టరీగా ఉందని వెల్లడించారు. వీరి బ్రెయిన్ పనితీరును ECG, EEG సంకేతాలతో విశ్లేషించారు. చాలా ఏళ్లుగా మనిషి చనిపోయే ముందు మానవ మెదడు ఎలా ప్రవర్తిస్తుందో అని పరిశోధన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. చనిపోయే ముందు ఇద్దరిలో ‘గామా వేవ్స్’ పెరిగినట్లు తేలింది. ఇవి కార్డియార్ అరెస్ట్ (గుండె విఫలం) అయిన సందర్భంలో చూస్తుంటామని పరిశోధకులు తెలిపారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొత్త అవతారం.. తట్టుకోవడం కష్టమే

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ నేమ్ గా మారింది. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినిమా రంగ ప్రవేశం చేసిన ఈ హీరోయిన్, మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. ఆ సినిమా విజయం సాధించడంతో తెలుగులో ఆమెకు భారీ అవకాశాలు వచ్చాయి. దేవదాస్, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో రష్మిక మందన్న తనకంటూ స్పెషల్ క్రేజ్ ని యూత్ లో సొంతం చేసుకుంది.ఇక పుష్ప ది రైజ్ సినిమాలో చేసిన ‘శ్రీవల్లి’ పాత్ర రష్మికకి హ్యూజ్ అప్లాజ్ తెచ్చి పెట్టింది. ఈ మూవీ తర్వాత రష్మిక స్ట్రెయిట్ హిందీ సినిమాలు కూడా చేసేస్తోంది. తమిళ్ లో మొదటి సినిమాకే దళపతి విజయ్ తోనే నటించే ఛాన్స్ కొట్టేసింది అంటే రష్మిక క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న యానిమల్‌ సినిమాలో తన పోర్షన్‌ను కంప్లీట్ చేసుకోని పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. పుష్ప ది రైజ్ సినిమా తర్వాత చాలా బ్రాండ్స్ తో కోలాబ్ అయిన నేషనల్ క్రష్, ఇండియాలోని జపనీస్ దుస్తుల బ్రాండ్ ‘ఒనిట్సుకా టైగర్‌’కి ఫేస్ అయ్యింది.