NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్థేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి బంతికి 3 పరుగులు కావాల్సి ఉండగా సికిందర్ రజా మూడు పరుగులు తీయడంతో పంజాబ్ కింగ్స్ విజయం సొంతమైంది.పంజాబ్ భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ కు లియామ్ లివింగ్ స్టోన్ ( 24 బంతుల్లో 40: 1 ఫోర్, 3 సిక్సర్లు). ప్రభు సిమ్రన్ సింగ్ ( 24 బంతుల్లో 42: 4 ఫోర్లు, 2 సిక్సర్లు ), పాటు జితేశ్ శర్మ ( 10బంతుల్లో 21, 2 ఫోర్లు, 1 సిక్స్ ), సికందర్ రజా ( 7 బంతుల్లో 13 నాటౌట్, 1 ఫోర్ ), వీరోచితంగా పోరాడి విజయాన్ని అందించారు. ఈ విజయంతో పంజాబ్ ఆర్సీబీని వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.201 లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో ధాటిగానే పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ ( 15 బంతుల్లో28, 4 ఫోర్లు, సిక్స్ ), ప్రభు సిమ్రన్ సింగ్ ( 24 బంతుల్లో 42: 4 ఫోర్లు, 2 సిక్సర్లు ) తొలి వికెట్ కు 4.2 ఓవర్లలోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక పంజాబ్ విజయానికి చివరి 3 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. పతిరణ వేసిన 18వ ఓవర్లో ఫస్ట బాల్ కు సామ్ కర్రన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఓవర్ లో 9 పరుగులొచ్చాయి. తుషార్ వేసిన 19వ ఓవర్ లో నాలుగో బాల్ కు సామ్ కర్రన్ ఔట్ అయ్యాడు.

రాబోయే రెండు రోజులు.. ఏపీలో పిడుగులతో కూడిన భారీవర్షాలు

తెలుగు రాష్ట్రాలు వర్షాలతో అల్లాడిపోతున్నాయి. మండు వేసవిలో అకాల వర్షాలు, పిడుగులు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. ఐఎండి అంచనా ప్రకారం తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ మరియు కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి డా. బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సోమవారం కోనసీమ,పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం,కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపుల వర్షంతో కూడి “పిడుగులు” పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని రైతులు, కూలీలు,గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ప్రకాశం జిల్లా దర్శిలో వర్షాలు కురిశాయి.

రాహుల్ గాంధీ బుల్లెట్ దాడులకు కూడా భయపడటం లేదు

కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారని ఇటీవల ప్రధాని మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రజాజీవితంలో ఉన్న వాళ్లు ఇలాంటి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం కోసం బుల్లెట్ దాడులకు కూడా భయపడటం లేదని, ఆయనను చూసి నేర్చుకోవాలని ప్రియాంకాగాంధీ, ప్రధాని మోడీకి సూచించారు. ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మోడీని విషసర్పంతో పోలుస్తూ విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తనపై కాంగ్రెస్ నేతలు 91 సార్లు దూషణలకు పాల్పడ్డారని అన్నారు. ఈ రోజు కర్ణాటకలో ని బాగల్ కోట్ జిల్లాలో జరిగి బహిరంగ సభలో ప్రియాంకాగాంధీ మాట్లాడారు. మీకు జరిగిన దూషణలు కేవలం ఒక పేజీలో సరిపోతాయని, మీరు నా కుటుంబం పట్ల ప్రవర్తించిన తీరుకు ఒక పుస్తకమే నిండుతుందని ఆమె అన్నారు. గత రెండు మూడు రోజుల నుంచి ప్రధాని నరేంద్రమోడీని చూస్తే వింతగా ఉందని, నేను చాలా మంది ప్రధానులను చూశాను, ఇందిరాగాంధీ దేశం కోసం బుల్లెట్ గాయాలను తీసుకుంది, రాజీవ్ గాంధీ తన ప్రాణాలు అర్పించారు, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ దేశం కోసం కష్టపడ్డారు, కానీ మోడీ లాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదని ప్రియాంకాగాంధీ అన్నారు.

అంబేద్కర్ ఆశయాలు కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నా

9 సంవత్సరాల తర్వాత రాజభవనం లాంటి సెక్రటేరియట్ కట్టుకోని.. ఈరోజు కుర్చీలో కూర్చొని సంతకం చేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. ఇవాళ యాదాద్రి జిల్లా మోత్కూర్ పరిధి కొండగడపలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పేరుకు 1000 కోట్లు అంటున్నాడు.. 3వేల కోట్లతో రాజభవనం కట్టుకున్నాడని ఆయన ధ్వజమెత్తారు. నీకు రెండు చేతులతో దండం పెడుతున్న కేసీఆర్‌.. మంచి భవనం కూలగొట్టి సెక్రటేరియట్ కట్టుకున్నావ్ నంతోషమన్నారు. ఊర్లల్లో డబుల్ బెడ్ రూమ్ లు, పిల్లలకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా సెక్రటేరియట్ మాత్రం కట్టుకున్నావ్.. సెక్రటేరియట్ కి అంబెడ్కర్ పేరు పెట్టుకున్నావ్ సంతోషం…అంబేద్కర్ గారి ఆశయాలు అయిన అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తావని ఆశిస్తున్నా… ఇప్పటికైనా నువ్వు వాస్తు ప్రకారం కట్టుకున్న సెక్రటేరియట్ కి రోజు వస్తావని ఆశిస్తున్నాము….’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇప్పటికైనా వాస్తు ప్రకారం కట్టుకున్న సెక్రటేరియట్‌కి రోజు రావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

మంత్రి అప్పలరాజు మైనింగ్ దోపిడీ ఆపాలి

ఏపీలో మైనింగ్, ఇసుక దోపిడీ మితిమీరిపోయిందని మండిపడ్డారు టీడీపీ నేత కూన రవికుమార్. శ్రీకాకుళంలో టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ మాట్లాడారు. సీదిరి అప్పల రాజు ఆధ్వర్యంలో మైనింగ్ దోపిడి.. స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మాన ఆద్వర్యంలో ఇసుక దోపిడి జరుగుతోంది. కలియుగ రావణాసురుడు మన సీఎం జగన్. రావణాసురుడికి పది తల ల్లో ఉన్న అహంకారం… జగన్ ఒక్క తలలోనే ఉంది. జగన్ క్రైం లు అన్నీ తన చుట్టూ ఉన్న వారితో చేయిస్తారు తన చేతికి మట్టి అంటకుండా అన్నారు కూన రవి. జగన్ టెక్నికల్ క్రిమినల్. తండ్రి మరణాన్ని వాడుకుని ఓదార్పుయాత్ర చేసారు.. శవరాజకీయాలు చేయడంలో దిట్ట జగన్ అన్నారు. గొడ్డలిపోటు ను గుండె పాటుగా మార్చారు ,చంద్రబాబు పై బురద జల్లారు. వివేక హత్యలో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలస్ వైపే చూపిస్తున్నాయి. 400 క్రిమినల్ కేసులు వైసిపి ఏమ్మేల్సి, ఎమ్మెల్యే ల పై ఉన్నాయి ..500 కోట్ల ఆస్తులుండి నిరుపేదను అంటాడు జగన్.. దేశంలోని మంత్రులు, గవర్నర్ లు, ముఖ్యమంత్రులు ఆస్తులు అన్ని కలిపినా జగన్ ఆస్తిలో మూడవ వంతు లేదన్నారు కూన రవి కుమార్.

ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో మాట్లాడిన చంద్రబాబు

చిట్ ఫండ్ వ్యవహారంలో సీఐడీ అదుపులో ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ వ్యవహారం అట్టుడికిపోతోంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు ఆమెకు ధైర్యం చెప్పారు. ఆదిరెడ్డి ఫ్యామిలీకి పార్టీ అండగా ఉంటుందన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో రోజు రోజుకూ వైసీపీ ప్రభుత్వ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు పెరుగుతున్నాయి.ప్రత్యర్థులను ఓడించడానికి పాలనను నమ్ముకోవాల్సిన ప్రభుత్వం.. అక్రమ కేసులను, అరెస్టులను మాత్రమే నమ్ముకుంది.తాజాగా రాజమండ్రిలో పార్టీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ అరెస్టులే దీనికి సాక్ష్యం.గ్రామాల్లో ఉన్న తెలుగు దేశం కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరినీ కేసులతో, దాడులతో భయపెట్టి లొంగదీసుకోవాలనే దుష్ట ఆలోచనలు మానుకోవాలి.సీఐడీ అనేది దర్యాప్తు ఏజెన్సీనా..? లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా..?సీఐడీ పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులపై ఇప్పటికే అనేక సార్లు కోర్టులతో చీవాట్లు తిన్నా ప్రభుత్వ బుద్ది మారలేదు.సీఎం జగన్ విషపు రాజకీయ ఆలోచనలకు ఈ అరెస్టులే నిదర్శనం.రాష్ట్రంలో ఎవరూ ఏ వ్యాపారం చేసుకోకూడదు అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు చంద్రబాబు.

ప్రయాణికులతో ఆగిన బస్.. తోసిన పాసింజర్స్

ప్రయాణిస్తున్న బస్సు ఆగిపోయి మొరాయిస్టే మామూలుగా జనం ఏం పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. అయితే మరి కొందరు మాత్రం డ్రైవర్ కు సహయంగా బస్సును తోస్తుంటారు. అయితే ఎప్పుడూ బిజీగా ఉండే ముంబయి నగరంలో ఇక ఉద్యోగాలకు వెళ్లే టైంలో మరింత హడావిడి కనిపిస్తుంది. అలాంటి టైంలో ఓ ఫ్లై ఓవర్ మీద బస్సు ట్రబుల్ ఇచ్చి నిలిచిపోయింది. పనులకు, ఉద్యోగాలకు వెళ్లే టైంలో బస్సు మొరియిస్తే జనం ఒక్క క్షణం నిలబడకుండా.. అక్కడ నుంచి తిట్టుకుంటూ వేరే బస్సు కోసం పరుగులు తీస్తారు.కానీ ఇక్కడ అలా జరగలేదు. బస్సు దిగిన ప్రయాణికులంతా కలిసి బస్సును నెడుతూ డ్రైవర్ కి సాయం అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా విలువైన సమయం.. అయినా కూడా సమయం పక్కనపెట్టి ఒకరికొకరు ఎంత సాయం చేసుకున్నామనేది ముఖ్యం అనే టైటిల్ తో ఈ వీడియోను ఫస్ట్ @medohh777 ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశాడు. ఆ వీడియోను ముంబయి పోలీసులు ముంబయి మూమెంట్స్.. ముంబయి బలం ముంబైకర్లే.. మా పోలీస్ స్నేహితుడు అక్కడివారితో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ వీడియోను షేర్ చేశారు

టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పోటీచేస్తాయి

ఏపీలో ఎన్నికలకు ముందే పొత్తుల గురించి ప్రస్తావన హాట్ టాపిక్ అవుతోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుని ఆయన నివాసంలో కలిశారు జనసేనాని పవన్ కళ్యాణ్. తాజాగా బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా జమ్మలమడుగు లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా, భాజపా, జనసేన మూడు పార్టీలు కలిసి పనిచేయనున్నాయని మాజీ మంత్రి భాజపా ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా జమ్మలమడుగు లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం తర్వాత ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి, జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

అఖిల్ కు ఆదోషం ఉంది.. వేణుస్వామి సంచలన కామెంట్స్

సాధారణంగా ఎవరికైనా అనుకున్న పని అవ్వకపోయినా, జీవితంలో సక్సెస్ అందకపోయినా జాతకాలు బాగోలేదని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్నవారు ఈ జాతకాలను ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఇక టాలీవుడ్ జాతకాలు అంటే టక్కున వేణుస్వామి గుర్తుకువస్తారు. సెలబ్రటీల జాతకాలు చెప్పడం, ఏమైనా దోషాలు ఉంటే వారితో యాగాలు చేయిస్తూ ఉంటాడు. ఆయన చెప్పేవి అంతకుముందు ఎవరు నమ్మేవారు కాదు. అయితే ఎప్పుడైతే సమంత, నయనతార విషయంలో ఆయన చెప్పింది చెప్పినట్లుజరగడంతో అందరు వేణు స్వామిని నమ్మడం మొదలుపెట్టారు. రష్మిక, నిధి అగర్వాల్ అయితే ఏకంగా దోషాలుఉన్నాయని యాగాలు కూడా జరిపించుకున్నారు. వీరి గురించే కాదు.. ప్రభాస్,ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ గురించి కూడా వేణు స్వామి సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా అక్కినేని వారసుడు అఖిల్ ఫెయిల్యూర్స్ వెనుక కారణం చెప్పుకొచ్చాడు వేణు స్వామి. అతడి జాతకంలో దోషం ఉండడం వలనే అతడికి ప్లాప్స్ వస్తున్నాయని వేణు స్వామి చెప్పుకొచ్చాడు.