రెండో ప్రపంచయుద్ధంలో 864మందితో మునిగిన రవాణా నౌక
రెండు ప్రపంచ యుద్ధాలు ఎంత నష్టాన్ని మిగిల్చాయే అందరికి తెలిసిందే. ప్రపంచ యుద్ధాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాల పాలయ్యారు.చాలా మంది సైనికులు కనిపించకుండా పోయారు. కొని వార్ షిప్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌లు కనిపించకుండా పోయాయి. రెండో ప్రపంచ యుద్ధంలో ఇదే జరిగింది. 864 మంది సైనికులతో మునిగిపోయిన రెండవ ప్రపంచ యుద్ధం నౌక 84 సంవత్సరాల తర్వాత కనుగొనబడింది. 1942 జూలైలో ఫిలిప్పీన్స్ తీరంలో ఆ ఓడ మునిగిపోయినట్లు తెలిసింది. రెండో ప్రపంచ యుద్ధంలో 864 మంది ఆస్ట్రేలియన్ సైనికులతో మునిగిపోయిన జపాన్ వాణిజ్య నౌకను దక్షిణ చైనా సముద్రంలో లోతైన సముద్ర సర్వే నిపుణులు కనుగొన్నట్లు ఇండిపెండెంట్‌లో ఓ నివేదిక ప్రకారం తెలిసింది. జూలై 1942లో ఫిలిప్పీన్స్ తీరంలో మునిగిపోయినప్పటి నుంచి తప్పిపోయిన యుద్ధ ఖైదీల రహస్య రవాణా నౌక ‘ఎస్‌ఎస్ మాంటెవీడియో మారు’ లుజోన్ ద్వీపానికి వాయువ్యంగా కనుగొనబడిందని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ శనివారం ప్రకటించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా రికార్డుకెక్కింది. సముద్రం మధ్యలో ఉన్న సమయంలో ఈ నౌకపై దాడి జరిగింని.. వెంటనే అది సముద్రంలో మునిగిపోయిందని ఆస్ట్రేలియా సర్కారు తెలిపింది
కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో వైసీపీని తరిమికొడదాం
కృష్ణాజిల్లా గన్నవరంలో ప్రజావ్యతిరేక, నిరంకుశ,మతోన్మాద బిజెపిని సాగనంపుదాం- దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో సిపిఐ-సిపిఐ ప్రచార భేరి బహిరంగ సభ నిర్వహించింది. హాజరైన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..రాఘవులు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పాలనపై మండిపడ్డారు. దేశంలో బిజేపి కేంద్రంలో, ఇక్కడ వైసిపి పాలన చేస్తుంది..దేశం చాలా ప్రమాదకరమైన పరిస్దితిలో ఉంది, రాష్ట్రంలోను పరిస్థితి బాగోలేదు..దేశంలో బిజేపి బలంగా ఉంది, కేంద్రంలో అధికారంలో బిజేపి ఉంది..మరోసారి అధికారంలోకి రావాలని బిజేపి చూస్తుంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న విమానాశ్రయాలు ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది..విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ – ఆంద్రుల హక్కు అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు సంస్థలకు అమ్మాలని మోడి చూస్తున్నాడు..రాష్ట్రంలో ప్రభుత్వాలకు అడిగే హక్కు లేదు.. వారి చుట్టు తిరిగి మేతుకులు తేచ్చుకుంటుంది..కేంద్రంపై ఆనాడు ఎన్టీఆర్ ఎదురు తిరిగినందుకు సిఎం నుండి తప్పించారు.. నేడు వైసిపి కేంద్రం కాళ్లు మొక్కుతుంది..రైల్వే స్టేషన్లు, పరిశ్రమలు, విమానాశ్రయాలు అమ్మాలని మోడి చూస్తున్నాడు..విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నాడు..రాష్ట్రంలో మత్తు పదార్దాల నుండి దూరంగా ఉండాలని ప్రచారాలు చేస్తున్నారు ఉద్యోగాలు లేకపోతే యువత అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడుతున్నారు..వైఎస్ వివేకానందా బ్రతికినపుడు పాపులర్ కాలేదు చణిపోయాకా ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాడు..
తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం.. చైనాతో భారత్ చర్చలు
తూర్పు లడఖ్‌లో మూడేళ్లుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్, చైనాలు ఆదివారం (నేడు) తూర్పు లడఖ్ సెక్టార్‌లోని చుషుల్-మోల్డో సమావేశ స్థలంలో 18వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలను నిర్వహిస్తున్నాయి. భారత్ వైపు నుంచి ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. చైనా వైపు నుంచి సమానమైన ర్యాంక్ అధికారి ఈ రోజు తూర్పు లడఖ్ సెక్టార్‌లో జరుగుతున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఐదు నెలల విరామం తర్వాత ఈ సమావేశం జరుగుతోంది. కార్ప్స్ కమాండర్ స్థాయిలో ఇరుపక్షాల మధ్య చివరి సమావేశం గతేడాది డిసెంబర్‌లో జరిగింది. ఇరు పక్షాలు తమ తమ స్థానాలను పటిష్టం చేసుకునేందుకు సరిహద్దు ప్రాంతాల వెంబడి వేగవంతమైన నిర్మాణ కార్యకలాపాల్లో నిమగ్నమైనప్పుడు ఈ సమావేశం జరుగుతోంది.దేప్‌సాంగ్ మైదానాలు, డెమ్‌చోక్, ఇరువైపులా బలగాల ఉపసంహరణ అంశాన్ని భారత్ సమావేశంలో లేవనెత్తింది. గతంలో కూడా ఈ అంశాన్నే లేవనెత్తింది. వాస్తవానికి 2020లో కరోనా సమయంలో చైనా నుంచి వాస్తవ నియంత్రణ రేఖ, వాస్తవ రేఖపై యథాతథ స్థితిని మార్చేందుకు భారీ ఆయుధాలు, పెద్ద సంఖ్యలో సైనికులను దూకుడుగా తరలించిన తర్వాత సమస్యలను పరిష్కరించడానికి తూర్పు లడఖ్ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చలు ప్రారంభించాయి. పలు దఫాల చర్చల అనంతరం ఇరు దేశాలు వెనక్కి తగ్గేందుకు అంగీకరించాయి. రెండు దేశాల సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఇంకా చాలా విషయాలకు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. నేటి చర్చల్లో కూడా ఇరు దేశాలు సమస్యల పరిష్కారానికి సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించాలని నిర్ణయించాయి. అపరిష్కృతంగా ఉన్న మిగతా సమస్యలను వీలైనంత త్వరగా ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేసేందుకు అంగీకరించాయి.
మంత్రి సురేష్ ని బర్తరఫ్ చేయాలి
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపై అటు టీడీపీ, జనసేన, బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతలు కూడా విరుచుకుపడుతున్నారు. మంత్రి యర్రగొండపాలెంలో వ్యవహరించిన తీరుని మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి తప్పుబట్టారు.
రోడ్డు మార్గాన కాకుండా వీర జవాన్లను వాయు మార్గాన తరలించేందుకు విమానాలు సమకూర్చి ఉంటే 2019లో పుల్వామా దుర్ఘటనలో 40 మంది జవాన్లు చనిపోయి ఉండేవారు కాదని చెప్పినందుకు నాటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ పై మోడీ ప్రభుత్వం కక్ష సాధించడం శోచనీయం అన్నారు డాక్టర్ ఎన్. తులసి రెడ్డి. ఎన్నికల్లో లబ్ధి కోసం జవాన్ల ప్రాణాలను బలి పెట్టడం దుర్మార్గం. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ నేతలు దాడులు చేయడం గర్హనీయం. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ రోడ్డుమీద చొక్కా విప్పి వీధి రౌడీలా ప్రవర్తించడం సిగ్గుచేటు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే శాంతి భద్రతల సమస్యలను సృష్టించడం దురదృష్టకరం అన్నారు తులసిరెడ్డి. మంత్రి వర్గం నుండి మంత్రి ఆది మూలపు సురేష్ ను ముఖ్యమంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
అమ్మకానికి ఐలాండ్.. ధర ఎంతో తెలుసా?
స్కాట్లాండ్ తీరంలోని జనావాసాలు లేని ద్వీపం అమ్మకానికి ఉది. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బార్లోకో ద్వీపం డంప్రైస్ పట్టణానికి దాదాపు ఆరు మైళ్ల దూరంలో ఉంది. ఈ ద్వీపంలో చెరువుతో పాటు గులకరాయి బీచ్ కూడా ఉంది. దీనికి కాలినడకన కూడా చేరుకోవచ్చు. తక్కువ ఆటు పోట్లు ఉండడం వల్ల ఇక్కడ పడవలను లంగరు కూడా వేయొచ్చు.ఈ ద్వీపం పచ్చని గడ్డి, సముద్రం వరకు విస్తరించి ఉన్న రాళ్లతో మంచి ప్రకృతి అందాలను కలిగి ఉంది. ఈ ప్రాంతం కొన్ని అతిపెద్ద సముద్ర పక్షుల కాలనీలను కలిగి ఉంది. ఇది అన్ని రకాల వన్యప్రాణులకు నిలయంగా ఉంది. రాక్ సీ లావెండర్, సువాసనగల ఆర్చిడ్ వంటి అరుదైన మొక్కలకు కూడా నిలయం.ఈ ద్వీపం ఫ్లీట్ దీవులలో ఒకటి. ఈ ద్వీపం విక్రయాన్ని నిర్వహిస్తున్న గాల్‌బ్రైత్ ప్రకారం, ఎవరైనా తమ సొంత ద్వీపాన్ని సొంతం చేసుకోవడం అరుదైన అవకాశంగా పేర్కొంది. సమీప పట్టణం ఆరు మైళ్ల దూరంలో ఉంది. సమీప రైలు స్టేషన్‌కు చేరుకోవడానికి రోడ్డు మార్గంలో గంట పడుతుంది. లండన్, ఎడిన్‌బర్గ్‌లు వరుసగా 350 మరియు 100 మైళ్ల దూరంలో ఉన్నాయి. ద్వీపంలో నిర్మాణానికి అనుమతి కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, కాబట్టి స్థానిక అధికారంతో అభివృద్ధి సాధ్యాసాధ్యాలను పరిశీలించడం కొనుగోలుదారుపై ఉంటుందని నివేదిక పేర్కొంది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం.. రాహుల్ గాంధీ భారీ రోడ్ షోలు
కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారపర్వం జోరుగా సాగుతుంది. నేతలు ర్యాలీలు చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రచార జోరుతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటకలోని విజయపురలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనం పైన నిలబడి, వీధుల్లో, సమీపంలోని భవనాలపై గుమిగూడిన ప్రజలపై రాహుల్ గాంధీ అభివాదం చేశారు. వారిలో చాలా మంది ‘రాహుల్, రాహుల్’ నినాదాలు చేస్తూ, బిగ్గరగా అరుస్తూ కనిపించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన రోడ్ షోను ప్రారంభించారు. రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రయాణిస్తున్న వాహనం శివాజీ సర్కిల్, కనకదాస సర్కిల్ నుంచి డప్పుచప్పుళ్ల మధ్య వీధుల గుండా వెళ్తుండగా.. ప్రజలు కాంగ్రెస్ జెండాలను పట్టుకుని వెంబడించారు. రోడ్ షోలో రాహుల్‌గాంధీ వెంట కర్ణాటక కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ ఎంబీ పాటిల్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రాహుల్‌గాంధీ తన రెండు రోజుల కర్ణాటక పర్యటనను కుడాల సంగమం నుంచి ప్రారంభించారు. అక్కడ ఆయన 12వ శతాబ్దపు కవి, సంఘ సంస్కర్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా ఈ రోజు బసవ జయంతిని జరుపుకున్నారు.
విదేశీ కరెన్సీ మార్పిడికి మోక్షం.. టీటీడీకి కేంద్రం స్పెషల్ ఆఫర్
విదేశీ కరెన్సీ డిపాజిట్ల అంశంలో టిటిడికి ఉరట లభించింది.ఎవరికి ఇవ్వని మినహాయింపుని టిటిడికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలుగా విదేశి కరేన్సి బ్యాంకులో డిఫాజిట్ చేసుకునేందుకు సేక్షన్ 50 మేరకు టిటిడి మినహయింపు ఇస్తూ కేంద్ర హోంశాఖ మినహయింపు ఇవ్వడంతో …గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న వివాదంకు పరిష్కారం లభించింది. అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారి దర్శనార్దం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు.స్వామివారి దర్శనార్దం తిరుమల విచ్చేసే భక్తులు తమ మ్రొక్కులు చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తూంటారు.ఇలా శ్రీవారికి హుండిలో భక్తులు సమర్పించే కానుకలు ఏటా 1600 కోట్లు దాటగా….బంగారం వెయ్యి కేజిలు దాటుతుంది.ఇక వెండి అయితే నెలకి 500 కేజిల వరకు భక్తులు కానుకలగా సమర్పిస్తారు.మరో వైపు స్వామివారి దర్శనార్దం విచ్చేసే భక్తులు స్వామివారికి కానుకలుగా విదేశి కరేన్సి కూడా సమర్పిస్తారు…ఇప్పుడు ఇదే టిటిడికి ఇబ్బందికరంగా మారింది.గతంలో స్వామివారికి భక్తులు సమర్పించిన విదేశి నాణేలను మార్పిడి చేసుకోవాడానికి టిటిడి నానా తిప్పలు పడింది.చిల్లర నాణేలు నిల్వలు టన్నులు కోద్ది వుండడం…నాటి విలువ కంటే….వాటి రవాణా చార్జిలే అధికంగా వుండడంతో చివరికి వాటిని టెండర్ల ప్రకియలో కేజిలుగా విలువకట్టి విక్రయించింది.మరో వైపు నోట్లను మాత్రం బ్యాంకులలో డిఫాజిట్ చేసుకుంటు వచ్చిన టిటిడికి…కేంద్ర ప్రభుత్వ నిభందనల మేరకు ఏఫ్ సిఆర్ఏ లైసేన్స్ పోందవలసి రాగా….2011లో టిటిడి కేంద్రానికి లైసేన్స్ జారి కోసం విజ్ఞప్తి చెయ్యగా…2015లో ఐదు సంవత్సరాల కాలపరిమితికి లైసేన్స్ జారి చేసింది కేంద్ర ప్రభుత్వం.కేంద్రం జారీచేసిన లైసెన్స్ 2020 జనవరికి కాలపరిమితి ముగిసే సమయంలో టిటిడి లైసెన్స్ రెన్యువల్ కోస0 2019లోనే అభ్యర్దించినా….అప్పట్లో మారిన చట్టం మేరకు టిటిడికి ఇబ్బందులు ప్రారంభమైయ్యాయి.
ప్రేమను ఒప్పుకోలేదని.. గదిలో బంధించి చిత్రహింసలు
తన ప్రేమని ఒప్పుకొకపోవడంతో ప్రేమోన్మాది యువతిని గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటిపై కాగిన నూనే పోయడంతో ఆ యువతి తీవ్రగాయాలపాలై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతోంది. ఈవ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలిసులు విచారణ చేపట్టారు.ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కంచర్ల ప్రియాంక కాకినాడలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు అనుదీప్ కొద్దికాలంగా ప్రియాంకను వేదిస్తున్నాడు. మొదట్లో ఇద్దరు స్నేహితులుగా ఉండటంతో అనుదీప్ ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. ఇదే క్రమంలో ప్రియాంకను ప్రేమపేరుతో లొంగదీసుకునే ప్రయత్నం చేసాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూనే ప్రేమించాలని వేదించడం మొదలు పెట్టాడు. ఈక్రమంలో ఆమెను ఒక గదిలో నిర్భందించి వేదిచండం మొదలుపెట్టాడు. దాదాపు రెండు మూడురోజుల పాటు ప్రియాంకను వేదించిన అనుదీప్ ఆమెపై కాగుతున్న నూనేను పోసిమరీ టార్చర్ పెట్టాడు. ఈక్రమంలో తీవ్ర గాయాలపాలైన ప్రియాంక అతని నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రియాంకను రక్షించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. కాలిన గాయలపాలైన ప్రియాంక ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఆహీరోయిన్ ను సెట్ లో వేధించిన అఖిల్.. నిజమేంటి ?
చిత్ర పరిశ్రమ అన్నాకా పుకార్లు వస్తూ ఉంటాయి. పోతు ఉంటాయి. కానీ, కొన్ని కొన్ని రూమర్స్ క్రియేట్ చేసి లైక్స్ కోసం పాకులాడే కొంతమందిలో ఉమైర్ సంధు మొదటి స్థానంలో ఉంటాడు. బాలీవుడ్ క్రిటిక్ అని చెప్పుకు తిరిగే ఇతడు.. ఆ ట్విట్టర్ లో నోటికి ఏది వస్తే అది రాసి.. సెలబ్రిటీలనే కాదు అభిమానులను కూడా విసిగిస్తున్నాడు. మొన్నటికి మొన్న శ్రీనిధిని యష్ వేధించాడని చెప్పాడు.. ఆ తరువాత సెలీనా జైట్లీపై పడ్డాడు.. ఇక ఇప్పుడు అక్కినేని వారసుడు అఖిల్ పై బురద జల్లడానికి ప్రయత్నించాడు. అఖిల్ నటిస్తున్న ఏజెంట్ లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఒక ఐటెం సాంగ్ చేసిన విషయం తెల్సిందే. వైల్డ్ సాలా అంటూ సాగే ఈ సాంగ్ నేడు రిలీజ్ కానుంది. ఇకపోతే వీరిద్దరి గురించి ఉమైర్ సంధు హద్దుమీరి ట్వీట్ చేశాడు. ” అఖిల్ .. ఏజెంట్ సెట్ లో ఊర్వశిని వేధించాడని, ఆమె అతడితో కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వారిద్దరి ఫోటోలను కూడా యాడ్ చేశాడు. ఇక ఈ వార్తలను కొట్టిపారేసింది. అందులో నిజం లేదని ఫేక్ అంటూ ఆ పోస్ట్ ను రీ పోస్ట్ చేయడమే కాకుండా ఉమైర్ సంధుకు ఇచ్చి పడేసింది. “నా లీగల్ టీమ్ ద్వారా పరువు నష్టం చట్టపరమైన నోటీసు నీకు ఖచ్చితంగా వస్తుంది. నకిలీ / హాస్యాస్పదమైన ట్వీట్లను, నీ పరిపక్వత లేని జర్నలిస్ట్‌లను చూసి ఖచ్చితంగా అసంతృప్తి చెందాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు సైతం మంచి పని చేశావ్ ఊర్వశి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ట్వీట్ కు ఉమైర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.